Srinivas Varma Counter : నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తా, కారుమూరికి కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

Srinivas Varma Counter : నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తా, కారుమూరికి కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Bandaru Satyaprasad HT Telugu Published Apr 13, 2025 10:13 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Apr 13, 2025 10:13 PM IST

Srinivas Varma Counter To Karumuri : మాజీ మంత్రి కారుమూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తాజాగా కౌంటర్ ఇచ్చారు. కూటమి నేతలను నరికేస్తాం, చంపేస్తాం అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తా, కారుమూరికి కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తా, కారుమూరికి కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Srinivas Varma Counter To Karumuri : వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. కారుమూరి తణుకు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిచారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పార్టీ కార్యకర్తల చప్పట్ల కోసం….నరికేస్తాం, చంపేస్తాం అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. కారుమూరి టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారన్నారు. అతి తక్కువ రోజుల్లో ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, నీ కాళ్లు, చేతులు లేకుండా నరకడానికి కత్తిపట్టే అవకాశం రాకుండా, ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు” అని శ్రీనివాస వర్మ మండిపడ్డారు. వైసీపీ నేతల పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, కారుమూరి వంటి నాయకులకు ఎలాంటి సంస్కారం లేదని వ్యాఖ్యానించారు.

కారుమూరి ఏమన్నారంటే?

ఇటీవల ఓ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లోంచి బయటకు లాగి కొడతానని, గుంటూరు అవతలి వాళ్లను నరికిపారేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కారుమూరి వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. కారుమూరి వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారుమూరికి స్ట్రాంగ్ వార్నింగ్

కారుమూరి వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలకొల్లులో కూటమి నేతలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… కారుమూరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీఆర్ బాండ్ల అవినీతి కేసులో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఆయన చిప్పకూడు తినడం తథ్యమని వ్యాఖ్యానించారు. వైసీపీ మందను ప్రజలు ఇంటికి తోలేసినా, ఇంకా బుద్ధి రాలేదని కేంద్రమంత్రి విమర్శించారు.

ఇటీవల తణుకులో

ఇటీవల తణుకులో మాట్లాడిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ…కారుమూరిపై సీరియస్ అయ్యారు. నిన్ను చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో ఇటీవల మీడియాతో మాట్లాడారు. తాము కనుక వైసీపీ తరహా భాష ఉపయోగిస్తే.. సాయంత్రానికి నువ్వుండవు గుర్తుపెట్టుకో. తణుకులో టీడీఆర్‌ కుంభకోణం గురించి అందరికీ తెలుసన్నారు. ఎప్పుడో అధికారంలోకి వస్తానని,ఇప్పట్నుంచే పగటి కలలు కంటున్నారన్నారు. ఈలోగా మీరు బోనులోకి పోతారన్నారు. జగన్ అసెంబ్లీకి రారు, కారుమూరి ప్రజల్లోకి రారంటూ ఎద్దేవా చేశారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap BjpAndhra Pradesh NewsWest GodavariTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024