వేసవిలో ముక్కులో నుంచి రక్తం కారితే భయపడకండి! తక్షణ ఉపశమనం కోసం ఈ 4 రకాల చిట్కాలు పాటించండి!

Best Web Hosting Provider In India 2024

వేసవిలో ముక్కులో నుంచి రక్తం కారితే భయపడకండి! తక్షణ ఉపశమనం కోసం ఈ 4 రకాల చిట్కాలు పాటించండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 15, 2025 10:30 AM IST

వేసవి కాలంలో చాలా మందిలో ముక్కు నుంచి రక్తం కారడం సహజమైన సమస్యే. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ఎవరికైనా ఈ సమస్య కలగొచ్చు. అకస్మాత్తుగా ఇలా ముక్కు నుంచి రక్తం కారుతుందని భయపడకండి. వెంటనే ఈ 4 చిట్కాల ద్వారా రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేయండి.

ముక్కు నుంచి రక్తం కారుతుంటే ఏం చేయాలి
ముక్కు నుంచి రక్తం కారుతుంటే ఏం చేయాలి

వేసవిలో ముక్కు నుంచి రక్తం రావడం చాలా మందిలో చూస్తుంటాం. శరీరంలో కలిగే వేడితో పాటు వాతావరణంలో ఎదుర్కొనే వేడి కూడా ఇందుకు కారణం. తీవ్రమైన వేడిలో ముక్కు నుంచి రక్తం కారడం చాలా సాధారణం. వేసవి కాలంలో చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేడి వాతావరణం వల్ల ముక్కు భాగం ఎండిపోయి ముక్కు నుంచి రక్తస్రావం కలుగుతుంది. వాస్తవానికి, వేడి వాతావరణంలో వీచే పొడి గాలి వల్ల చిన్న రక్తనాళాలు పగిలిపోతాయి. దీని వల్ల రక్తస్రావం జరుగుతుంది.

ఈ సమస్యలకు డాక్టర్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. హోం రెమెడీలతో కూడా దీనికి పరిష్కారం వెదుక్కోవచ్చు. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రమైతే మాత్రం.. నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవాలి. ముక్కు నుంచి రక్తస్రావం సాధారణంగా కనిపిస్తే ఈ చిట్కాలు పాటించాలి.

1) చల్లని వస్తువులతో కాపడం

ముక్కు నుంచి రక్తస్రావం ఆపడానికి చల్లని వస్తువులతో కాపాలి. ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. దీని కోసం కొన్ని నిమిషాల పాటు మీ ముక్కుపై ఐస్ ముక్కతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కులోని చిన్న రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయి. దీని వల్ల రక్తస్రావం అధికమవుతుంది.

2) ముక్కును ఒత్తడం

ముక్కు నుంచి రక్తం కారుతుంటే, దాన్ని ఆపడానికి ఉత్తమ మార్గం ముక్కును చేతితో ఒత్తుకోవడం. ఎందుకంటే ఇది రక్తస్రావం జరిగే ప్రదేశంపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల రక్తం వెంటనే ఆగిపోతుంది. మీరు చేయాల్సిందల్లా మీ తలను కొద్దిగా ముందుకు వంచి నేరుగా కూర్చోవడం. ఆ తర్వాత మీ బొటనవేలు, చూపుడు వేలుతో ముక్కులోని మృదువైన భాగాన్ని నొక్కండి. దాదాపు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా చేయండి. ఇలా చేస్తున్న సమయంలో ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకోండి.

3) ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉన్న ఆమ్లం రక్తనాళాలను కుచించుకోవడానికి సహాయపడుతుంది. దీని వల్ల రక్తస్రావం ఆగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక కాటన్ బాల్‌ను వెనిగర్‌లో ముంచి దాన్ని ముక్కులో దాదాపు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచండి.

4) విటమిన్ ఈ క్యాప్సూల్

ముక్కు పొరలు పొడిబారడం వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది. అత్యంత సాధారణ కారణమైన దీని కోసం చర్మాన్ని సంరక్షించే మార్గాలను ఎంచుకోవాలి. వాటిల్లో ఒకటి విటమిన్ ఈ క్యాప్సుల్ వాడటం. ఒక విటమిన్-ఈ క్యాప్సూల్‌ నుంచి నూనెను బయటకు తీయండి. ఈ నూనెను నాసికా రంధ్రాలపై వేసి కొంత సేపు ఉంచండి. అలా ఉంచడం వల్ల పొడిగా మారిన ముక్కులోని భాగానికి ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరగకుండా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024