



Best Web Hosting Provider In India 2024
TG TET 2025 : తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుకు వేళాయే.. ఇలా చాలా సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు
TG TET 2025 : తెలంగాణ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఇవాళ్టి నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వివరించింది. ఏడాదిలో రెండుసార్లు జూన్, డిసెంబర్ మాసాల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ టెట్ 2025 దరఖాస్తులను ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ జూన్ తర్వాత మళ్లీ డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా అభ్యర్థులు అప్లై చేసుకోవాలని.. అధికారులు సూచించారు. టెట్ షెడ్యూల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 11, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 15, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9, 2025 నుండి
పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి జూన్ 30, 2025 మధ్య
ఫలితాల ప్రకటన: జూలై 22, 2025
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in
సమాచార బుల్లెటిన్‌ను డౌన్‌లోడ్ చేసి, జాగ్రత్తగా చదవాలి.
ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి
చెల్లింపు తర్వాత జర్నల్ నంబర్ వస్తుంది.
జర్నల్ నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపాలి.
స్కాన్ చేసిన ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తును సమర్పించి, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
దరఖాస్తు రుసుము..
ఒక పేపర్‌కు (పేపర్ I లేదా పేపర్ II) రూ.750
రెండు పేపర్‌లకు (పేపర్ I & II) రూ.1000
పరీక్ష విధానం..
పరీక్షలు ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ఆధారిత పరీక్ష -సీబీటీ) ఉంటాయి.
క్వశ్చన్ పేపర్ బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉంటుంది.
ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
నెగెటివ్ మార్కింగ్ లేదు.
పేపర్ I (1 నుండి 5 తరగతుల వరకు ఉపాధ్యాయుల కోసం)..
బాల వికాసం, బోధనా శాస్త్రం
భాష I (తెలుగు, ఉర్దూ, హిందీ)
భాష II (ఆంగ్లం)
గణితం
పరిసరాల అధ్యయనం
పేపర్ II (6 నుండి 8 తరగతుల వరకు ఉపాధ్యాయుల కోసం)..
బాల వికాసం, బోధనా శాస్త్రం
భాష I (తెలుగు, ఉర్దూ, హిందీ)
భాష II (ఆంగ్లం)
గణితం, సైన్స్ లేదా సాంఘిక శాస్త్రం
సంబంధిత కథనం
టాపిక్