






Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్లాన్‍తో మాణిక్యాన్ని తప్పించిన రోహిణి.. బాలు, ప్రభావతి ఒకే జట్టు.. ఆటలకు రెడీ
Gunde Ninda Gudi Gantalu April 14 Today Episode: గుండె నిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‍లో బాలు మరోసారి మాటలతో అల్లాడిస్తాడు. దీంతో మలేషియా మాణిక్యం నిజం చెప్పేస్తాడు. కానీ రోహిణి మరో నాటకం ఆడి అతడిని తప్పిస్తుంది. సుశీల ఆటలు ఆడించేందుకు ప్లాన్ చేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందంటే..

గుండె నిండా గుడి గంటలు నేటి (ఏప్రిల్ 14) నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కాఫీ గ్లాసు తీసుకొని వస్తుంటుంది ప్రభావతి. అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా అత్తయ్య అని మీనా అంటుంది. పని చెబుతోందని మా అత్తయ్యతో తిట్టించి, సంతోషించడానికా అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. దీంతో మీనా కూడా పంచ్ వేస్తుంది. ఇదంతా పెద్దావిడను చూసే కదా అని ప్రభావతి అనుకుంటుంది. ఇంటికి వెళ్లాక మనోజ్‍కు తాగించినందుకు బాలు గాడికి, దీనికి మాములుగా ఉండదు అని అంటుంది. ఇంతల ఆ కాఫీ గ్లాసును సత్యం తీసుకోబోతే.. ఇది మలేషియా మరిది (మాణిక్యం) కోసం అని అంటుంది ప్రభావతి.
మేకరాజు అంటే పరుగెత్తుకొచ్చిన మాణిక్యం
డబ్బు ఉన్న వారికే మర్యాదలా అని బాలు అంటాడు. మేకరాజు.. మేకరాజు అని మేకలా అరుస్తాడు. దీంతో ఎక్కడ.. ఎక్కడ అంటూ కంగారుగా వస్తాడు మాణిక్యం. కాఫీ, పురుగుల మందు అంటూ తన మాటలతో మాణిక్యాన్ని కన్‍ఫ్యూజ్ చేస్తాడు బాలు. వంట గురించి మాటలు వస్తాయి. నిన్నంతా కూరగాయలే కదా అందుకే ఈ రోజు మేకపోతును కోయమన్నానని అని సుశీల అంటుంది. మేకపోతునా.. ఎంత పని జరిగిందని మాణిక్యం అంటాడు. మీకు తెలిసి ఉంటే మీరే కోసేవారా అని బాలు అంటాడు. మేకను నేనెందుకు కోస్తా అని మాణిక్యం బుకాయిస్తాడు. మేకను ఎలా కట్ చేయాలో పూర్తిగా వివరిస్తుంటాడు.
మెయిన్ రోడ్ మీదే.. నిజం చెప్పిన మాణిక్యం
మేకను ఎలా కట్ చేయాలో మాణిక్యం చెబుతూనే ఉంటాడు. ఈ క్రమంలో ‘మీ మటన్ కొట్టు ఎక్కడ” అని సడెన్‍గా అంటాడు బాలు. “మెయిన్ రోడ్ మీదే” అని మాణిక్యం కంగారులో నిజం చెప్పేస్తాడు. బాలు తన మాటలతో మాణిక్యం నోటి నుంచి నుంచి నిజం రాబడతాడు. దొరికిపోయారడు అని బాలు అంటాడు. దీంతో రోహిణి, ప్రభావతి, సుశీల, సత్యం సహా అందరూ షాక్ అవుతారు. ఏం దొరకాను అని మాణిక్యం అంటాడు. మీరెవరు అనేది అని బాలు చెబుతాడు.
నా పని అయిపోయింది.. ప్లాన్ చేసిన రోహిణి
తన షాప్ మెయిన్ రోడ్డు మీద అని అని మాణిక్యం చెప్పడంతో రోహిణి కంగారు పడుతుంది. “ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. లేకపోతే నా పని అయిపోతుంది” అని మనసులో అనుకుంటుంది రోహిణి. వెంటనే ఓ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడే పంపిచేస్తున్నానంటూ కంగారు పడుతూ ఫోన్ మాట్లాడుతుంది. ఏమైందని అందరూ అడుగుతారు. మా ఆంటీకి సీరియస్‍గా ఉందంట అని రోహిణి చెబుతుంది.
ఎవరమ్మా నీ ఆంటీ అని మాణిక్యం అడుగుతాడు. నీ భార్య మామయ్యా అని రోహిణి చెబుతుంది. దాని నంబర్ తినకి ఎలా తెలుసు అని మాణిక్యం ఆలోచిస్తాడు. ఓ నా భార్య పాత్రనా అనుకుంటాడు. వెంటనే మలేషియా బయలుదేరాలని మాణిక్యాన్ని రోహిణి తొందరపెడుతుంది. కుదరదు అని బాలు అరుస్తాడు. మటన్ వంటకాలన్నీ తినే దాక మాణిక్యాన్ని పంపమని బాలు అరుస్తాడు. తినే వెళతానని మాణిక్యం కూడా అంటాడు.
ప్రభావతిపై రోహిణి చిరాకు.. అందరూ షాక్
మాణిక్యం ఇంకా అక్కడే ఉంటే నాటకం పూర్తిగా బయటపడుతుందని రోహిణి భయపడుతుంది. వెళ్లాల్సిందేనని మాణిక్యంతో చెబుతుంది. మీ మావయ్యతో పాటు నువ్వు వెళ్లు అని ప్రభావతి అంటుంది. దీంతో “ఎహే నీదో గోలా” అని రోహిణి చిరాకు పడుతుంది. అత్త ప్రభావతిని రోహిణి అలా విసుక్కోవడంతో అందరూ షాక్ అవుతారు. ఏమన్నావ్ మా అమ్మను అని బాలు అంటాడు. అందరూ ప్రశ్నిస్తారు. సారీ అంటీ చిరాకులో ఏదో అనేశాను అని రోహిణి కవర్ చేసుకుంటుంది.
మాణిక్యాన్ని తప్పించిన రోహిణి
ఇక వెళ్లు అంటూ మాణిక్యం చేతిలో బ్యాగ్ పెడుతుంది రోహిణి. వెళ్లాక మనోజ్ బిజినెస్ గురించి రోహిణి వాళ్ల నాన్నకు చెప్పింది మలేషియా మరిది అని అంటుంది ప్రభావతి. కారులో మేకబ్బాయిని డ్రాప్ చేద్దామని బాలు అంటే.. అవసరం లేదంటుంది రోహిణి. నడిచి వెళతాడని చెబుతుంది.
మాణిక్యాన్ని బయటికి తీసుకెళుతుంది రోహిణి. నా క్యారెక్టర్‌ను సడెన్‍గా ఎందుకు కట్ చేశావని మాణిక్యం అడుగుతాడు. నువ్వు ఆడిషన్‍లో సెలెక్ట్ అయ్యావని కాల్ వచ్చిందని, అందరికీ తెలిస్తే జెలసీ ఫీల్ అవుతారని చెబుతుంది రోహిణి. మాణిక్యాన్ని తెలివిగా తప్పించి అక్కడి నుంచి పంపిస్తుంది.
దొరికాడు అనగానే పార్లరమ్మ ఎలా తరిమేసిందో చూశావా.. వాడితో నిజం చెప్పిస్తానని అర్థమైపోయింది.. కాస్తలో మిస్ అయిందని రాజేశ్‍తో బాలు అంటాడు. తాను విడిచిపెట్టనని చెబుతాడు. ఇంతలో బాలును బయటచూసి అవాక్కవుతుంది రోహిణి.
వెళ్లాడా.. వెళ్లగొట్టావా..
మాణిక్యం ఉండి ఉంటే కొన్ని నిజాలు బయటపడేవి.. కొందరు బయటపడే వారని బాలు అంటాడు. మా మామయ్య వెళ్లిపోయాడు కదా.. మనం ఊరెళదామని మనోజ్‍ను రోహిణి అడుగుతుంది. మీ మామయ్య వెళ్లాడా.. వెళ్లగొట్టావా అని వెటకారంగా మాట్లాడతాడు బాలు. నీకు ఎలా అనిపిస్తే అలా అనుకో బాలు అంటుంది రోహిణి. ఆ మేకశేఖరుడి పద్ధతి తనకు నచ్చలేదని బాలు అంటే.. రాకరాక మా పుట్టింటి నుంచి ఒకరు వస్తే ఇలాగేనా అనేది అని రోహిణి అంటుంది.
గేమ్స్ ఏర్పాటు చేసిన సుశీల
ఊరెళతామని, బోరుగా ఉందని మనోజ్ అంటాడు. అలా అనిపించకూడదనే ఓ ఏర్పాటు చేశానని సుశీల చెబుతుంది. ఇంకో రెండు రోజులు ఉండాలని అంటుంది. మీరందరూ గేమ్స్ ఆడేందుకు ఏర్పాటు చేశానని చెబుతుంది. పారిపోయే పోటీ ఉంటే రవి బాగా ఆడతాడు అంటూ బాలు పంచ్ వేస్తాడు. మాటలు ఎక్కువయ్యానని సత్యం అంటాడు.
ఊరికి వెళ్లేందుకు శృతి బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. నేను ఇంటికి వెళతానని రవితో చెబుతుంది. తనను మాటలు అంటున్నారని అంటుంది. ఉండాల్సిందేనని రవి అంటాడు. అయితే, బాలును ఆటల్లో ఓడించాలని శృతి అంటుంది. బాలు ఆటల్లో అదరగొడతాడని ప్రభావతికి సత్యం చెబుతాడు.
బాలును ఓడించాలని..
ఎలాగైనా బాలును ఆటల్లో ఓడించాలని మనోజ్, రవి, శృతి, రోహిణికి ప్రభావతి చెబుతుంది. ఈ రెండు జంటల్లో ఎవరో ఒకరు గెలువాలని అంటుంది. ఆ బాలు, మీన మాత్రం గెలవకూడదని చెబుతుంది. బాలును ఓడించాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలను సుశీల వింటూ ఉంటుంది.
మీనా మాటలకు మురిసిన సుశీల, సత్యం
కుటుంబంతో కలిసి ఆటలు ఆడడం సరదాగా ఉంటుందని బాలుతో మీనా అంటుంది. గెలవాల్సిందేనని బాలు చెబుతాడు. గెలుపు ముఖ్యం కాదు.. అందరం సరదాగా, సంతోషం గడపడం ముఖ్యమని మీనా అంటుంది. ఎవరు గెలిచినా సంతోషమేనని చెబుతుంది. ఈ మాటలు విని సుశీల మురిసిపోతుంది. మీనా మంచిగా ఆలోచిస్తోందని సత్యంతో చెబుతుంది.
ప్రభావతి, బాలు ఒకే జట్టు
మా గ్రూప్ అంతా రెడీ అని ప్రభావతి అంటుంది. టీమ్‍ను నేను డిసైడ్ చేస్తానని సుశీల చెబుతుంది. బాలు అందరిపై పంచ్‍లు వేస్తూ ఉంటాడు. ఆటల్లో గెలిచి చూపిస్తామని రోహిణి అంటుంది. మా అమ్మ ప్రభావతి తొండి చేస్తుందని భయమని బాలు అంటాడు.
మీ అందరినీ రెండు జుట్లుగా విడగొట్టామని సుశీల అంటుంది. ఒక జట్టుకు సత్యం, మరో జట్టుకు ప్రభావతి.. కెప్టెన్‍గా ఉంటారని చెబుతుంది. జంటలుగా ఉంటామని అందరూ అంటే.. అలా కుదరదని సుశీల చెబుతుంది. బాలును మా టీమ్‍లో చేర్చుకోనని ప్రభావతి అంటుంది. ప్రభావతి టీమ్‍లో బాలు, మనోజ్, రవి ఉంటారని సుశీల చెబుతుంది. అత్తయ్యా నాకూ, బాలుకు కుదరదు అని ప్రభావతి అంటుంది. ఏం వాడు మాత్రం నీ కొడుకు కదా అని సుశీల చెబుతుంది.
కడుపుతో ఉన్నప్పడే బాలు కాలితో తన్నాడని, జారిపడ్డానని ప్రభావతి అంటుంది. చూశావా బామ్మా కడుపులో ఉన్నప్పుడు తన్నింది కూడా గుర్తుపెట్టుకుంది, ఈ వైరం ఇప్పటిది కాదు.. అప్పటిది అని బాలు అంటాడు. దీంతో గుండె నిండా గుడి గంటలు నేటి (ఏప్రిల్ 14) ముగిసింది.
సంబంధిత కథనం