Study in UK : ఫీజులు పెరిగినా యూకేలో చదువుకు భారీ డిమాండ్​- కారణాలు ఇవే!

Best Web Hosting Provider In India 2024


Study in UK : ఫీజులు పెరిగినా యూకేలో చదువుకు భారీ డిమాండ్​- కారణాలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Published Apr 14, 2025 01:40 PM IST

Study in UK : యూకేలో చదువుకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి డిమాండ్​ కనిపిస్తోంది. వీసా ఫీజులు పెరిగినా, విధానపరమైన మార్పులు వచ్చినా.. విద్యార్థులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. కలలు సాకారం చేసుకునేందుకు యూకేలోని మంచి యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు.

యూకేలో చదువు ఆర్థికంగా మంచి ఆప్షన్​ అవుతుందా?
యూకేలో చదువు ఆర్థికంగా మంచి ఆప్షన్​ అవుతుందా?

విధానపరమైన మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ విద్యార్థుల కలల సాకారానికి యూకే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇందుకు నిత్యం పెరుగుతున్న యూకే స్టడీ వీసా అప్లికేషన్ల సంఖ్య చక్కటి ఉదాహరణ. 2024 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో యూకే వీసా అప్లికేషన్లు 13శాతం పెరిగి 28,700కి చేరాయి. గతేడాదితో పోల్చికే యూకేలో చదువు కోసం వీసా అప్లికేషన్ల పెరగడం 2023 అక్టోబర్​ తర్వాత ఇదే మొదటిసారి. దీనిబట్టి, యూకేలో విద్యకు ఉన్న డిమాండ్​ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఎన్ని మార్పులు వచ్చినా యూకేలో చదువకు డిమాండ్​ పెరుగుతూనే ఉంటుందని ఇంటర్నేషనల్​ స్టూడెంట్​ లోన్​ లెండర్​ ప్రాడిగీ ఫైనాన్స్​ అంచనా వేసింది.

యూకేలో చదువుకు భారీ డిమాండ్​..!

ధరలు పెరుగుతున్నప్పటికీ, అనేక విధానపరమైన మార్పులు కనిపించినప్పటికీ విద్యార్థులు యూకేని ప్రిఫర్​ చేస్తుండటం.. ఇక్కడ అసలు విషయం! పోస్ట్​గ్రాడ్యుయేట్​ రీసెర్చ్​ లేదా ప్రభుత్వ సాయంతో చదువుకునే విద్యార్థులు మాత్రమే దేశంలోకి తమతో పాటు మరొక డిపెండెంట్​ని తీసుకువచ్చే విధంగా 2024 జనవరిలో అక్కడి ప్రభుత్వం కీలక రూల్​ని తీసుకొచ్చింది. ఫలితంగా డిపెండెంట్​ వీసా అప్లికేషన్లు భారీగా (2023 జనవరిలో 17,500 నుంచి 2025 జనవరిలే 2,300 వరకు) పడిపోయాయి. ఇక ఏప్రిల్ 2025 నుంచి​ వీసా అప్లికేషన్​ ఫీజును 13శాతం పెంచారు. ఫలితంగా ఎడ్యుకేషన్​ బడ్జెట్​ మరింత పెరగనుంది.

ఈ పరిస్థితులు భవిష్యత్తు అప్లికేషన్లపై ప్రభావం చూపించవచ్చు. కానీ ఎన్ని రూల్స్​ మార్చినా, ఎంత ఫీజులు పెంచినా, చదువుకు యూకే గమ్యస్థానంగా నిలుస్తుందని గత చరిత్రను చూస్తే స్పష్టమవుతుందని ప్రాడిగీ ఫైనాన్స్​ వివరించింది.

“ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు తమ చదువు కోసం యూకేవైపు చూస్తున్నారు,” అని ప్రాడిగీ ఫైనాన్స్​ గ్లోబల్​ చీఫ్​ బిజినెస్​ ఆఫీసర్​ సోనాల్​ కపూర్​ తెలిపారు. “ధరలు పెరుగుతున్న, వీసా రూల్స్​ మారుతున్నా, విద్యార్థులు మాత్రం వెనకడగు వేయడం లేదు. ప్రాడిగీ ఫైనాన్స్​లో వివిధ రకాల లోన్స్​ ఇచ్చి విద్యార్థులకు మద్దతు ఇస్తుండటం మాకు గర్వంగా ఉంది,” అని స్పష్టం చేశారు.

మరోవైపు విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పలు యూకే యూనివర్సిటీలు సైతం ముందుకొస్తున్నాయి. ఆస్టన్​ యూనివర్సిటీ, బ్రునెల్​ యూనివర్సిటీ, బాంగోర్​ యూనివర్సిటీ, డీ-మాంట్​ఫోర్ట్​ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్​ అబెర్దీన్​, యూనివర్సిటీ ఆఫ్​ ఈస్ట్​ ఆంగ్లియా, యూనివర్సిటీ ఆఫ్​ రీడింగ్​, కింగ్​స్టన్​ యూనివర్సిటీలు.. ప్రాడిగీ ఫైనాన్స్​ నుంచి ఎడ్యుకేషన్​ లోన్​ పొందిన విద్యార్థుల సీఏఎస్​ (కన్ఫర్మేషన్​ ఆఫ్​ యాక్సెప్టెన్స్​ ఫర్​ స్టడీస్​) డిపాజిట్లను రద్దు చేశాయి. ఫలితంగా విద్యార్థులపై ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గనుంది.

యూకేలో ఈయూయేతర విద్యార్థుల్లో భారతీయులే అధికం. విద్యకు ఖర్చులు పెరుగుతుండటంతో ఇప్పుడు విద్యార్థులు వివిధ వర్సిటీలను ర్యాంకింగ్స్​తోనే కాదు ఆర్థిక ఖర్చులు, చదువు తర్వాత అవకాశాలను కూడా పోల్చి చూస్తున్నారు. వీరికి సాయం చేసేందుకు అనేక స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్స్​, యూనివర్సిటీ పార్ట్​నర్​షిప్స్​, తక్కువ ఏపీఆర్​ (యాన్యువల్​ పర్సెంటేజ్​ రేట్​)తో కూడిన లోన్​కి సహ-సంతకం వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి.

నిరంతరం మారుతున్న నేటి ప్రపంచ పరిస్థితుల్లో అధిక ఆర్థిక మద్దతు ఉండటం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు, వారి భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాడిగీ ఫైనాన్స్​ లోన్లు ఇస్తోంది. తద్వారా విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకునేందుకు ముందడుగు వేయవచ్చు.

ధరల పెరుగుదల, పాలసీల మార్పులకు వర్సిటీలు, విద్యార్థులు సద్దుకుంటుంటే, వారికి ఆర్థికంగా సాయం లభిస్తుండటంతో యూకేలో చదువుకు అందరు మొగ్గుచూపుతున్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link