





Best Web Hosting Provider In India 2024

Khammam Crime : సినిమా కథను మించిన క్రైమ్ స్టోరీ ఇదీ.. చివర్లో ఊహించని ట్విస్ట్.. అందరూ జైలుపాలు!
Khammam Crime : వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని హత్య చేసేవరకు వెళ్లింది. లాస్ట్ మినిట్‌లో అనుకున్న పని జరగలేదు. ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సుపారీ గ్యాంగ్ సహా.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి జైలుపాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఖతం చేయాలని ప్లాన్ వేశారు. అందుకు రూ.20 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చున్నారు. రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. చంపాల్సింది అతన్నే అని కన్ఫామ్ చేసుకున్నారు. కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపూరం గ్రామంలో తొట దర్మ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయులు అలియాస్ రాము అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భర్త దర్మకు ఈ అక్రమ సంబంధం విషయం తెలిసింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
హత్యకు ప్లాన్..
ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రియురాలి భర్తను అడ్డు తొలగించాలని రాము నిర్ణయించుకున్నాడు. హత్యకు ప్రణాళిక రచించాడు. ముందుగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకట నారాయణకు ఈ విషయాన్ని చెప్పాడు. వెంకటనారాయణ తన స్నేహితుడైన రౌడీషిటర్ పగాడాల విజయ్ కుమార్ అలియాస్ చంటిని రాముకు పరిచయం చేశాడు.
ఇంకా డబ్బు కావాలని..
హత్య చేస్తే.. రూ.20 లక్షలు ఇస్తానని రాము చెప్పాడు. అడ్వాన్స్‌గా 5 లక్షలు ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం.. గత నెల 12న శశి దాబా దంసాలపురం వద్ద తోట దగ్గర దర్మను కిడ్నాప్ చేశారు. అతన్ని నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రాముకు వీడియో కాల్ చేసి దర్మను చూపించి నిర్ధారించుకున్నారు. అయితే.. దర్మను హత్య చేయడానికి మరికొంత డబ్బు కావాలని రామును నిందుతులు డిమాండ్ చేశారు.
పోలీసులను ఆశ్రయించిన దర్మ..
మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో.. రాము కాల్ కట్ చేశాడు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో విసుగు చెందిన సుపారీ గ్యాంగ్.. బంధించిన దర్మను బెదిరించి ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకున్నారు. బంగారు గొలుసు తీసుకొని వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితుడు దర్మ తనకు ప్రాణహాని ఉందని ఏప్రిల్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐదుగురు అరెస్టు..
దర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. ఆదివారం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో నిందితులు సమావేశం అయినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఖానాపురం హవేలీ పోలీసులు.. ఐదుగురు నిందుతులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వారి నుంచి రూ.90 వేల నగదు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్