




Best Web Hosting Provider In India 2024

Manchu Manoj: మనోజ్‍ను చూసి ఏడ్చేసిన మంచు లక్ష్మి: వీడియో వైరల్
Manchu Manoj – Manchu Lakshmi: తమ్ముడు మంచు మనోజ్‍ను చూడగానే ఎమోషనల్ అయ్యారు మంచు లక్ష్మి. కన్నీరు పెట్టుకున్నారు. ఆ వివరాలు ఇవే..

మంచు కుటుంబంలో కొంతకాలంగా తగాదాలు విపరీతంగా సాగుతున్నాయి. గొడవలు రచ్చకెక్కాయి. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణుతో మంచు మనోజ్ వివాదం కొనసాగుతోంది. ఇటీవలే తండ్రి మోహన్ బాబు ఇంటి ఎదుట బైటాయించారు మనోజ్. ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్‍లో అక్క మంచు లక్ష్మిని కలిశారు మనోజ్.
మనోజ్‍ను చూసి లక్ష్మి కన్నీరు
మంచు లక్ష్మికి చెందిన టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ వచ్చారు. స్టేజ్ వెనుక నుంచి వచ్చి మంచు లక్ష్మిని తట్టి సర్‌ప్రైజ్ ఇచ్చారు మనోజ్. వెనక్కి తిరిగి తమ్ముడు మనోజ్‍ను చూసిన వెంటనే ఎమోషనల్ అయ్యారు లక్ష్మి. కన్నీరు పెట్టుకున్నారు.
మనోజ్ ముందు కూర్చొని భావోద్వేగంతో ఏడ్చేశారు లక్ష్మి. ఆమెను మనోజ్, అతడి భార్య మోనిక ఆమెను ఓదార్చారు. కుటుంబంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మనోజ్‍ను చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు మంచు లక్ష్మి.
వైరల్ అవుతున్న వీడియో
మనోజ్‍ను చూసి లక్ష్మి ఎమోషనల్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కాతమ్ముళ్ల అనుబంధం అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తమ్ముడంటే అక్కకు ఎప్పుడైనా ప్రేమ ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మంచు కుటుంబంలో ఆస్తుల గొడవ కొంతకాలంగా తీవ్రమైంది. అన్న మంచు విష్ణును తనను ఇబ్బందులు పెడుతున్నారని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై పలుసార్లు పోలీస్ స్టేషన్లలో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. బహిరంగంగానూ గొడవలు జరిగాయి. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ రచ్చ హాట్‍టాపిక్‍గా సాగుతోంది.
ఇటీవలే తండ్రి మోహన్ బాబు ఇంటి ఎదుట మనోజ్ బైటాయించారు. తన కారును విష్ణు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కూతురు పుట్టిన రోజు వేడుకలకు రాజస్థాన్‍కు వెళ్లిన సమయంలో కొందరు తమ ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు ధ్వంసం చేశారని, కార్లు ఎత్తుకెళ్లారని మనోజ్ అన్నారు. మంచు విష్ణు ఇలా చేయించారని ఆరోపించారు. తాను ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవడం లేదని కూడా మనోజ్ చెప్పారు.
కాగా, మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాల్సింది. అదే తేదీకి మంచు మనోజ్ నటించిన భైరవం చిత్రం కూడా పోటీకి దిగనుందనే రూమర్లు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా అన్నదమ్ముల పోరు ఉంటుందా అనే ఆసక్తి రేగింది. అయితే, కన్నప్ప వాయిదా పడి జూన్ 27వ తేదీకి వెళ్లింది. భైరవం కూడా ఇంకా తేదీ ఖరారు చేసుకోలేదు.
సంబంధిత కథనం