






Best Web Hosting Provider In India 2024

TG Govt Affidavit: హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టులో సీఎస్ అఫిడవిట్
TG Govt Affidavit: సెంట్రల్ యూనివర్శిటీలో వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల ప్రభుత్వ భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ జరిపి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

TG Govt Affidavit: వివాదాస్పదంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సుప్రీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ భూమి ఆటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందించిన అఫిడవిట్‌లో స్పష్టంచేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉన్న భూమి ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని వివరించింది.
ఏపీఐఐసీ ద్వారా వేలం వేసేందుకు హెచ్‌సీయూ సమీపంలో ఉన్న 400ఎకరాల భూమిని కొద్ది రోజుల క్రితం బుల్డోజర్లతో చదును చేయడం వివాదాస్పదంగా మారింది. 2004లో ఐఎంజీ ఇండ్ భారత్‌కు కేటాయించిన భూముల్ని 2006లో రద్దు చేశారు. ఆ తర్వాత కోర్టు వివాదాలు తలెత్తాయి. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అది ప్రభుత్వ పరమైంది.
ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూముల వేలం పక్రియ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. బుల్డోజర్లతో భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో పర్యావరణ కేసుల విచారణలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలు సుప్రీం కోర్టు దృష్టికి రావడంతో ధర్మాసనం నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అదే రోజు అక్కడ ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయని రిజిస్ట్రార్ నివేదిక ఇవ్వడంతో తక్షణం పనులు ఆపాలని, భూముల వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సీఎస్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్‌సీయూ భూముల కేసును సుమోటోగా విచారించి వెంటనే అక్కడి కార్యకలాపాలపై స్టే విధించింది. ఐదు అంశాలకు సమాదానమిస్తూ ఏప్రిల్ 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అటవీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో చెట్లను కొట్టేయడంతోపాటు ఇతరత్రా అభివృద్ధి కార్యక లాపాలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి కార్యకలాపా లకు పర్యావరణ ప్రభావ మదింపు ధ్రువపత్రం ఉందా? చెట్ల నరికివేతకు అటవీ, ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూములు అటవీ భూములు కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములేనని తెలంగాన ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.
సంబంధిత కథనం
టాపిక్