క్యాన్సర్ రోగులకు చేసే కీమోథెరపీ అంటే ఏమిటి? దాన్ని ఎలా చేస్తారు? బాధాకరంగా ఉంటుందా?

Best Web Hosting Provider In India 2024

క్యాన్సర్ రోగులకు చేసే కీమోథెరపీ అంటే ఏమిటి? దాన్ని ఎలా చేస్తారు? బాధాకరంగా ఉంటుందా?

Haritha Chappa HT Telugu
Published Apr 14, 2025 04:30 PM IST

కీమోథెరపీ క్యాన్సర్ చికిత్సలో ముఖ్యమైనది. అందరి క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చేయాలని లేదు. కానీ కొంతమందికి ఇది అవసరం పడుతుంది. కీమోథెరపీ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

కీమోథెరపీ ఎలా చేస్తారు?
కీమోథెరపీ ఎలా చేస్తారు? (healthmatters.nyp.org)

కీమోథెరపీ అనేది శరీరంలో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగించే ఒక ఔషధ చికిత్స. క్యాన్సర్ కణాలు శరీరంలో ఇతర కణాలతో పోలిస్తే చాలా త్వరగా పెరుగుతాయి. అలా హై గ్రేడ్ క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపీని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కీమోథెరపీలో భాగంగా చాలా మందులు అందుబాటులో ఉంటాయి.

కీమోథెరఫీ అనేది అనేక రకాల క్యాన్సర్ల చికిత్సకు ప్రభావంతమైన మార్గం. అయితే కీమోథెరపీ చేసుకున్న వారిలో ఎన్నో సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి. వాటిని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

కీమోథెరపీని ఎందుకు చేస్తారు?

ఏ కీమోథెరపీని క్యాన్సర్ కు చికిత్సగా మొదలు పెడతారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత లేదా ఇతర చికిత్సలు చేసిన తర్వాత శరీరంలో ఎక్కడైనా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను చంపడానికి ఈ కీమోథెరపీ పద్ధతిని ఎంచుకుంటారు. దీన్ని వైద్యులు సహాయక చికిత్సగా చెప్పుకుంటారు. అలాగే కణితి పరిమాణాన్ని తగ్గించడానికి కూడా కీమోథెరపీని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే కణితి పరిమాణం కీమోథెరపీ వల్ల చిన్నగా అవుతుందో అప్పుడు రేడియేషన్ ఆపరేషన్ వంటి ఇతర చికిత్సలు చాలా సులభం అవుతాయి. కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను చంపి క్యాన్సర్ లక్షణాలను చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే వైద్యులు దీనిని పాలియెటివ్ కీమోథెరపీ అని కూడా పిలుస్తారు.

కీమోథెరపీ సైడ్ ఎఫెక్టులు

కీమోథెరపీ రోగుల్లో కొన్ని రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. వారికి ఏమి తిన్నా వికారంగా, వాంతులుగా అనిపిస్తుంది. విరేచనాలు కూడా అవుతాయి. జుట్టు పూర్తిగా రాలిపోయే అవకాశం ఉంటుంది. ఆకలి కూడా వేయదు. త్వరగా అలసిపోతారు. జ్వరం రావడం, నోటిలో పుండ్లు ఏర్పడడం వంటివి జరుగుతాయి. గాయాలు చాలా సులువుగా తగులుతాయి. రక్తస్రావం కూడా గాయాలు నుంచి అధికంగానే ఉంటుంది. విపరీతమైన నొప్పి కూడా వస్తుంది.

కీమోథెరపీని ఎలా చేస్తారు?

కీమోథెరపీలో అనేక రకాల మందులను వాడతారు. వీటిని అనేక రకాల మార్గాల్లో ఇస్తారు. కీమోథెరపీని చాలా తరచుగా సిరల్లోకి ఇన్ఫ్యూషన్ చేస్తారు. అంటే చేతిలోని సిరలోకి లేదా ఛాతీ దగ్గర ఉన్న సిరలోకి సూదితో కూడిన గొట్టాన్ని పెట్టి మందులను ఇస్తారు. ఈ ఇన్ఫ్యూషన్ చాలా సమయం పడుతుంది. అరగంట నుండి కొన్ని గంటల వరకు పట్టవచ్చు. కొన్ని కీమోథెరీ మందులను మాత్రలు లేదా గుళికల రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇక కీమోథెరపీ షాట్లు అని పిలుస్తారు. వాటిని సూదితోనే ఇంజెక్ట్ చేస్తారు. ఇక చర్మ క్యాన్సర్ వంటి వాటికీ కీమోథెరపీ మందులను క్రీములు రూపంలో అందిస్తారు. ఇక్కడ చెప్పుకున్నంత సులువుగా కీమోథెరపీ ఉండదు. చేయించుకుంటున్న రోగికి ఆ మందుల ప్రభావం వల్ల ఎంతో ఇబ్బందిగా, బాధాకరంగా ఉంటుంది. అందుకే కీమోథెరపీకి ముందుగానే రోగులను సిద్ధం చేస్తారు వైద్య బృందం.

కీమోథెరపీ మందుల్లో కొన్ని సంతానోత్పత్తి సమస్యలను కూడా కలిగిస్తాయి. కాబట్టి పెళ్లి కాని యువతీ యువకులు తమ అండాలను లేదా స్పెర్మ్ ను నిల్వ చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది. కీమాథెరపీని ప్రారంభించే ముందు మీ వైద్య బృందం మీ చికిత్స గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.

కీమోథెరపీ మందులు మన శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు కొన్ని సాధారణ కణాలను కూడా దెబ్బతీస్తాయి. దీని వల్లే మనకి సైడ్ ఎఫెక్టులు కలుగుతాయి.

కీమోథెరపీ ఏ రకమైన క్యాన్సర్ కు చికిత్స?

అనేక రకాల క్యాన్సర్లకు కీమోథెరపీతో చికిత్స చేస్తారు. ప్రాథమికంగా గుర్తించిన క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు వ్యాపించక ముందే కీమోథెరపీని చేస్తారు. అలాగే మీ శరీరంలోని ఇతర ప్రాంతాలకు కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే దాన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. దీనికి కూడా కీమోథెరపీ చేస్తారు. క్యాన్సర్ దశ, అది ఉండే ప్రదేశాన్ని బట్టి కీమోథెరీ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

ఏ దశలో ఉన్నవారికి కీమోథెరపీ?

కీమోథెరపీ చికిత్స అందుకోవడానికి క్యాన్సర్ దశతో సంబంధం లేదు. ఏ దశలోనైనా కీమోథెరపీని వైద్యులు అందించగలరు. మోతాదు, చికిత్స వంటివి మాత్రమే దశపై ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్ ప్రతిస్పందించే గుణాన్ని బట్టి కూడా కీమాథెరపీ చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి వైద్యులే అన్ని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024