






Best Web Hosting Provider In India 2024

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్ రామ్ యాక్షన్ విధ్వంసం.. ఇంటెన్సిటీ, ఎమోషన్‍తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్
Arjun Son Of Vyjayanthi Trailer: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్‍తో ఆసక్తికరంగా ఉంది. కల్యాణ్ రామ్ దుమ్మురేపారు.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాపై మొదటి నుంచి క్యూరియాసిటీ ఉంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రంపై టీజర్ తర్వాత బాగా బజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కూడా ఓ ప్రధాన పాత్ర చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ నేడు (ఏప్రిల్ 12) వచ్చేసింది.
ఐపీఎస్ కొడుకు క్రిమినల్!
సిటీలోని క్రిమినల్స్ టాప్-10 లిస్ట్ తయారు చేయాలని పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్.. అడగడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ షురూ అయింది. వన్ టూ టెన్ ఒకడే అని.. అర్జున్ (కల్యాణ్ రామ్) అని శ్రీకాంత్‍కు ఓ పోలీస్ చెబుతాడు. అప్పుడే అర్జున్ రౌడీలను చితకబాదేస్తుంటాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కుమ్మేస్తుంటాడు. ఈ క్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి (విజయశాంతి).. కొడుకు అర్జున్‍ను చెంపదెబ్బ కొడుతుంది.
ఎంతో గొప్ప పోలీస్ ఆఫీసర్ అయిన మీ కొడుకు క్రిమినల్ కావడం ఏంటని వైజయంతిని శ్రీకాంత్ ప్రశ్నిస్తాడు. కష్టాల్లో ఉన్న వారి కోసం రౌడీలను ఎదిరిచేందుకు అర్జున్ హింస బాటపడతాడు. అన్యాయాలు చేసే వారిని చితకబాదేస్తుంటాడు. మహమ్మద్ యాజుద్దీన్ పఠాన్ (సోహైల్ ఖాన్) అనే విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో అర్జున్ పోరాటం మరింత తీవ్రమవుతుంది.
ఆయుధంలా పెంచి యుద్ధం చేయవద్దంటే..
మరోవైపు, అర్జున్ తీరుతో వైజయంతి అసంతృప్తితో ఉంటుంది. తల్లికి నచ్చేలా ఉండాలని అర్జున్ సతమతమవుతుంటాడు. అర్జున్‍ను ఆయుధంలా పెంచి యుద్ధం చేయవద్దంటే అంటూ వైజయంతికి ప్రశ్న ఎదురవుతుంది. తల్లికి రక్షణగానూ అర్జున్ ఉంటాడు. యాక్షన్‍తో రౌడీలను అడ్డుకుంటూ ఉంటాడు. పోలీస్ డ్రెస్‍లోనూ ఓ ఫైట్ ఉంది. రౌడీల దాడిలో తీవ్రంగా గాయపడిన వైజయంతితో హ్యాపీ బర్త్ డే అమ్మ అని అర్జున్ చెప్పడంతో ఎమోషనల్‍గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ ముగిసింది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి.. యాక్షన్, సెంటిమెంట్ కలబోతతో ఈ మూవీని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. టేకింగ్ అదిరిపోయేలా కనిపిస్తోంది.
యాక్షన్, సెంటిమెంట్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్లో కల్యాణ్ రామ్ యాక్షన్ విధ్వంసం చేశారు. ఫైట్లలో దుమ్మురేపారు. విజయశాంతి స్థాయికి తగ్గ పాత్ర ఈ చిత్రంలో ఉన్నట్టు అర్థమవుతోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా, కొడుకును దారిలోకి తెచ్చుకోవాలని తపన పడే తల్లిగా ఆమెకు చాలా ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. మొత్తంగా హైవోల్టేజ్ యాక్షన్, ఇంటెన్సిటీ, తల్లీకొడుకు సెంటిమెంట్, ఎమోషన్‍తో ఫుల్ ప్యాకేజ్‍లా ఈ ట్రైలర్ ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేసింది. అర్జున్ ఎందుకు హింస బాటపడతాడు? క్రిమినల్ అని ఎందుకు అనిపించుకుంటాడు? తల్లికి నచ్చినట్టు మారాాడా? గ్యాంగ్‍స్టర్‌ను ఎలా ఎదుర్కొన్నాడనే అంశాల చుట్టూ ఈ మూవీ సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. నేడు (ఏప్రిల్ 12) ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ట్రైలర్ రిలీజైంది. కల్యాణ్ రామ్ సోదరుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్లో అజ్నీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్సిటీతో సాగింది. యాక్షన్ సీన్లకు తగ్గట్టుగా సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అశోక ఆర్ట్స్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ మూవీకి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేశారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం