






Best Web Hosting Provider In India 2024

NTR Next Movies: ఎన్టీఆర్ సినిమాల లైనప్‍పై క్లారిటీ ఇచ్చేసిన కల్యాణ్ రామ్.. దేవర నెగెటివిటీపై కూడా కామెంట్స్
NTR Next Movies: జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాల గురించి కల్యాణ్ రామ్ చెప్పారు. దేవర 2, డైరెక్టర్ నెల్సన్‍తో మూవీల్లో ఏది ముందుగా ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు. దేవర చిత్రంపై వచ్చిన నెగెటివిటీ గురించి కూడా మాట్లాడారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో మూవీ చేయనున్నారు. బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్ రీసెంట్‍గానే పూర్తి చేసుకున్నారు. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ చిత్రాన్ని ఎన్టీఆర్ ఓకే చెప్పారు. దేవర 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. దీంతో ఆ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ ముందు ఏది చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎన్టీఆర్ సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈ వారం ఏప్రిల్ 18న విడుదల కానుంది. దీంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కల్యాణ్. ఈ క్రమంలో ఎన్టీఆర్ లైనప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్వూలో మాట్లాడారు. ఏ చిత్రం ముందో వెల్లడించారు.
ఎన్టీఆర్ లైనప్ ఇలా..
డైరెక్టర్ ప్రశాంత్ నీత్‍తో సినిమాను ముందుగా ఎన్టీఆర్ పూర్తి చేస్తారని కల్యాణ్ రామ్ తెలిపారు. ఆ తర్వాత కొరటాల శివతో సీక్వెల్ మూవీ దేవర 2 చేస్తారని వెల్లడించారు. ఆ తర్వాతే నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో దేవర 2 తర్వాత నెల్సన్ చిత్రం ఉంటుందని తేలిపోయింది.
ఇటీవలే దేవర 2 గురించి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్‍లోనూ ఎన్టీఆర్ మాట్లాడారు. దేవర సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరింత భారీగా ఉంటుందని అన్నారు. సీక్వెల్‍లో వర గురించి ఎక్కువగా తెలుసుకుంటారంటూ చెప్పేశారు.
దేవరపై వచ్చిన నెగెటివిటీ గురించి..
దేవర ఫస్ట్ పార్ట్ సినిమా మేకింగ్ క్వాలిటీ సరిగా లేదని సోషల్ మీడియాలో నెగెటివిటీ వచ్చిందనే ప్రశ్న కల్యాణ్ రామ్‍కు ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. దేవర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని, తెలుగు ఇండస్ట్రీలో ఇంతకు ముందెప్పుడైనా అలాంటి విజువల్స్ చూశారా అని కల్యాణ్ రామ్ అన్నారు. కొందరు దృష్టిని ఆకర్షించేందుకు నెగెటివ్ మాటలు అంటారని, వాటి గురించే మాట్లాడుతుంటారని చెప్పారు. తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ను, ఎన్టీఆర్ కూడా తనదే అనుకుంటారని చెప్పారు. దేవర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని, పాజిటివ్ విషయాలు చాలా ఉన్నాయని అన్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, కొరటాల శివ చాలా కష్టపడ్డారని చెప్పారు.
గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన దేవర సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హిట్ సాధించింది. కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. దేవర మూవీలో విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్‍పై కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‍గా దేవర 2 రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రశాంత్ నీల్‍తో సినిమా షూటింగ్‍కు ఈ నెలలోనే జాయిన్ కానున్నారు ఎన్టీఆర్. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు రూమర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం