





Best Web Hosting Provider In India 2024

నీరు తాగితే జుట్టు ఊడిపోదా? వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే ఏం చేయాలి?
బిజీ లైఫ్‌లో మనం సహజంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఈ సమస్య పరిష్కారానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉండొచ్చు. కానీ, కేవలం నీరు తాగడం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుందని మీరు గమనించారా.. అయితే ఇది తెలుసుకోండి.

వెంట్రుకలు రాలిపోతుండటం, చిన్న వయస్సులోనే బట్టతల రావడం ఈ రోజుల్లో చాలామందిలో కనిపిస్తున్న సమస్య. మీరనుకుంటున్నట్లు దీనికి కారణం కేవలం మీరు వాడే షాంపూ లేదా హెయిర్ ఆయిల్ మాత్రమే అనుకోవద్దు. మీరు తీసుకునే ఆహారం కూడా ఓ రకంగా జుట్టుపై ప్రభావం చూపిస్తుందట. శరీరానికి సరిపడ హైడ్రేషన్ లేకపోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లు కూడా కనిపిస్తుంది. ఫలితంగా తలలోని వెంట్రుకలు బలహీనపడిపోతాయి. దీనికి కారణంగా సులభంగా తెగిపోవడం, కొన్నిసార్లు రాలిపోవడం కూడా జరుగుతుంది.
ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించుకోవాలంటే మీకు కావాల్సింది కేవలం నీరు మాత్రమే. శరీరానికి హైడ్రేషన్ అందించి జుట్టు రాలిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు వెంట్రుకలకు బలం కూడా అందుతుంది. సరైన మోతాదులో నీరు తాగితే జుట్టులో తేమ మెరుగై బలపడుతుంది. వృద్ధి వేగంగా పెరగడంతో పాటు స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది.
నీరు తాగితే జుట్టుకు ఏ విధంగా సహాయపడుతుంది? ఏ సమయంలో నీరు తాగితే జుట్టు బలంగా ఉంటుంది? తెలుసుకుందాం రండి.
నీరు తక్కువైతే జుట్టు చెప్పే సంకేతాలు
నీరు తక్కువగా తాగుతున్నామని, శరీరం తెలియజేసే సంకేతాల్లో జుట్టు ముందుంటుంది. ఇటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటే, నీటి శాతం తగ్గిపోయిందని వెంటనే నీరు తాగే పద్ధతిని మార్చుకోవాలని గుర్తుంచుకోండి.
- జుట్టు పొడిగా మారడం, నిర్జీవంగా కనిపించడం
- స్కాల్ప్‌లో చుండ్రు, దురద రావడం
- తేలికగా తెగిపోతుండటం
- వెంట్రుకల అంచులు చిట్టినట్లుగా మారడం
- పెరుగుదల నిదానించడం
ఈ లక్షణాలు కనిపిస్తే వెంట్రుకలకు హైడ్రేషన్ సరిపోవడం లేదని గుర్తించాలి. వెంటనే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
హైడ్రేషన్ శరీరానికి ఎలా సహాయపడుతుంది?
నీరు తాగడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెంట్రుకలు పట్టి ఉంచే కుదుళ్లను బలంగా మార్చుతుంది. హైడ్రేషన్ గా ఉండటం వల్ల ఇంకే లాభాలు కలుగుతాయంటే,
- మనం తీసుకునే ఆహారంలో ఉన్న బయోటిన్, ఐరన్, విటమిన్లు వంటివి స్కాల్ప్ వరకు సులభంగా చేరతాయి.
- వెంట్రుకల కుదుళ్లు బలంగా మారి ఊడిపోవడాన్ని తగ్గిస్తాయి.
- మొఖంపై కనిపించే చర్మం మీదే కాకుండా టాక్సిన్లు తొలగిపోయి కుదుళ్లు కూడా ఆరోగ్యంగా మారతాయి.
- ఊడిపోయిన తలభాగంలో వెంట్రుకలు రావడానికి తోడ్పడుతుంది.
దీనిని బట్టి జుట్టు పెరుగుదలకు కేవలం ఆయిల్స్ మీదే ఆధారపడకుండా రోజుకి తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేషన్‌గా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.
హైడ్రేషన్ గా ఉండేందుకు రోజుకు ఎంత నీరు తాగాలి?
అసలే సమ్మర్. ఈ సమయంలో కచ్చితంగా రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగకపోతే ఇబ్బందులు తప్పవు. ఉదయాన్నే ఫ్రిడ్జ్‌లో నీరు తాగాలని అనుకోకుండా గోరువెచ్చని నీరు తాగడానికే ప్రాధాన్యత ఇవ్వండి. కేవలం నీటిని లిక్విడ్ రూపంలో మాత్రమే తీసుకోకుండా నీరు ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను కూడా ఆప్షన్ గా తీసుకోవాలి. దీని కోసం పుచ్చకాయ, ఖర్బూజా, దోసకాయ, సొరకాయ వంటి వాటిని ఎంచుకోవచ్చు.
బయటి హైడ్రేషన్ కోసం ఏమేం చేయాలంటే:
ఆహారం తీసుకోవడం ద్వారా హైడ్రేషన్‌గా ఉండటంతో పాటు బయట నుంచి కూడా హైడ్రేషన్‌గా ఉండొచ్చు. దీని కోసం సల్ఫేట్-ఫ్రీ షాంపూ వాడాలి. వారంలో ఒక్కసారి హెయిర్ మాస్క్ ధరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. హైడ్రేటింగ్ హెయిర్ సీరం లేదా లీవ్-ఇన్ కండిషనర్ వాడటం మంచిది.
నీరు అందుబాటులో లేదని, కాస్త దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని బద్దకించండి. పనిచేసే ప్రదేశంలోనే ఒక బాటిల్ తెచ్చిపెట్టుకోండి. గంటకి ఒకసారి అలారం పెట్టుకుని కొంచెంకొంచెంగా నీరు తాగడానికి ప్రయత్నించాలి. రిఫ్రెషింగ్ కలుగజేస్తాయని మీరు తీసుకునే కాఫీ, ఆల్కహాల్ వంటి ద్రావణాలకు వీలైనంత దూరంగా ఉండండి. డ్రైయర్లు, స్ట్రెయినర్లు వంటి స్టైలింగ్ పరికరాలకు దూరంగా ఉండండి.
సంబంధిత కథనం