Gunde Ninda Gudi Gantalu Serial: న‌ష్ట‌జాత‌కుడిగా బాలు- త‌ల్లి ప్రేమ కోసం ఆరాటం- భ‌ర్త క‌ష్టాల‌కు క‌రిగిపోయిన మీనా

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: న‌ష్ట‌జాత‌కుడిగా బాలు- త‌ల్లి ప్రేమ కోసం ఆరాటం- భ‌ర్త క‌ష్టాల‌కు క‌రిగిపోయిన మీనా

Nelki Naresh HT Telugu
Published Apr 15, 2025 09:39 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు నేటి ఎపిసోడ్‌లో ప్ర‌భావ‌తి అవ‌మానించ‌డంతో బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు. అమ్మ ఉండి కూడా ఆమె ప్రేమ దొర‌క‌ని దుర‌దృష్ట‌వంతుడిని తాను అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. బాలును మీనా ఓదార్చుతుంది.

గుండె నిండా గుడి గంట‌లు సీరియల్
గుండె నిండా గుడి గంట‌లు సీరియల్

Gunde Ninda Gudi Gantalu Serial: ప్ర‌భావ‌తి త‌న‌ను ద్వేషించ‌డం బాలు త‌ట్టుకోలేక‌పోతాడు. త‌న బాధ‌ను మీనాతో పంచుకొని ఎమోష‌న‌ల్ అవుతాడు. నా క‌థ‌లో అమ్మ‌లేదు. నాకు మాత్ర‌మే లేద‌ని అంటాడు. అమ్మ ప్రేమ దొర‌క‌ని బిడ్డ‌లు కొంద‌రు ఉంటారు. నాలాగా న‌ష్ట‌జాత‌కులు అని బాలు క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

చిన్న‌ప్ప‌టి నుంచి ఏది ద‌క్క‌లేదు నాకు . నా క‌ళ్లు ప్రేమ కోసం ఎదురుచూడ‌టం మానేశాయ‌ని మీనాతో చెబుతాడు. అమ్మ ఉండి ప్రేమ దొర‌క‌ని దుర‌దృష్ట‌వంతుడు ఈ ప్ర‌పంచంలో ఎవ‌రు ఉండ‌రు. ఒక్క నేను త‌ప్ప అని బాలు త‌న మ‌న‌సులో ఉన్న బాధ‌ను బ‌య‌ట‌పెడ‌తాడు. బాలు మాట‌ల‌తో మీనా కూడా ఎమోష‌న‌ల్ అవుతుంది. భ‌ర్త‌ను ఓదార్చుతుంది.

ప్ర‌భావ‌తి జెల‌సీ…

ప‌ల్లెటూళ్లో బోర్ కొడుతుంద‌ని వెళ్లిపోదామ‌ని ర‌వితో అంటుంది శృతి. మ‌రోవైపు రోహిణి కూడా ప‌ళ్లెటూళ్లో ఉండ‌టం న‌చ్చ‌లేదంటూ యాక్టింగ్ చేస్తుంది. ఉన్న రెండు రోజులు ఆనందంగా గ‌డిపేందుకు వారి కోసం కొన్ని ఆట‌ల పోటీలు పెడుతుంది సుశీల‌. ఈ పోటీలో ఎలాగైనా బాలు, మీనాల‌ను ఓడించాల‌ని ప్ర‌భావ‌తి స్కెచ్ వేస్తుంది. బాలు త‌మ‌ను మాట‌ల‌తో టార్చ‌ర్ పెడుతున్న సంగ‌తి గుర్తు చేసుకుంటారు ర‌వి – శృతితో పాటు మ‌నోజ్ – రోహిణి. బాలుపై రివేంజ్ తీర్చుకోవ‌డానికైనా అత‌డిని ఓడించాల‌ని ఫిక్స‌వుతారు.

ప్ర‌భావ‌తి టీమ్‌లో బాలు…

కుటుంబ స‌భ్యుల‌ను రెండ్ టీమ్‌లుగా విడ‌గొడుతుంది సుశీల‌. ఓ టీమ్‌కు కెప్టెన్‌గా ప్ర‌భావ‌తి…మ‌రో టీమ్‌కు కెప్టెన్‌గా స‌త్యం ఉంటారు. స‌త్యం టీమ్‌లో మీనా, శృతి, రోహిణి ఉండ‌గా…ప్ర‌భావ‌తి టీమ్‌లో ర‌వి, బాలు, మ‌నోజ్‌లు ఉంటారు.

బాలుకు నో ఛాన్స్‌…

బాలు త‌న టీమ్‌లో ఉండ‌టానికి వీలు లేద‌ని సుశీల‌తో ప్ర‌భావ‌తి వాదిస్తుంది. బాలును నానా మాట‌లు అంటుంది. బాలు, మీనాల‌కు ప్ర‌భావ‌తికి ద‌గ్గ‌ర చేసేందుకే ఈ గేమ్స్ ప్లాన్ చేస్తుంది సుశీల‌. బాలు మ‌న‌సులో త‌ల్లి ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ఫిక్స‌వుతుంది. త‌ల్లి ప్రేమ కోసం బాలు ప‌డుతోన్న ఆవేద‌న చూసి ప్ర‌భావ‌తి కూడా ఆలోచ‌న‌లో ప‌డుతుంది.

రోహిణి హ్యాపీ…

మాణిక్యం డ్రామా డైవ‌ర్ట్ కావ‌డంతో రోహిణి హ్యాపీగా ఫీల‌వుతుంది. కానీ బాలు మాత్రం మాణిక్యం అడ్రెస్ క‌నిపెట్టి తీరాల‌ని ఫిక్స‌వుతాడు. మాణిక్యం ద్వారా రోహిణి అడుతోన్న నాట‌కాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటాడు. మాణిక్య మ‌ట‌న్ కొట్టు నిజం బాలుకు తెలిసిపోయిందా? ఆటల పోటీల్లో బాలు, మీనాకు ఎలాంటి అవ‌మానం జ‌రిగింది? బాలుపై ప్ర‌భావ‌తి ద్వేషానికి కార‌ణం ఏమిటి నేటి గుండె నిండా గుడి గంట‌లు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024