






Best Web Hosting Provider In India 2024

Hit 3 Trailer Time: హిట్ 3 ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఫిక్స్.. సినిమాకు సెన్సార్ కంప్లీట్.. వైలెన్స్ నెక్స్ట్ లెవెల్‍లో!
Hit 3 Trailer Release Date, Time: హిట్ 3 సినిమా ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఫిక్స్ అయింది. ట్రైలర్ కోసం ఈవెంట్ కూడా జరగనుంది. ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’ (హిట్: థర్డ్ కేస్) సినిమాకు క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ మూవీ ఎంత వైలెంట్‍గా ఉండనుందో టీజర్ ద్వారానే తెలిసిపోయింది. దీంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. హిట్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ఈ మూవీ వస్తోంది హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో హిట్ 3 ట్రైలర్ వచ్చేస్తోంది. టైమ్ కూడా ఖరారైంది.
హిట్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఇదే
హిట్ 3 సినిమా ట్రైలర్ రేపు (ఏప్రిల్ 14) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వాల్ పోస్టర్ సినిమా నేడు (ఏప్రిల్ 12) అధికారికంగా వెల్లడించింది. డేట్ ఇప్పటికే ఖరారు కాగా.. టైమ్‍ను ఇప్పుడు ప్రకటించింది మూవీ టీమ్. రేపు 11.07 గంటలకు ఎంతో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేయనుంది.
హిట్ 3 ట్రైలర్ రిలీజ్ కోసం ఈవెంట్ కూడా జరగనుంది. వైజాగ్‍లోని సంగం థియేటర్లో రేపు (ఏప్రిల్ 14) ఉదయం 10.30 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. “వైజాగ్! సర్కార్‌కు.. అతడి మ్యాడ్‍నెస్‍కు వెల్‍కమ్. హిట్ 3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి వైజాగ్ సంగం థియేటర్లో జరగనుంది. హిట్ 3 ట్రైలర్ రేపు ఉదయం 11.07 గంటలకు వస్తుంది” అని వాల్‍పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మోస్ట్ వైలెంట్‍గా..
హిట్ 3 ట్రైలర్ ఫుల్ వైలెన్స్‌తో ఉండే ఛాన్స్ ఉంది. టీజర్‌తోనే నాని ఆశ్చర్యపరిచారు. ట్రైలర్ అంతకు మించి రక్తపాతంతో ఉంటుందని, అవాక్కయ్యేలా చేస్తుందని టాక్.
ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కట్స్, బ్లర్స్.. రన్‍టైమ్ ఇదే
హిట్ 3 సినిమా సెన్సార్ తాజాగా పూర్తయింది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అయితే, ఏ రేటింగ్ ఇచ్చినా కూడా కొన్ని షాట్లను కట్ చేయడంతో పాటు కొన్ని చోట్ల బ్లర్ చేయాలని సెన్సార్ సూచించినట్టు తెలుస్తోంది. అంటే ఈ చిత్రంలో వైలెన్స్ ఏ రేంజ్‍లో ఉంటుందో అర్థమవుతోంది. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్లతో ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. కాగా, నాని చిత్రానికి ఏ సర్టిఫికేట్ రావటం ఇదే తొలిసారి. దీంతో 18 ఏళ్ల వయసు లోపలికి వారికి హిట్ 3 చూసేందుకు థియేటర్లలోకి ఎంట్రీ ఉండదు.
హిట్ 3 సినిమా రన్‍టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండనుంది. సెన్సార్ తర్వాత సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు భారీగా ఉన్నాయని, నాని ఇంత వైలెంట్‍గా చూడడం ఇదే తొలిసారి అనే సెన్సార్ టాక్ బయటికి వచ్చింది.
హిట్ 3 చిత్రంలో అర్జున్ సర్కార్ అనే దయ, జాలి లేని పోలీస్ ఆఫీసర్‌గా నాని నటించారు. సైలేశ్ కొలను ఈ క్రైమ్ యాక్షన్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా నటించారు. కోమలీ ప్రసాద్, సూర్యశ్రీనివాస్, రావు రమేశ్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో కార్తీ క్యామియో రోల్‍లో కనిపించనున్నారనే రూమర్లు ఉన్నాయి. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నానినే ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం