






Best Web Hosting Provider In India 2024

Collections: మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో కుమ్మేస్తున్న అజిత్ యాక్షన్ సినిమా.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లంటే..
Good Bad Ugly Collections: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ యాక్షన్ సినిమా కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. మరో మైల్‍స్టోన్ దాటింది. ఈ చిత్రాన్ని 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవేే..

గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి ఆరంభం నుంచే చాలా క్రేజ్ కనిపించింది. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో గత వారం ఏప్రిల్ 10న విడుదలైంది. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఈ యాక్షన్ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం సత్తాచాటుతోంది. టాక్‍తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ దుమ్మురేపింది. గుడ్ బ్యాక్ అగ్లీకి నాలుగు రోజుల్లోనే ఓ మైల్‍స్టోన్ కూడా దాటింది.
రూ.150కోట్లు దాటేసి..
గుడ్ బ్యాక్ అగ్లీ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. నాలుగో రోజైన ఆదివారం సుమారు రూ.37 కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద జోష్ చూపింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి ఫస్ట్ డే సుమారు రూ.57కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఆ తర్వాత డ్రాప్ అయి రెండో రోజు సుమారు రూ.28కోట్లు దక్కాయి. మళ్లీ వీకెండ్‍లో ఈ చిత్రం పుంజుకుంది. మూడో రోజు రూ.36.50 కోట్లను దక్కించుకుంది. నాలుగో రోజు ఆదివారం దాదాపు రూ.37కోట్లను ఈ చిత్రం సాధించిందని అంచనా. దీంతో ఓపెనింగ్ వీకెండ్‍లోనే రూ.150 కోట్లను దాటేసిందనే లెక్కలు ఉన్నాయి.
అసలైన పరీక్ష అప్పుడే!
అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారమైన నేడు హాలీడే ఉంది. ఇది కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి కలిసి రానుంది. జోరు కొనసాగించే ఛాన్స్ ఉంది. అయితే, మంగళవారం నుంచే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అసలు పరీక్ష ఎదురుకానుంది. ఒకవేళ కలెక్షన్లు నిలకడగా ఉండే ఈ మూవీ థియేట్రికల్ రన్ జోరుగా సాగడం ఖాయం. కలెక్షన్లలో దూసుకెళుతుందని అర్థమవుతుంది. ఈ పరీక్షను గుడ్ బ్యాడ్ అగ్లీ దాటుతుందేమో చూడాలి.
తెలుగులో ఢీలానే!
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తమిళంలోనే సత్తాచాటుతోంది. తెలుగు డబ్బింగ్‍లో రిలీజైన పెద్దగా కలెక్షన్లు దక్కడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లు దక్కడం లేదు. తమిళనాడు, ఓవర్సీస్‍లో ఈ చిత్రం ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది.
తెలుగు ప్రొడక్షన్ హౌస్ నుంచి..
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఆ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంతో కోలీవుడ్‍లోకి కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి రూ.200కోట్లకుపై బడ్జెట్ ఖర్చైనట్టు అంచనా.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో రెడ్ డ్రాగన్ అనే గ్యాంగ్‍స్టర్‌గా నటించారు అజిత్ కుమార్. యాక్షన్, స్వాగ్‍తో అదరగొట్టారు. ఆయన సరసన త్రిష హీరోయిన్‍గా చేశారు. అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్, జాకీ ష్రాఫ్, కార్తికేయ దేవ్, రెడిన్ కింగ్‍స్లే, యోగి బాబు,షైన్ టామ్ చాకో కీరోల్స్ చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్