





Best Web Hosting Provider In India 2024

OTT Bold Tamil Movie: ఓటీటీలోకి బోల్డ్ తమిళం మూవీ.. లెస్బియన్ లవ్ స్టోరీతో.. ఇక్కడ చూడండి
OTT Bold Tamil Movie: ఓటీటీలోకి ఇప్పుడో బోల్డ్ తమిళ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. లెస్బియన్ లవ్ స్టోరీతో రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

OTT Bold Tamil Movie: లెస్బియన్ లవ్ స్టోరీ అంటే ఇప్పటికీ మన సమాజం వింతగానే చూస్తుంది. అది చట్ట వ్యతిరేకం కాదన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా దీనిని అంగీకరించే వాళ్లు తక్కువే. అలాంటి బోల్డ్ కాన్సెప్ట్ పై ఈ మధ్య తరచూ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడో తమిళ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.
కాదల్ ఎన్బదు పోదు ఉదమై ఓటీటీ రిలీజ్ డేట్
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన మూవీ కాదల్ ఎన్బదు పోదు ఉదమై. అంటే ప్రేమ ఓ పబ్లిక్ ప్రాపర్టీ అని అర్థం. ఈ సినిమాను ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. సోమవారం (ఏప్రిల్ 14) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ఈ విషయాన్ని సన్ నెక్ట్స్ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “అడ్డంకులను అధిగమించండి. ప్రేమను ఫీల్ అవండి. ఇప్పుడే చూడండి. కాదల్ ఎన్బదు పోదు ఉదమై సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వినీత్, రోహిణి, లిజోమోల్ జోస్, అనూష ప్రభు నటించారు.
కాదల్ ఎన్బదు పోదు ఉదమై స్టోరీ ఏంటంటే?
సేమ్ సెక్స్ ప్రేమ, పెళ్లి అంటే ఇప్పటికీ మన సమాజంలో వింతగానే చూస్తారు. అలాంటి ప్రేమను, పెళ్లిని ఆమోదించే పరిస్థితుల్లో ఇంకా మెజార్టీ జనం లేరు. ఈ నేపథ్యంలో ఇద్దరు లెస్బియన్ల ప్రేమ, పెళ్లి అనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీయే ఈ కాదల్ ఎన్బదు పోదు ఉదమై. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. అభినవ్ సుబ్రమణియన్ కథ అందించిన ఈ సినిమాను జయప్రకాశ్ రాధాకృష్ణన్ డైరెక్ట్ చేశాడు. వినీత్, రోహిణిలాంటి సీనియర్ నటీనటులతోపాటు లిజోమోల్ జోస్, అనూష ప్రభులాంటి వాళ్లు నటించారు.
ఓ అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమిస్తుంది. ఆ విషయం అమ్మాయి ఇంట్లో వాళ్లకు తెలిసి ఆమె తల్లిదండ్రులు షాక్ తింటారు. దీనికి వాళ్లు అసలు అంగీకరించరు. అసలు అది ఎలా సాధ్యం అంటూ నిలదీస్తారు. ఈ క్రమంలో ఆ యువ ప్రేమ జంట వాళ్లను ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి? చివరికి ఆ పేరెంట్స్ ఏం చేశారన్నదే ఈ మూవీ స్టోరీ. మన సమాజంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
సంబంధిత కథనం