






Best Web Hosting Provider In India 2024

TG SC Reservations: మూడు గ్రూపులుగా తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లు, జీవో 33 విడుదల..
TG SC Reservations: తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీవో నంబర్ 33ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరికాసేపట్లో జీవోను మంత్రి వర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి అంద చేయనుంది.

TG SC Reservations: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను మూడు గ్రూపులుగా అమలు చేయాలని షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులపై అభ్యంతరాలను స్వీకరించి తెలంగాణలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. గత మార్చిలో జరిగిన సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో అమోదం లభించింది.
ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణలో ఇకపై మూడు గ్రూపులుగా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తారు. గ్రూప్ ఏ కు 1శాతం రిజర్వేషన్, గ్రూప్ బికు 9 శాతం, గ్రూప్ సి కులాలకు 5శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. తెలంగాణలో ఉన్న 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లను అమలు చేస్తారు.
తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లలో గ్రూప్ ఏలో అత్యంత వెనుకబడిన కులాల్లో 15 ఉపకులాలు, గ్రూప్ బీ-లో 18 ఉపకులాలు, గ్రూప్ సీలో 26 ఉపకులాలు ఉన్నాయి. 2026 జనాభా లెక్కలు పూర్తైన తర్వాత జనాభాకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
సంబంధిత కథనం
టాపిక్