Vijayashanthi: సరిలేరు నీకెవ్వరు చేశాను, కానీ.. మహేశ్ బాబు మూవీపై విజయశాంతి కామెంట్స్.. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంటాడంటూ!

Best Web Hosting Provider In India 2024

Vijayashanthi: సరిలేరు నీకెవ్వరు చేశాను, కానీ.. మహేశ్ బాబు మూవీపై విజయశాంతి కామెంట్స్.. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంటాడంటూ!

Sanjiv Kumar HT Telugu
Published Apr 13, 2025 06:49 AM IST

Vijayashanthi Comments In Arjun Son Of Vyjayanthi Pre Release Event: విజయశాంతి నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. తాజాగా జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీపై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సరిలేరు నీకెవ్వరు చేశాను, కానీ.. మహేశ్ బాబు మూవీపై విజయశాంతి కామెంట్స్.. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంటాడంటూ!
సరిలేరు నీకెవ్వరు చేశాను, కానీ.. మహేశ్ బాబు మూవీపై విజయశాంతి కామెంట్స్.. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంటాడంటూ!

Vijayashanthi Comments In Arjun Son Of Vyjayanthi Pre Release Event: స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఇటీవల కాలంలో కీలక పాత్రలు పోషిస్తూ నటిగా అలరిస్తున్నారు. అలా ఇది వరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ చేశారు విజయశాంతి.

ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్

లేటెస్ట్‌గా తెలుగులో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో నటించారు విజయశాంతి. ఇందులో హీరో అయిన నందమూరి కల్యాణ్ రామ్‌కు తల్లిగా యాక్ట్ చేశారు విజయశాంతి. తాజాగా శనివారం (ఏప్రిల్ 13) అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీపై, ఈ సినిమాలోని పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

తల్లి కొడుకు మధ్య యుద్ధం

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. “మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో తల్లి కొడుకు పాత్రల మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది” అని అన్నారు.

మార్పులు చెప్పాను

“చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి సినిమా చేయమని నా అభిమానులు అడుగుతున్నారు. సరిలేరు నీకెవ్వరు చేశాను. కానీ, ఇంకా మంచి పాత్ర చేయమని అడిగారు. అలాంటి మంచి పాత్ర ఎలా వస్తుంది అని భావిస్తున్న తరుణంలో డైరెక్టర్ ప్రదీప్ గారు వచ్చి ఈ కథ చెప్పారు. చాలా మంచి కథ. అక్కడక్కడ కొన్ని మార్పులు చెప్పాను. డైరెక్టర్ గారు విన్నారు. కల్యాణ్ రామ్ గారితో వెళ్లి నేను ఈ సినిమా చేస్తానని చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది” అని విజయశాంతి తెలిపారు.

సెన్సార్ రిపోర్ట్ అలా

“ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా పని చేసాం. ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్‌గా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫస్ట్ రిపోర్టు మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మి రాజుగారు చెప్పారు. సెన్సార్ రిపోర్టు కూడా వచ్చింది” అని విజయశాంతి వెల్లడించారు.

పోటాపోటీ పడి నటించామని

“సినిమాలో ఇద్దరం (విజయశాంతి, కల్యాణ్ రామ్) పోటాపోటీ పడి యాక్ట్ చేసామని చెప్పారు. ఇంకో పెద్ద హిట్ కొట్టబోతున్నారని పేపర్‌లో వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. కచ్చితంగా హిట్టు కొట్టబోతున్నామని ఫిక్స్ అయిపోయాం” అని విజయశాంతి చెప్పారు.

రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంటాడు

“తల్లి నిరంతరం తన బిడ్డ కోసం త్యాగం చేస్తూనే ఉంటుంది. ఆరాటపడుతూనే ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంటాడు. అయినప్పటికీ తన బిడ్డ మంచి మార్గంలో మంచి మార్గంలోకి వస్తాడని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క మహిళకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదల్చుకున్నాం. ఈ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు” అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024