Malayalam OTT: ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళం నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ థ్రిల్ల‌ర్ మూవీ – కేర‌ళ స్టోరీకి స్ఫూర్తి ఇదే!

Best Web Hosting Provider In India 2024

Malayalam OTT: ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళం నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ థ్రిల్ల‌ర్ మూవీ – కేర‌ళ స్టోరీకి స్ఫూర్తి ఇదే!

Nelki Naresh HT Telugu
Published Apr 15, 2025 12:29 PM IST

Malayalam OTT:మ‌ల‌యాళం నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ సింజ‌ర్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 65వ నేష‌న‌ల్ అవార్డ్స్‌లో ఈ మూవీ రెండు పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న‌ది. సింజ‌ర్ మూవీలో శ్రింద‌, మైథిలి కీల‌క పాత్ర‌లు పోషించారు.

మలయాళం ఓటీటీ
మలయాళం ఓటీటీ

Malayalam OTT:మ‌ల‌యాళం నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ సింజ‌ర్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్ చెల్లించి ఈ మూవీ అమెజాన్‌లో చూడొచ్చు.

రెండు అవార్డులు…

65వ నేష‌న‌ల్ అవార్డ్స్‌లో సింజ‌ర్ మూవీ రెండు పుర‌స్కారాల‌ను సొంతం చేసుకున్న‌ది. బెస్ట్ జాస‌రీ లాంగ్వేజ్ మూవీగా, బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డులు ద‌క్కాయి. సింజ‌ర్ మూవీలో శ్రింద‌, మైథిలి ముస్త‌ఫా కీల‌క పాత్ర‌లు పోషించారు. పాంప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

కేర‌ళ స్టోరీకి స్ఫూర్తి…

2018లో థియేట‌ర్ల‌లో రిలీజైన సింజ‌ర్‌ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. కేర‌ళ స్టోరీకి ఈ మూవీ స్ఫూర్తి అంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఉగ్ర‌వాదుల చెర‌లో అక్ర‌మంగా బంధీ అవుతోన్న భార‌తీయ మ‌హిళ‌లు ఎలాంటి వేధింపుల‌ను ఎదుర్కొంటున్నార‌నే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు పాంప‌ల్లి ఈ సినిమాను రూపొందించాడు.

జాస‌రి భాష‌లో…

మ‌ల‌యాళంతో పాటు ల‌క్ష్య‌ద్వీప్‌లో ఉప‌యోగించే జాస‌రి భాష‌ల్లో సింజ‌ర్ రిలీజైంది. ఈ సినిమాకు స‌తీష్ రామ‌చంద్ర‌న్ మ్యూజిక్ అందించాడు.

టెర్ర‌రిస్ట్‌లు కిడ్నాప్‌…

సుహార‌, ఫిదా బ‌తుకుతెరువు కోసం అర‌బ్ కంట్రీస్‌కు వ‌ల‌స‌వెళ‌తారు. అక్క‌డ వారిని ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేస్తారు. వారిని భార‌త ప్ర‌భుత్వం కాపాడి ఇండియాకు తీసుకొస్తుంది. ఫిదాకు అన్స‌ర్ అనే యువ‌కుడితో పెళ్లి కుద‌రుతుంది. కానీ పెళ్లికి ముందే ఆమె త‌ల్లి కాబోతుంది అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

దాంతో పెళ్లిని అన్స‌ర్ క్యాన్సిల్ చెస్తాడు. అన్స‌ర్ చెల్లెలు సుహార మాత్రం ఫిదాకు స‌పోర్ట్‌గా నిలుస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? ఉగ్ర‌వాదుల చెర‌లో సుహారా, ఫిదా ఎలాంటి వేధింపుల‌ను ఎదుర్కొన్నారు? వారి జీవితం చివ‌ర‌కు ఎలా ముగిసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

తెలుగులో…

సింజ‌ర్ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన శ్రింద త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన ఈ మూవీ ఇటీవ‌లే ఆహా ఓటీటీలో రిలీజైంది. మ‌ల‌యాళంలో 24 నార్త్ కాథ‌మ్‌, 1983, అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోనీ, టూ కంట్రీస్‌, షెర్లాక్ టామ్స్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది శ్రింద‌.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024