




Best Web Hosting Provider In India 2024
ఇప్పుడే వెళ్లిపోతే చాలా మంచిది.. దేశంలో ఉంటున్న విదేశీయులకు అమెరికా వార్నింగ్!
US 30 Day Warning : అమెరికాలో 30 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే విదేశీ పౌరులు ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలి. ఈ రూల్ పాటించడంలో విఫలమైతే జరిమానాలు, జైలు శిక్ష కూడా ఉంటుందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన.. వలసదారుల గురించి మరో ఉత్తర్వు జారీ చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నియమం ప్రకారం.. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీ పౌరులకు రిజిస్ట్రేషన్ ఇప్పుడు తప్పనిసరైపోయింది. కొత్త నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అరెస్టు కూడా అవ్వొచ్చు. అంతేకాకుండా నమోదు చేసుకోని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించవచ్చు.
వెళ్లిపోతే మంచిది
అమెరికాలో 30 రోజులకంటే ఎక్కువగా నివసిస్తున్నవారు రిజిస్టర్ చేసుకోవాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధిపతి క్రిస్టీ ఈ మేరకు సందేశం పంపారు. సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గం అని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని వెళ్లండని తెలిపింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది.
‘మెసేజ్ టు ఇల్లీగల్ ఎలియెన్స్’ అనే శీర్షికతో హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఒక పోస్ట్‌లో అధికారుల అనుమతి లేకుండా ఉన్న విదేశీయులను స్వీయ-బహిష్కరణకు ఆహ్వానిస్తుందని పేర్కొంది. ఇప్పుడే వెళ్లిపోండి అని తెలిపింది.
భారీగా ఫైన్
‘చివరి ఆర్డర్ అందుకున్నవారు ఒక్క రోజు అధికంగా ఉంటే 998 డాలర్ల ఫైన్ ఉంటుంది. సొంతంగా వెళ్లిపోకపోతే 1000 నుంచి 5000 డాలర్ల వరకు ఫైన్ ఉండనుంది. భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో అమెరికాకు వచ్చేందుకు కూడా కుదరదు. జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.’ అని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.
వీరు కూడా జాగ్రత్త
ఈ నిర్ణయం H-1 B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్న యూఎస్‌లో ఉన్నవారిని నేరుగా ప్రభావితం చేయదు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యూఎస్‌లో ఉండకుండా చట్టాలను కఠినంగా అమలు చేయడాన్ని ఇది సూచిస్తుంది. H-1 B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణిత వ్యవవధిలోపు దేశం విడిచి వెళ్లకపోతే చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
H-1B స్టూడెంట్, గ్రీన్ కార్డ్ వంటి పత్రాలు ఉన్నవారు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లుగా పరిగణిస్తారు. తమ పత్రాలను 24 గంటలూ తమ వద్ద ఉంచుకోవాలి. చిరునామాలో ఏదైనా మార్పు ఉంటే 10 రోజుల్లోపు దాని గురించి తెలియజేయాలి. అలా చేయకపోతే జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Best Web Hosting Provider In India 2024
Source link