సమ్మర్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్, మామిడిపండ్లతో రుచికరమైన హెల్తీ స్మూతీ రెసిపీ

Best Web Hosting Provider In India 2024

సమ్మర్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్, మామిడిపండ్లతో రుచికరమైన హెల్తీ స్మూతీ రెసిపీ

Ramya Sri Marka HT Telugu
Published Apr 14, 2025 06:30 AM IST

సమ్మర్ టైంలో రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తినాలంటే ఎక్కువ మంది ఇష్టపడరు. ఇంటరస్ట్ లేకపోవడంతో చాలా మంది స్కిప్ చేసేస్తుంటారు కూడా. అలాంటి వారంతా ఎటువంటి రెండో ఆలోచన లేకుండా మంచి టేస్టీ, హెల్తీగా ఉండే మ్యాంగో స్మూతీని ట్రై చేసేయండి.

మ్యాంగోలతో స్మూతీ తయారుచేయడం ఎలా
మ్యాంగోలతో స్మూతీ తయారుచేయడం ఎలా

సమ్మర్లో మనకు ఎక్కువగా దొరికేది మామిడిపండ్లు. స్మూతీ చేసుకోవడానికి ఇబ్బందేం లేదు. కానీ, ఉదయాన్నే అది కూడా బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా మామిడిపండు తింటే ఏమైనా అవుతుందేమోననే ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే ఈ స్మూతీలో కేవలం మామిడిపండు మాత్రమే కాదు, ఇతర పదార్థాలు కూడా కలిపి తయారుచేస్తారు. కాబట్టి టేస్ట్ తో పాటు హెల్త్ కూడా మీ సొంతమవుతుంది. ఇక లేటెందుకు సమ్మర్లో మాత్రమే దొరికే మామిడిపండ్లతో చక్కటి స్మూతీ తయారుచేసుకుని రోజును మొదలుపెట్టేయండి.

రుచికరమైన, ఆరోగ్యకరమైన మ్యాంగో బెర్రీ స్మూతీ రెసిపీ. వేసవిని రిఫ్రెషింగ్గా మార్చేసే స్మూతీ ఇది. పైగా, ఇది తయారు చేయడం కూడా చాలా సులువు.

మ్యాంగో బెర్రీ స్మూతీ కోసం కావలసిన పదార్థాలు:

  • 1 కప్పు బాగా పండిన మామిడి ముక్కలు (ముందుగానే కోసి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి)
  • 1/2 కప్పు మిక్స్డ్ బెర్రీలు (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు – ఫ్రిడ్జ్‌లో ఉంచినవి)
  • 1/2 కప్పు పెరుగు (సాధారణ లేదా యోగర్ట్)
  • 1/4 కప్పు పాలు (టేస్ట్ కోసం బాదం లేదా సోయా పాలు ఏదైనా మీకు నచ్చినది)
  • 1 టేబుల్ స్పూన్ చియా గింజలు (నచ్చకపోతే వేసుకోనక్కర్లేదు)
  • 1 టీస్పూన్ తేనె లేదా మాపుల్ సిరప్ (తీపి కోసం)
  • కొన్ని ఐస్ క్యూబ్స్ (మరింత చల్లగా కావాలనుకుంటే మాత్రమే)
  • కొద్దిగా పుదీనా ఆకులు (అలంకరణ కోసం)

తయారు చేసే విధానం:

  1. ముందుగా ఒక బ్లెండర్ తీసుకుని మామిడి ముక్కలు, బెర్రీలు, పెరుగు, పాలు కలిపి బ్లెండర్ జార్‌లో వేయండి.
  2. చియా గింజలు, తేనె లేదా మాపుల్ సిరప్ వేయాలనుకుంటే అదే జార్లో వాటిని కూడా కలపండి.
  3. చల్లదనం కావాలనుకునేవారు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేయండి.
  4. మూత పెట్టి, అన్నీ బాగా కలిసిపోయి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.
  5. అవసరమైతే కొద్దిగా ఎక్కువ పాలు వేసి కావలసిన చిక్కదనం ఉండేలా చూసుకోండి.
  6. తయారైన స్మూతీని గ్లాసులోకి పోసుకుని, పుదీనా ఆకులతో అలంకరించుకోండి.
  7. అంతే, టేస్టీ అండ్ హెల్తీ మ్యాంగో స్మూతీ రెడీ అయిపోయినట్లే.

ఈ స్మూతీలో కేవలం మామిడిపండు మాత్రమే ఉండదు. ఇతర పదార్థాలు కూడా కలిసి ఉండటం వల్ల మామిడిపండు తీసుకుంటే విరేచనాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

మ్యాంగో స్మూతీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పుష్కలంగా పోషకాలు: మామిడిపండులో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బెర్రీలలో కూడా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. వీటి కాంబినేషన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది.

శక్తి స్థాయిలు: మామిడిపండులో ఉండే సహజ చక్కెరలు, ఇతర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం పూట తీసుకోవడానికి ఇది ఒక మంచి ఎంపిక.

జీర్ణక్రియ: పెరుగులోని ప్రోబయోటిక్స్, పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

చర్మానికి మంచిది: విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024