






Best Web Hosting Provider In India 2024

Sumaya Reddy: రైటర్, నిర్మాత, హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి.. నన్ను నమ్మి డబ్బులు పెడతారా అంటూ!
Sumaya Reddy About Dear Uma In Trailer Launch Event: తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, రైటర్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్న సినిమా డియర్ ఉమ. ఈ మూవీలో పృథ్వీ అంబర్ హీరోగా చేశాడు. డియర్ ఉమ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో సుమయ రెడ్డి కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

Sumaya Reddy About Dear Uma In Trailer Launch Event: తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన సినిమా ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ హీరోగా తెరకెక్కిన డియర్ ఉమ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
అర్జున్ రెడ్డి సంగీత దర్శకుడు
అలాగే, డియర్ ఉమ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రధన్ (అర్జున్ రెడ్డి ఫేమ్) సంగీత దర్శకుడిగా పని చేశారు. డియర్ ఉమ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
డియర్ ఉమ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా డియర్ ఉమ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా డియర్ ఉమ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్, రైటర్, ప్రొడ్యూసర్ అయిన సుమయ రెడ్డి ఆసక్తికర విశేషాలను కామెంట్స్ చేసింది.
ఎంతో కంటెంట్ వచ్చేది
సుమయ రెడ్డి మాట్లాడుతూ .. “ఓ మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాలని అనుకున్నాను. కథ రాస్తూ ఉండగా ఎంతో కంటెంట్ వచ్చేది. రాజేష్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఆయన తన కథలన్నీ పక్కన పెట్టి నా కథ మీద దృష్టి పెట్టారు. అయితే నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారా అని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ నన్ను సపోర్ట్ చేశారు” అని అన్నారు.
ఒప్పుకుంటారా అనుకున్నాను
“నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. రధన్ గారు చేసిన అందాల రాక్షసి పాటలు చాలా ఇష్టం. అసలు రధన్ గారు మా సినిమాని ఒప్పుకుంటారా? లేదా? అని అనుకున్నాను. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అన్నారు” అని హీరోయిన్ సుమయ రెడ్డి తెలిపింది.
నా విజయం వెనుక
“నన్ను నమ్మి హీరోగా చేసిన పృథ్వీ గారికి థాంక్స్. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజయం వెనుక నా టీమ్ ఉంది. ఏప్రిల్ 18న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి” అని తెలుగు హీరోయిన్ సుమయ రెడ్డి కోరింది.
దియా తర్వాత ఫాలోయింగ్
హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. “తెలుగులో దియా తరువాత నా మీద ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది. నాగేశ్ వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. సుమయ గారు ఈ సినిమాను రాశారు.. నిర్మించారు.. హీరోయిన్‌గా నటించారు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఎంతో కూల్‌గా ఉండేవారు” అని అన్నాడు.
మొదటి తెలుగు మూవీ
“ఇది నా మొదటి తెలుగు సినిమా అవ్వడం నాకు ఆనందంగా ఉంది. రధన్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఏప్రిల్ 18న రాబోతోన్న మా సినిమాను అందరూ చూడండి” అని హీరో పృథ్వీ అంబర్ చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం