






Best Web Hosting Provider In India 2024

HIT 3 Trailer: భీకర వైలెన్స్‌తో రెచ్చిపోయిన నాని.. రక్తపాతంతో హిట్ 3 ట్రైలర్.. చాగంటి ప్రవచనాలు కూడా..
HIT 3 Trailer: హిట్ 3 సినిమా ట్రైలర్ వచ్చేసింది. వైలెంట్ యాక్షన్‍తో ఇంటెన్స్‌గా ట్రైలర్ ఉంది. యాక్షన్ మోడ్‍లో నాని అదరగొట్టారు.

హిట్ 3 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేచురల్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం వైలెంట్ యాక్షన్‍తో ఉండనుందనే హైప్ ముందు నుంచి ఉంది. టీజర్ తర్వాత మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ తరుణంలో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ సాగింది. ఈ క్రమంలో నేడు (ఏప్రిల్ 14) హిట్ 3 ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉందంటే..
కిడ్నాప్‍లతో..
హిట్ 3 మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రను నాని చేశారు. “సర్.. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్స్ సెల్‍లో ఉండాలి.. లేకపోతే సిక్స్ ఫీట్ హోల్‍లో ఉండాలి” అని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని) చెప్పే ఇంటెన్స్ డైలాగ్‍తో హిట్ 3 ట్రైలర్ మొదలైంది. నేరస్థులు బయట ఫ్రీగా తిరగకూడదని అంటాడు. ఇంతలో ఓ చిన్నపాప కిడ్నాప్ కేసు అర్జున్ వద్దకు వస్తుంది. దాన్ని పర్సనల్‍గా తీసుకుంటాడు.
“ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని ఆహో రాత్రుళ్లు కష్టపడతాడో ఆయనే తెలుస్తుంది” అని చాగంటి కోటేశ్వర రావు ప్రవచనం బ్యాక్‍గ్రౌండ్‍లో వస్తుంటే కిడ్నాప్ కేసును ఛేదించేందుకు అర్జున్ సర్కార్ ప్రయత్నిస్తుంటాడు.
జనాల మధ్య అర్జున్.. మృగాల మధ్య సర్కార్
నిన్ను అర్జున్ అని పిలవాలా.. సర్కార్ అనాలా అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. అర్జున్‍ను అడుగుతుంది. “జనాల మధ్యలో ఉంటే అర్జున్.. మృగాల మధ్య ఉంటే సర్కార్” అని అర్జున్ చెబుతాడు.
మనిషి క్రాస్ చేయలేని లైన్‍ను.. ఈరాత్రి మనం క్రాస్ చేస్తున్నామని ఆఫీసర్ అంటే.. సిద్ధమనేలా అర్జున్ చూస్తాడు. “అన్ని పరీక్షలకు తట్టుకొని నిగ్గుతేలగలిగిన శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకు, ధర్మరక్షణ వైపుకు అడుగువేయలేడు” అనే ప్రవచనం వినిపిస్తుంది.
నాని వైలెంట్ మోడ్
కిడ్నాప్‍కు గురైన వారి వద్దకు వెళ్లి పరిస్థితి చూస్తాడు అర్జున్ సర్కార్. ఆ తర్వాత ట్రైలర్ వైలెంట్ యాక్షన్ మోడ్‍లోకి మారిపోతుంది. నేరస్థులను తెగనరికేస్తాడు అర్జున్. రక్తపాతం సృష్టిస్తాడు. గాయాలపై ఆల్కహాల్ పోసుకుంటూ బీస్ట్ మోడ్‍లో రెచ్చిపోతాడు. రౌడీలను నరికేస్తాడు. ‘అబ్‍కీ బార్ అర్జున్ సర్కార్’ అనే డైలాగ్ ఉంది. పూర్తిగా రక్తంలో అర్జున్ తడిసిన షాట్‍తో హిట్ 3 ట్రైలర్ ముగిసింది.
ఇంటెన్సిటీ, వైలెన్స్, స్టైలిష్ యాక్షన్‍తో హిట్ 3 ట్రైలర్ మెప్పించించింది. దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ అదిరిపోయింది. వైలెంట్ యాక్షన్‍ను ఆకట్టుకునేలా చూపించారు. ట్రైలర్ గ్రిప్పింగ్‍గా, ఆసాంతం ఇంటెన్స్ కొనసాగింది. నాని ఈ రేంజ్‍లో వైలెన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. నేచురల్ స్టార్ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫేకేట్ రావడం కూడా ఇది తొలిసారి. హిట్ 3 మూవీ మే 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఫెడ్రికో బెర్టే.. యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారు. యాక్షన్ సీన్లలో ఆ ప్రభావం బాగా కనిపిస్తోంది.
హిట్ 3 చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్‍ను మరింత ఎలివేట్ చేసింది. ఇంటెన్స్ మూడ్‍ను కలిగించింది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ కూడా మెప్పించేలా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్‌తో హిట్ 3 మూవీపై అంచనాలు మరింత పెరిగేశాయి. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం