మంచివి కావని తెలిసినా మార్చుకోలేని అలవాట్లు వేధిస్తున్నాయా.. ఈ 9 టిప్స్ పాటించండి!

Best Web Hosting Provider In India 2024

మంచివి కావని తెలిసినా మార్చుకోలేని అలవాట్లు వేధిస్తున్నాయా.. ఈ 9 టిప్స్ పాటించండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 13, 2025 05:30 AM IST

రెగ్యూలర్‌గా చేసే పనుల్లో చాలా వరకూ మంచివి కావని మన మనస్సుకు తెలుసు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లోనో, ఏం కాదులే అనే ధోరణితోనో పట్టించుకోకుండా యథావిధిగా వెళ్లిపోతుంటాం. ఈ విధమైన ఆలోచన మానుకుని ఒక్క అడుగు ముందుకేయడం వల్ల జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవచ్చు. అదెలా అంటే..

ఈ 9 అలవాట్లు మార్చుకోండి
ఈ 9 అలవాట్లు మార్చుకోండి

మీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవడమే కాకుండా సింపుల్ పనులతో కొత్తగా మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి. అవి తెలిసిన తర్వాత ఛ.. ఎప్పుడో తెలుసుకుని ఉంటే బాగుండేదని రిగ్రెట్ ఫీలవుతారు. అంతేకాదు, మీ రెగ్యూలర్ లైఫ్ ను చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు. మరింకెందుకు ఆలస్యం, మీరు అలవరచుకోవాల్సిన, వదిలేయాల్సిన అలవాట్లేంటో తెలుసుకుందామా..

ఇంటర్నెట్ కామెంట్లు:

మనలో చాలా మంది సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు. అదే సమయంలో కంటికి కనిపించిన పోస్టులకు లైకులు, కామెంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం చేసే కామెంట్లకు రియాక్షన్ వేరేలా ఉండొచ్చు. లేదా మన పోస్టులకు వచ్చే కామెంట్లు మనకి కాస్త బాధ కలిగించేవిగా అనిపించొచ్చు. దాని కోసం మనం మరో కామెంట్ చేస్తే వాదన పెరుగుతుంది, తప్పించి సమస్య పరిష్కారం అవదు. దీని వల్ల మానసిక ప్రశాంతత లోపించడం, సమయం వృథాకావడం రెండూ జరుగుతాయి. కాబట్టి వివాదాస్పదంగా మారిన పోస్టు లేదా కామెంట్ డిలీట్ చేసి ముందుకెళ్లిపోవడం మంచిది.

కొత్త పని చేయడం:

రోజుకొక ఇంటిపని చేయండి లేదా కొత్త విషయం నేర్చుకోండి. మీకు ఇష్టం లేకపోయినా ఆ పని మానసికంగా పాజిటివ్ ఫీలింగ్‌ను కలుగజేస్తుంది. ప్రత్యేకించి డిప్రెషన్ తో బాధపడేవారికి ఇది ఉపయోగకరం. ఆందోళనలను దూరంగా ఉంచి టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల నెగెటివ్ ఆలోచనలు దూరమవుతాయి.

ఫలితాలను అనుభవాలుగా పరిగణించండి:

మీరు జీవితంలో ఎదుర్కొనే పరాభవాలైనా, విజయాలైనా వాటిని అనుభవాలుగా పరిగణించండి. ఫలితాలను చూసి భావోద్వేగాలకు గురైతే జీవితం అక్కడితో ఆగిపోలేదని గుర్తుంచుకోండి. ప్రతి ఫలితాన్ని అనుభవంగా మలచుకొని వెళ్లిపోవడమే జీవితం.

సొంత ఊరిని వదిలేయండి:

మీరెప్పుడూ ఉన్నచోటే ఉండి కొత్త వ్యక్తిలా మారాలని ప్రయత్నించకండి. కంఫర్ట్ జోన్ లో ఉండి మీలో బెటర్మెంట్ రావాలనుకోవడం పొరబాటే అవుతుంది. అలా కాకుండా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడి ఆటుపోట్లను తట్టుకొని జీవించడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు నిర్మించుకొని ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకోండి. అప్పుడే మీలో కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు.

హద్దులు పెట్టుకుని నో చెప్పేయండి:

జీవితంలో చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం నో చెప్పడం. ఇది అస్సలు తప్పు విషయం కాదు. మీరు నో చెప్పడం అలవాటు చేసుకోకపోతే ఇతరులు మీ నుంచి ఆశించిన ప్రతి దానిని నెరవేర్చాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని హద్దులు పెట్టుకుని అవి దాటి మీరే పని చేయకూడదని అనుకుంటే, మిగిలిన వాటికి నో చెప్పేసేయడమే బెటర్.

రోజూ వ్యాయామం:

రోజూ వ్యాయామం చేయడం అనేది మీలో శారీరక, మానసిక బలాన్ని పెంచుతుంది. వయస్సు పెరుగుతున్నా కూడా యవ్వనంగా చురుకుగా ఉండటానికి వ్యాయామం తోడ్పడుతుంది.

స్మోకింగ్, డ్రింకింగ్ ఆపేయండి:

లైఫ్ లో ఎదగాలనుకునే వారు ముందుగా వ్యసనాలైన స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ లను పక్కకుపెట్టేయాలి. ఇవి సమయాన్ని హరించడంతో పాటు మీ భవిష్యత్ ను పాడు చేస్తాయి.

పని మీద ఫోకస్ పెంచండి:

ఉదయాన్నే ఎంతో ట్రాఫిక్ ఫేస్ చేసి ఆఫీసుకు వెళ్లిన మీరు మొక్కుబడిగా పని నడిపించకండి. ఆఫీసులో ఉన్నంతసేపు ప్రభావవంతంగా పని చేయడం వల్ల తోటివారి ముందు మీ విలువ పెరగడంతో పాటు సంతృప్తికర జీవితాన్ని గడుపుతారు.

రోజుకొక పండు తినండి:

వైద్యులు సూచించినట్లు ఆపిల్ తిన్నా లేదా ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తీసుకున్నా మంచిదే. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకున్నంత కాలం మీ భవిష్యత్ ఆశలను కాపాడుకున్న వాళ్లవుతారు.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024