




Best Web Hosting Provider In India 2024

OTT Telugu Comedy: టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ కామెడీ సినిమా.. టెలికాస్ట్ ఎప్పుడంటే!
Mazaka TV Premiere: మజాకా సినిమా టీవీలోకి వస్తోంది. టీవీ ప్రీమియర్‌కు రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ మంచి బజ్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, మిక్స్డ్ టాక్ దక్కించుకొని అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రానికి కలెక్షన్లు రాలేదు. ఈ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ సాధించింది. మజాకా చిత్రం ఇక టీవీలో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.
టెలికాస్ట్ డేట్, టైమ్
మజాకా సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. తొలిసారి టీవీలో టెలికాస్ట్ కానుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల్లోగానే ఈ చిత్రం టీవీ ఛానెల్లోకి వచ్చేస్తోంది.
ఓటీటీ ఎక్కడ!
మజాకా సినిమా మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో నిరాశాజనక ఫలితం వచ్చినా.. ఓటీటీలో మాత్రం ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంది. స్ట్రీమింగ్‍లో అదరగొట్టింది. మరి, ఏప్రిల్ 20న జీ తెలుగు ఛానెల టీవీ ప్రీమియర్‌లో మజాకా చిత్రం టీఆర్పీ దక్కించుకుంటుందో చూడాలి.
మజాకా సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు. కొడుకు ప్రేమలో ఉండడం, అతడి తండ్రి రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలో ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. దీంతో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సత్తాచాటలేకపోయింది.
మజాకా మూవీలో కృష్ణ అనే ఎనర్జిటిక్ రోల్ చేశారు సందీప్ కిషన్. అతడికి జోడీగా రితూ వర్మ నటించారు. హీరో తండ్రి పాత్రను రావు రమేశ్ పోషించారు. సందీప్, రావు రమేశ్ కాంబినేషన్‍లో కామెడీ సీన్లు ఈ చిత్రం ఆకట్టుకున్నాయి. మన్మథుడు ఫేమ్ అన్షు ఈ చిత్రంతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు. అజయ్, మురళీ శర్మ, శ్రీనివాసరెడ్డి, హైపర్ ఆది ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.
మజాకా కలెక్షన్లు
మజాకా చిత్రం సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రం మొత్తంగా సుమారు రూ.9కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్‍గా నిలిచింది.
మజాకా చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇచ్చారు. హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా, ఉమేశ్ కేఆర్ భన్సాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం