ఖుష్బు అందానికి రహస్యం ఏంటో తెలుసా? ఆమె స్యయంగా తయారు చేసుకునే ఈ నూనె, మీకు కావాలా?

Best Web Hosting Provider In India 2024

ఖుష్బు అందానికి రహస్యం ఏంటో తెలుసా? ఆమె స్యయంగా తయారు చేసుకునే ఈ నూనె, మీకు కావాలా?

Ramya Sri Marka HT Telugu
Published Apr 14, 2025 10:53 AM IST

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు అందాని రహస్యంగా ఉపయోగించే నూనెను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బిజీ లైఫ్‌లో కూడా ఆమె అందాన్ని కాపాడుకేందుకు సహాయపడే నూనె ఇదే!

ఖుష్బు స్కిన్ కేర్ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడుంది
ఖుష్బు స్కిన్ కేర్ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడుంది

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలైన ఖుష్బు యాభై ఏళ్లు పైబడినా కూడా తన అందంతో అందిరినీ ఆకట్టుకుంటున్నారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీబిజీగా సమయం గడుస్తున్నప్పటికీ ఆమె స్కిన్ కేర్ రోటీన్ ను మాత్రం నిర్లక్ష్య చేయరు. అలాగే చర్మం, కురుల ఆరోగ్యం కోసం ఆమె రసాయలనాలతో కూడిన క్రీములు, ఉత్పత్తుల కన్నా సహజసిద్దమైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తారు. వీటిని ఆమె స్వయంగా తయారు చేసుకుంటారు.

సోషల్ మీడియాలో ఖుష్బు అందం కోసం ఉపయోగించే ఇంటి నివారణల గురించి తరచుగా షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె చర్మం ఇంత కాంతివంతంగా యవ్వనంగా ఉండటం వెనకున్న రహస్యాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. యూభై ఏళ్లు పైబడినా ముప్పైల్లోనే ఉన్నట్లుగా కనిపించే ఆమె చర్మ రహస్యం ఆమె స్వయంగా తయారు చేసుకున్న ప్రత్యేకమైన నూనె ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వాడే ఈ ఆయిల్ వైరల్ గా మారింది. ఖుష్బు మెరిసే చర్మం వెనకున్న అద్భుతమైన ఆ నూనెను ఎలా తయారు చేయాలో , దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

ఖుష్బు సీక్రెట్ స్కిన్ ఆయిల్ కావలసిన పదార్థాలు

  • క్యారెట్ – 1
  • బీట్‌రూట్ – 1
  • నూనె (కొబ్బరి) – పావుకప్పు
  • నూనె (బాదం) – పావు కప్పు
  • ఆలివ్ నూనె- పావు కప్పు
  • నారింజ తొక్కలు – 1 కాయ
  • విటమిన్ ఇ కాప్సూల్స్ – 2

ఖుష్బు సీక్రెట్ స్కిన్ ఆయిల్ తయారీ విధానం

  1. ఖుష్బు సీక్రెట్ స్కిన్ ఆయిల్ తయారు చేసుకోవడం కోసం ముందుగా క్యారెట్ , బీట్ రూట్లను తీసుకుని శుభ్రంగా కడిగి పైచెక్కు గీకేయండి.
  2. తరువాత ఈ రెండింటినీ తురిమి పక్కకు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఒక కాయ నారింజ తొక్కలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి.
  4. తరువాత ఒక పాత్ర తీసుకుని దాంట్లో బాదం నూనె, ఆలివ్ నూనె, కొబ్బరి నూనెలను పోసి వేడి చేయండి.
  5. ఈ నూనెలన్నీ కాస్త వేడెక్కగానే దాంట్లో క్యారెట్ తరుము, బీట్ రూట్ తురుము, నారింజ తొక్కలన్నీ వేసి మరగించండి. వీటిని మీడియం మంట మీద మాత్రమే పెట్టి అరగంటకు పైగా మరగనివ్వాలి. మంట కాస్త ఎక్కువైనా క్యారెట్ బీట్ రూట్ మాడి ఆయిల్ పాడైపోతుంది.
  6. నూనె అంత బాగా మరిగి నారింజ రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి.
  7. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకొండి.
  8. అంతే ఖుష్బు సీక్రెట్ స్కిన్ ఆయిల్ రెడీ అయినట్టే. దీన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మసాజ్ చేస్తూ నెమ్మదిగా అప్లై చేసుకోవాలి.
  9. ఉదయాన్నే లేచి గోరు వెచ్చటి లేదా చల్లటి నీటిలో కడుక్కోవాలి.
  10. రాత్రంతా ఉంచుకోవడం కుదరని వారు మీకు వీలైన సమయంలో ఈ నూనె అప్లై చేసుకుని కనీసం అరగంట పాటు అలాగే ఉంచుకుని తర్వాత ముఖాన్ని చల్లటి లేదా గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
  11. ఇందులోని అన్ని రకాల నూనె, క్యారెట్, బీట్‌రూట్, నారింజ తొక్కలు చర్మానికి పలు రకాలుగా మేలు చేసేవే కనుక దీన్నిఉపయోగించడం వల్ల ఎలాంటి చర్మ ససమ్యలు రావు. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని పొందుతారు.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024