






Best Web Hosting Provider In India 2024

HIT 3 Business: హిట్ 3 సినిమాకు ఈ రేంజ్‍లో బిజినెస్ జరిగిందా! హిట్ కావాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాలి?
HIT 3 Business: హిట్ 3 సినిమా థియేట్రికల్ బిజనెస్ గురించి సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీకి పూర్తిస్థాయిలో అంచనాలకు మించి బిజినెస్ జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాపై ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. వైలెంట్ యాక్షన్, ఇంటెన్సిటీతో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంపై మొదటి నుంచే చాలా హైప్ ఉన్నా.. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ హిట్ 3 థియేట్రికల్ హక్కుల రేట్ల గురించి సమాచారం బయటికి వచ్చింది.
థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఎంత!
హిట్ 3 సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.40కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం బయటికి వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో ఈ చిత్రం దుమ్మురేపింది. ఆంధ్రా, సీడెడ్ కలిపి రూ.20కోట్లు, నైజాంలో సుమారు రూ.12కోట్ల మేర ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఎవర్సీస్, ఇతర భాషలతో కలుపుకుంటే మొత్తంగా రూ.40కోట్ల వరకు హిట్ 3 చిత్రం థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
హిట్ 3 సినిమా సుమారు రూ.40కోట్ల థియేట్రికల్ షేర్ అంటే సుమారు రూ.75కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే హిట్ స్టేటస్ దక్కించుకుంది. అంతకు మించి వసూళ్లు దక్కితే బ్లాక్‍బస్టర్ అవుతుంది. ఈ చిత్రానికి ఉన్న హైప్ చూస్తుంటే బ్రేక్ఈవెన్ టార్గెట్ తొలివారంలోనే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ హిట్ 3 ఎంత కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.
ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు..
హిట్ 3 సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా భారీగా జరిగాయి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ.54కోట్లతో డీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆడియో హక్కుల రూపంలో మరో రూ.6కోట్ల ఈ మూవీకి దక్కాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి రూ.100కోట్లకు పైగా ఈ చిత్రానికి ఓవరాల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.
హిట్ 3 చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నానినే నిర్మించారు. ఆయన రెమ్యూనషన్ కాకుండా ఈ మూవీకి రూ.60కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనా. ఈ మొత్తం ఓటీటీ, ఆడియో హక్కుల రూపంలోనే వచ్చేసింది. థియేట్రికల్ బిజినెస్ అంతా లాభమే. దీంతో ఈ సినిమాతో నానికి అప్పుడే టేబుల్ ప్రాఫిట్స్ భారీగా వచ్చేశాయి.
హిట్ 3 చిత్రంలో అర్జున్ సర్కార్ అనే సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా నాని నటించారు. గతంలో ఎప్పుడు లేనంత వైలెంట్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం