రోజంతా AC లోనే ఉంటున్నారా? చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి!

Best Web Hosting Provider In India 2024

రోజంతా AC లోనే ఉంటున్నారా? చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 14, 2025 08:30 AM IST

వేసవిలో ఎక్కువసేపు ఏసీ గదుల్లోనే ఉండటం వల్ల చర్మానికి కొన్ని సున్నితమైన సమస్యలు రావచ్చు. పొడి తత్వం, తేమ లోపం వంటి ప్రభావాలు ఎక్కువగా కనిపించవచ్చు. కొన్ని సాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

ఏసీ కారణంగా వచ్చే చర్మ సమస్యలు చాలా ఉన్నాయి
ఏసీ కారణంగా వచ్చే చర్మ సమస్యలు చాలా ఉన్నాయి

వేసవిలో భగ్గుమనే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువమంది రోజంతా ఏసీ గదుల్లోనే గడుపుతున్నారు. ఆఫీసులు, ఇళ్లు, వాహనాలు ఇలా అన్నింటా ఏసీ వాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా మంది ఏసీ లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఏసీలో ఉంటే సౌకర్యం, చల్లదనమే ఇందుకు కారణం. అయితే ఈ సౌకర్యం పక్కనే కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని తెలుసుకోండి.ముఖ్యంగా చర్మానికి.

ఎక్కువ సేపు ఏసీలో గడపటం వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తులతాయి. ఏసీ గాలి నునుపుగా ఉండటం, తేమ తగ్గిపోవడం వల్ల చర్మం పొడిగా మారే అవకాశముంటుంది. అలర్జీలు, చర్మం పై దద్దుర్లు, ఉబ్బు లాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎలాంటి సమస్యలూ లేకుండా ACలో సుఖంగా గడపవచ్చు.

AC వల్ల కలిగే చర్మ సమస్యలు

1. పొడిబారిన చర్మం (Dry Skin)

2. చర్మం కాలిపోవడం, సున్నితత్వ (Skin Irritation & Sensitivity)

3. అలర్జీలు, ఎగ్జిమా (Allergy & Eczema Flare-Ups)

4. చర్మం నిర్జీవంగా మారడం (Dull & Lifeless Skin)

5. జిడ్డుగా మారడం (Rebound Oiliness & Acne)

6. అసమానమైన రంగు మార్పులు (Uneven Skin Tone)

7. వృద్ధాప్య లక్షణాలు రావడం (Premature Aging Signs)

8. కళ్ల చుట్టూ ఉన్న చర్మం పగలడం (Chapped Under-Eye Skin)

9. పగుళ్లు రావడం (Flaky or Peeling Skin)

10. మిశ్రమ చర్మ సమస్యలు (Combination Skin Complications)

ఏసీ కారణంగా వచ్చే ఈ చర్మ సమస్యల నుంచి తప్పించుకోవడం ఎలా?

ఏసీ కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి తప్పించుకునేందుకు దీన్ని పూర్తిగా మానేయలేం. కానీ వాడకంలో కొన్ని రకాల మార్పులు, జాగ్రత్తలు తీసుకుని చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

1. టెంపరేచర్‌ను 24–26°C మధ్యలో ఉంచండి

తక్కువ టెంపరేచర్ (18–20°C) ఉంచితే గాలి పూర్తిగా పొడిగా మారుతుంది. అలా కాకుండా మోస్తరు చల్లదనం కోసం అంటే ఏసీ టెంపరేచర్ 24–26°C ఉంచి వాడితే స్కిన్ తేమను కోల్పోకుండా ఉంటుంది.

2. డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించండి

మీరు AC ఉన్న గదిలో ఉన్నప్పుడు డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించండి. ఇది గదిలో తేమను నిలిపి చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. మీకు డీహ్యూమిడిఫైయర్ లేకపోతే AC ఉన్న గదిలో ఒక బకెట్ నీరు ఉంచండి.ఇది తేమను నిలిపేందుకు సహాయపడుతుంది.

3. చర్మానికి తేమనిచ్చే స్కిన్ కేర్ ఫాలో అవ్వండి

రోజంతా ఏసీ గదిలో ఉండే వారు చేతులు, కాళ్ళతో పాటు మీ మెడ, వంటి శరీరంలోని ఇతర బహిర్గత భాగాలకు లోషన్, మాయిశ్చరైజర్ వంటివి రాసుకోవాలి. ఇవి చర్మానికి తేమనిచ్చేవిగా ఉండాలి. Lip balm, under-eye cream వంటివి కూడా అవసరం.

4. ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండండి (Stay Hydrated)

AC లో ఎక్కువ సేపు ఉన్నప్పుడు లోపల నుండి చర్మానికి తేమ అందించాలి. రోజుకు కనీసం 2.5–3 లీటర్ల నీళ్లు తాగండి.

5. గదిలోకి బయటి గాలి రాకుండా చూడండి

బయటి వేడి గాలి & ధూళి గదిలోకి వస్తే అది చర్మం మీద చెడు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. AC గదిలో Windows properly seal చేయాలి.

6. అప్పుడప్పుడూ ఏసీ ఆఫ్ చేయండి.

గదిలో ఏసీని మధ్యమధ్యలో Interval లో ఆన్/ఆఫ్ చేయండి.

గది చల్లబడిన తర్వాత కొంత సేపు AC ఆపివేయడం, తర్వాత కాసేపటికి ఆన్ చేసుకోవడం వంటివి చేయడం వల్ల గదిలోని గాలి పూర్తిగా పొడిగా మారదు.

7. ఏసీ ఫిల్టర్లు తరచూ శుభ్రం చేయండి

ధూళి & బ్యాక్టీరియా వల్ల చర్మం పై అలర్జీలు, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం నెలకోసారి ఫిల్టర్ క్లీన్ చేయడం మంచిది.

8. స్లీప్ టైమర్ వాడండి

రాత్రంతా ఏసీ ఆన్ లోనే ఉంచకుండా స్లీపింగ్ మోడ్, స్లీప్ టైమర్ వంటి సెట్టింగ్స్ ను ఉపయోగించుకోండి. పొడిగా మారే చర్మ సమస్యలు తక్కువవుతాయి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024