





Best Web Hosting Provider In India 2024

Jr NTR: అన్న కాలర్ ఎగరేసిన జూనియర్ ఎన్టీఆర్.. లీక్ చెప్పకుండా ఆపిన కల్యాణ్ రామ్.. వార్ 2 గురించి కామెంట్
Jr NTR: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అన్నదమ్ములు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఓ లీక్ చేయకుండా ఎన్టీఆర్‌ను రామ్ ఆపారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. వచ్చే వారం ఏప్రిల్ 18వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఏప్రిల్ 12) హైదరాబాద్‍లో జరిగింది. తన అన్న నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈవెంట్‍కు హాజరయ్యారు స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఈవెంట్‍లో కొన్ని విషయాలు ఆకట్టుకున్నాయి. అన్నదమ్ముల బాండింగ్ మరోసారి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.
కల్యాణ్ రామ్ కలర్ ఎగరేసిన ఎన్టీఆర్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా క్లైమాక్స్ చూసి అందరి కళ్లలో నీళ్లు తిరుగుతాయని ఎన్టీఆర్ అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. కాలర్ ఎగరేయాలని ప్రతీసారి తాను చెబుతుంటానని, కానీ అన్నా ఈసారి నువ్వు ఎగరెయ్ అని కల్యాణ్ రామ్‍ను ఎన్టీఆర్ అడిగారు.
కాలర్ ఎగిరేసేందుకు వద్దు అని కల్యాణ్ రామ్ అన్నారు. దీంతో అన్న షర్ట్ కాలర్‌ను ఎన్టీఆరే పట్టుకొని ఎగరేశారు. “పోనీ ఈసారి కల్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నా. సినిమా చూస్తున్నప్పుడు కళ్లలో నుంచి నీళ్లను ఆపుకోవడం నా వల్ల కాలేదు. రేపు థియేటర్లలో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది” అని ఎన్టీఆర్ చెప్పారు.
ఎన్టీఆర్‌ను ఆపిన కల్యాణ్ రామ్
క్లైమాక్స్ గురించి దాచాల్సిన అవసరం లేదు కదన్నా అంటూ ఎన్టీఆర్ ఏదో చెప్పాలనుకున్నారు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి క్లైమాక్స్ గురించి లీక్ చేస్తాడేమోనని భయపడి ఎన్టీఆర్‌ను అడ్డుకున్నారు కల్యాణ్ రామ్. ఆయనను పట్టుకున్నారు. ఇద్దరూ నవ్వులు చిందించారు. “సర్లేండి. ఎంతో దూరం లేదు. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే” ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‍ను రామలక్ష్మణులు అని అన్నారు విజయశాంతి.
సహనంతో ఉండండి
త్వరలో అభిమానులతో ఫ్యాన్స్ మీట్ ఉంటుందనేలా ఎన్టీఆర్ హింట్ ఇచ్చారు. “ఇప్పుడు ఎండల్లో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు. పకడ్బందీగా ప్లాన్ చేసి మిమ్మల్ని కలుస్తా. కానీ కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి. త్వరలోనే అందరం మాట్లాడుకుందాం. ప్లాన్ చేసినప్పుడు అందరికీ బాగుండాలి. ఈ సంవత్సరమైతే అందర్నీ కలుస్తా” అని ఎన్టీఆర్ చెప్పారు.
వార్ 2.. అద్భుతంగా వచ్చింది
ఇటీవల ఓ ఈవెంట్‍లో ప్రశాంత్ నీల్‍తో మూవీ గురించి మాట్లాడనని, అంత కంటే ముందే వార్ 2 రానుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. వార్ 2 మూవీ అద్భుతంగా వచ్చిందని తెలిపారు. ఈ మూవీలో హృతిక్ రోషన్‍తో కలిసి ఎన్టీఆర్ నటించారు. ఈ చిత్రంతోనే డైరెక్ట్ బాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే, ప్రశాంత్ నీల్‍తో ఓ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం చేస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కల్యాణ్ రామ్ తల్లి పాత్రలో ముఖ్యమైన రోల్‍లో నటించారు సీనియర్ నటి విజయ శాంతి. ఈ ఈవెంట్‍లోనే రిలీజైన ట్రైలర్ యాక్షన్, ఎమోషన్‍తో అదిరిపోయింది. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అజ్నీష్ లోకనాథ్ సంగీతం అందించగా.. అశోక ఆర్ట్స్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి.
సంబంధిత కథనం