







Best Web Hosting Provider In India 2024

Urvashi Post Tamannaah: తమన్నాపై కుళ్లుకుంటున్న ఊర్వశి.. కాంట్రవర్సీ పోస్టు.. వెంటనే డిలీట్.. అసలేమైందంటే?
Urvashi vs Tamannaah: ఎప్పుడూ ఏవో సెన్షేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా.. మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి తమన్నా భాటియా కంటే తన సాంగ్ బాగుందంటూ ఫ్యాన్ చేసిన కామెంట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన ఊర్వశి.. వెంటనే దాన్ని డిలీట్ చేసింది.

బాలీవుడ్ గ్లామర్ డాల్ ఊర్వశి రౌటేలా మరో బాంబ్ పేల్చింది. కాంట్రవర్సీకి కారణమైన ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేసి, వెంటనే డిలీట్ చేసింది. కానీ అది నెటిజన్ల చేతికి ముందే చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊర్వశి చేసిన పనికి ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘నీ పని నువ్వు చేసుకోకుండా పక్కనవాళ్లపై పడి ఎందుకు ఏడుస్తావంటూ’ ఫ్యాన్స్ విపరీతంగా ఫైర్ అవతున్నారు. అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.
ఆ ఫ్యాన్ కామెంట్
ఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ ‘జాట్’లో ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవల తెలుగు, హిందీలో వరుసగా స్పెషల్ సాంగ్స్ తో జోరుమీదున్న ఈ హాట్ బ్యూటీ.. ‘జాట్’లోనూ ఆడిపాడింది. ‘సారీ బోల్’ అనే సాంగ్ లో అందచందాలతో కనువిందు చేసింది. మరోవైపు స్పెషల్ సాంగ్స్ లో బోల్డ్ మూవ్స్ తో కుర్రాళ్ల ను పిచ్చెక్కిస్తున్న తమన్నా భాటియా కూడా తాజాగా ‘రైడ్ 2’ మూవీ కోసం హాట్ స్టెప్స్ వేసింది. ‘నశా’ సాంగ్ లో మిల్స్ బ్యూటీ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అయితే ‘సారీ బోల్’ సాంగ్ కింద ఓ ఫ్యాన్.. ఇది నశా కంటే ఎంతో బెటర్ గా ఉంది అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశి షేర్ చేయడంతో కాంట్రవర్సీ మొదలైంది. వెంటనే దీన్ని ఊర్వశి డిలీట్ చేసినా.. అప్పటికే ఓ నెటిజన్ దీన్ని రెడ్డిట్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
ట్రోల్స్ మోత
తోటి నటి తమన్నా భాటియాను చూసి ఊర్వశి కుళ్లుకుంటుందని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఊర్వశి స్పెషల్ సాంగ్ ‘సారీ బోల్’కు 13 రోజుల్లో 2.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. అదే తమన్నా సాంగ్ ‘నశా’కు కేవలం 4 రోజుల్లోనే 2.1 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో తమన్నా సక్సెస్ ను ఊర్వశి ఓర్వలేకపోతుందనే కామెంట్లు వస్తున్నాయి.
సారీ బోల్ సాంగ్ బోరింగ్ గా ఉందని ఓ యూజర్ రాసుకొచ్చారు. మరొకరేమో ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కియారా అద్వాణీపై ఊర్వశి కామెంట్లు చేసిందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా అహంకారం (ఈగో) అని ఇంకొకరు పేర్కొన్నారు.
ఆ ప్రమోషన్లలో
ఇంతకుముందు తన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రమోషన్ సమయంలోనూ రామ్ చరణ్, కియారా నటించిన ‘గేమ్ ఛేంజర్’పై ఊర్వశి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘శంకర్ ప్రముఖ డైరెక్టర్. ఇండియన్ 2లో ఆయనతో పనిచేశా. ఎంతో హైప్ వచ్చినా కానీ ఈ గేమ్ పూర్తిగా ఛేంజ్ కాలేదు’’ అని ఆమె సెటైర్లు వేసింది.
ఆమె తన సినిమాను ‘గేమ్ ఛేంజర్’తో పోలుస్లూ “ కియారా అడ్వాణి ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్, డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ అయితే అది నా మిస్టేక్ కాదు. ఎందుకు ఈ ట్వీట్లు వస్తున్నాయని అనుకుంటా’’ అని ఊర్వశి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. వీటిపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి.
సంబంధిత కథనం