






Best Web Hosting Provider In India 2024

Arjun Kapoor On Sandeep Reddy: అర్జున్ రెడ్డి పిచ్చెక్కించింది.. ఆ డైరెక్టర్ కు దండం.. బాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు
Arjun Kapoor On Sandeep Reddy: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అర్జున్ రెడ్డి మూవీ చూస్తుంటే పిచ్చెక్కిపోయిందని, యానిమల్ టేకింగ్ అదుర్స్ అంటూ పేర్కొన్నాడు.

యూనిక్ స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలను మెస్మరైజ్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకూ ఈ సెన్సేషనల్ డైరెక్టర్ మేకింగ్ పై వైరల్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ కూడా సందీప్ రెడ్డి వంగాపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అర్జున్ రెడ్డి చూస్తుంటే పిచ్చెక్కిందని పేర్కొన్నాడు.
ఆ క్యారెక్టర్స్
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాల్లో హీరోల యాక్షన్స్ తో తాను ఏకీభవించలేదని అర్జున్ కపూర్ అన్నాడు. అయినా ఆ క్యారెక్టర్స్ ఎలా థింక్ చేస్తున్నాయో అనేది సందీప్ అర్థమయ్యేలా చెప్పిన తీరును తాను ఎంజాయ్ చేస్తున్నట్లు అతను పేర్కొన్నాడు. ఆ డైరెక్టర్ విజువల్ స్టైల్ కు తాను ఫ్యాన్ అని అర్జున్ చెప్పాడు.
ఎడిటింగ్, ఫ్రేమింగ్, విజువల్, ఆడియో ప్యాటన్ తో సందీప్ రెడ్డి యూనిక్ గా స్టైల్ క్రియేట్ చేశారని అర్జున్ అన్నాడు. ముఖ్యంగా యానిమల్ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదరగొట్టాడని అన్నాడు.
ఆ సీన్
యానిమల్ మూవీలో రణ్ విజయ్ సింగ్ క్యారెక్టర్ లో రణ్ బీర్ కపూర్.. గూండాల గుంపును ఎదుర్కొనే సీన్ థియేటర్లలో విజిల్స్ కొట్టించిన సంగతి తెలిసిందే.
“ఓల్డ్ బాయ్స్ (కారిడార్) సీక్వెన్స్ నాకు గుర్తుంది. అప్పుడు సందీప్ ఏమి చేశాడో నాకు గుర్తుంది. గూండాలకు ముసుగులు వేసిన సందీప్.. వాటిని కేవలం క్యారికేచర్ కాకుండా చెడు కు ఉన్న ఫేస్ గా చెప్పాలనుకున్నాడు. బాబీ డియోల్ ఇంట్రడక్షన్, రణ్ బీర్ స్ప్లిట్ స్క్రీన్ ను వాడిన తీరు సాధారణం కాదు. ఆ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఆ సీన్ ను మరింత ఎలివేట్ చేసింది’’ అని అర్జున్ తెలిపాడు.
ఆ మూవీతో పాగల్
ఇక యానిమల్ మూవీలో రణ్ బీర్ గన్ తో స్కూల్ కు వెళ్లడాన్ని చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ దాని అతను ఎందుకు అలా చేశాడో అర్థం చేసుకోవాలని అర్జున్ అన్నాడు.
ఇక విజయ్ దేవరకొండతో సందీప్ డెబ్యూ సినిమా అర్జున్ రెడ్డి గురించి అర్జున్ మాట్లాడుతూ “అర్జున్ రెడ్డి చాలా అద్భుతంగా రూపుదిద్దుకున్న సినిమా. మెయిన్ తో పాగల్ హో గయా థా దేఖ్కే (అది చూస్తున్నప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది). ఒంటరిగా చూశా. నేను కుర్చీలో నుంచి లేచి చప్పట్లు కొట్టడం ప్రారంభించాను. ఈ మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో, ఈ రచన ఏమిటో అని ఆలోచిస్తూ పిచ్చోణ్నయ్యా’’ అని అర్జున్ చెప్పాడు.
సంబంధిత కథనం