South Central Railway : ప్రయాణికులకు అలర్ట్.. 12 రైళ్లు ర‌ద్దు.. 11 దారి మ‌ళ్లింపు.. పూర్తి వివరాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

South Central Railway : ప్రయాణికులకు అలర్ట్.. 12 రైళ్లు ర‌ద్దు.. 11 దారి మ‌ళ్లింపు.. పూర్తి వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu Published Apr 15, 2025 12:27 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Published Apr 15, 2025 12:27 PM IST

South Central Railway : ప్ర‌యాణికుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వేలోని గుంత‌క‌ల్లు డివిజ‌న్ అల‌ర్ట్ ఇచ్చింది. ధ‌ర్మవ‌రం రైల్వే స్టేష‌న్‌లో అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న కారణంగా కొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. మ‌రికొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లించారు. ప్ర‌యాణికులు గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రైళ్లు రద్దు
రైళ్లు రద్దు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ధ‌ర్మ‌వ‌రం రైల్వే స్టేష‌న్ మీదుగా వెళ్లే ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను మే 19 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. అందులో కొన్ని రైళ్ల‌ను మే 16 నుంచి 18 మ‌ధ్య పున‌రుద్ధరిస్తారు. తిరుప‌తి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీదుగా వెళ్లేందుకు దారి మ‌ళ్లించిన‌ట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ముఖ్య‌మైన రైళ్లు మే 5 నుంచి 18 వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

రద్దైన రైళ్లు..

1. తిరుప‌తి-గుంత‌క‌ల్లు (57403) డీఈఎంయూ రైలును ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 18వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

2. గుంత‌క‌ల్లు-తిరుప‌తి (57404) డీఈఎంయూ రైలును ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 19వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

3. తిరుప‌తి-క‌దిరిదేవ‌ర‌ప‌ల్లి (57405) ప్యాసింజ‌ర్‌ రైలును ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

4. క‌దిరిదేవ‌ర‌ప‌ల్లి -తిరుప‌తి (57405) ప్యాసింజ‌ర్‌ రైలును ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 17వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

5. ధ‌ర్మ‌వ‌రం-బెంగ‌ళూరు (06595) ప్యాసింజ‌ర్‌ రైలును మే 5వ తేదీ నుంచి మే 17వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

6. బెంగ‌ళూరు-ధ‌ర్మవ‌రం (06596) ప్యాసింజ‌ర్‌ రైలును మే 5వ తేదీ నుంచి మే 17వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

7. గుంత‌క‌ల్లు-హిందూపురం (77213) డీఈఎంయూ రైలును మే 4వ తేదీ నుంచి మే 17వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

8. హిందూపురం-గుంత‌క‌ల్లు (77214) డీఈఎంయూ రైలును మే 5వ తేదీ నుంచి మే 18వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

9. తిరుప‌తి-అమ‌రావ‌తి (12765) ఎక్స్‌ప్రెస్ రైలును మే 6వ తేదీ నుంచి మే 17వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

10. అమ‌రావ‌తి-తిరుప‌తి (12766) ఎక్స్‌ప్రెస్ రైలును మే 5వ తేదీ నుంచి మే 15వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

11. య‌శ్వంత‌పూర్-బీద‌ర్ (16571) ఎక్స్‌ప్రెస్ రైలును మే 12వ తేదీ నుంచి మే 15వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

12. బీద‌ర్‌-య‌శ్వంత‌పూర్ (16572) ఎక్స్‌ప్రెస్ రైలును మే 12వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

దారి మ‌ళ్లించిన రైళ్లు..

1. తిరుప‌తి-అకోలా (07605) స్పెష‌ల్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

2. అకోలా-తిరుప‌తి (07606) స్పెష‌ల్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

3. సికింద్రాబాద్‌-తిరుప‌తి (12770) సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

4. తిరుప‌తి-సికింద్రాబాద్ (12769) సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

5. తిరుప‌తి-సికింద్రాబాద్ (12731) సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

6. సికింద్రాబాద్‌-తిరుప‌తి (12732) సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

7. కాచిగూడ‌-మ‌ధురై (07191) స్పెష‌ల్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

8. మ‌ధురై-కాచిగూడ (07192) స్పెష‌ల్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

9. ముంబాయి-నాగ‌ర్‌కోయిల్ (16339) ఎక్స్‌ప్రెస్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

10. నాగ‌ర్‌కోయిల్‌-ముంబాయి (16340) ఎక్స్‌ప్రెస్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

11. ముంబాయి-తిరువ‌నంత‌పురం (16331) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును మే 5వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీద‌గా దారి మ‌ళ్లించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

 

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

South Central RailwayRailwayTrainsAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024