




Best Web Hosting Provider In India 2024

Tollywood: కొత్త కాంబినేషన్లు కుదిరాయ్ – ఊహించని దర్శకులతో స్టార్ హీరోల సినిమాలు ఫిక్స్!
Tollywood: టాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్స్ సెట్టయ్యాయి. ఎవరూ ఊహించని హీరోలు, దర్శకుల కలయికలో సినిమాలు రాబోతున్నాయి. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మూవీ చేయబోతున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ మూవీకి బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Tollywood: కొత్త కాంబినేషన్ల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. డిఫరెంట్ ఇమేజ్‌లు ఉన్న హీరో, దర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అనౌన్స్‌మెంట్ నుంచే ఆడియెన్స్‌లో మొదలవుతుంది. కాంబినేషన్స్‌తోనే సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్ కొన్ని కుదిరాయి. అవి ఏవంటే?
పూరి జగన్నాథ్…విజయ్ సేతుపతి…
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలయికలో ఓ మూవీ రాబోతుంది. ఇటీవలే ఈ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ పాన్ ఇండియన్ మూవీని ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మించబోతున్నాడు. విజయ్ సేతుపతి మూవీలో టబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బాలకృష్ణ – హరీష్ శంకర్
మాస్, హీరోయిజం, యాక్షన్ అంశాలకు చిరునామాగా బాలకృష్ణ సినిమాలు ఉంటాయి. స్టైలిష్ ఎంటర్‌టైనరలకు కేరాఫ్ అడ్రస్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబోలో ఫస్ట్ టైమ్ ఓ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ స్టైల్‌లోనే కమర్షియల్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ సాగబోతున్నట్లు తెలిసింది. ఇందులో బాలకృష్ణ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చెబుతోన్నారు. కోలీవుడ్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
రవితేజ – కిషోర్ తిరుమల మూవీ
సెన్సిబుల్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమలతో మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. రవితేజను దృష్టిలో పెట్టుకొని కిషోర్ తిరుమల విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో ఓ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రవితేజ ఈ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది.
సంబంధిత కథనం