





Best Web Hosting Provider In India 2024

డయాబెటిస్ అనేది మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలి?
డయాబెటిస్ లేదా షుగర్ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసు. ఇది అక్కడితో ఆగదు, అప్పటిదాకా ఫాలో అవుతున్న ఆహారపు అలవాట్లతో పాటు మరెన్నో మారిపోతుంటాయి. ఇవి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయట. అవేంటో తెలుసుకుందామా. .

షుగర్ పేషెంట్ లేదా డయాబెటిస్ రోగి అని పిలుచుకునే ఈ సమస్య శారీరకంగా మిమ్మల్ని సగం చేస్తుంది. అంటే, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం కళ్ల కింద ఉబ్బినట్లుగా మారడం వంటివి కనిపిస్తుంటాయి. డయాబెటిస్ అనేది శరీరంలోని గ్లూకోజ్ నిల్వలను సరిగా నియంత్రించడంలో తటస్థంగా చేసే ఒక పరిస్థితి. ఈ సమస్యతో కేవలం శారీరక మార్పులే కానీ, మానసిక మార్పులు కూడా కలుగుతాయట. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించుకోకపోతే రెగ్యూలర్ పనులు చేసుకోవడం కూడా కష్టమే మరి.
డయాబెటిస్‌తో బాధపడే వారిలో కలిగే మానసిక మార్పులు ఏంటి?
1. ఆందోళన:
డయాబెటిస్ ఉన్నవారు తరచుగా ఆందోళన, ఆత్మవిశ్వాసం లోపంతో పాటు శరీరంలోని శక్తి తగ్గిపోయిన ఫీలింగ్ ఎదుర్కొంటుంటారు. దీని వల్ల వారు ఆర్థిక, సామాజిక లేదా కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది.
2. డిప్రెషన్:
డయాబెటిస్ ఉన్న వారికి ఎక్కువగా డిప్రెషన్ సమస్యలు ఎదురవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు కలిగినప్పుడు జీవితంలో ఎదుర్కొనే ప్రతి విషయాన్ని నిరాశగా ఫీలవుతుంటారు. అంతేకాకుండా, చికిత్స కోసం తీసుకునే ఇన్సులిన్ లేదా ఇతర ఔషధాల వలన శరీరంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది క్రమంగా వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.
3. ఆత్మవిశ్వాసం తగ్గడం:
డయాబెటిస్ తో మారిపోయిన జీవనశైలి కారణంగా ఏ పనినైనా అంతరాయాల్లేకుండా పూర్తి చేయలేరు. ఇంకా వారిలో దీని కారణంగా నిర్వహణా కష్టాలు, తరచుగా శక్తి కోల్పోతుండటం, ఉత్సాహం కోల్పోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోయేలా చేస్తాయి. చివరిగా మీలో పాజిటివ్ ఆలోచనలు కూడా ఆపేయవచ్చు.
డయాబెటిస్‌తో కలిగే మానసిక మార్పులను ఎలా సరి చేసుకోవాలంటే:
1. ఆత్మసంతృప్తి, ఆత్మవిశ్వాసం పెంపు:
డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నామనే విషయాన్ని అంగీకరించాలి. దానిపై కంట్రోల్ సాధించేందుకు ప్రయత్నించాలి. దీని కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వంటివి చేయడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది.
2. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం:
ఈ వ్యాధిని అదుపులో ఉంచడం అంటే కేవలం బ్లడ్ షుగర్ ని నియంత్రించడం మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, తరచుగా వ్యాయామం చేయడం కూడా మానసిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళన, మానసిక ఒత్తిడి కలిగేలా చేస్తుంది.
3. మానసిక ఆందోళన నియంత్రణ:
ధ్యానం, యోగా, విశ్రాంతి, నిద్ర వంటి చర్యల కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి ఆందోళన, ఒత్తిడి, గోప్యమైన ఆలోచనలను తగ్గిస్తాయి.
4. సమాజంలో భాగస్వామ్యం:
ఫ్యామిలీ, స్నేహితులు, పరిచయస్థులతో కలసి సమయం గడపడం వంటివి చేస్తుండాలి. వీటితో పాటుగా మీకిష్టమైన గార్డెనింగ్, బుక్స్ చదవడం వంటివి చేస్తుండాలి.
5. వైద్యుల నుండి సహాయం తీసుకోవడం:
మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమైనపుడు, సరైన వైద్య నిపుణుల సాయం తీసుకోవడం చాలా ముఖ్యం. సైకోథెరపీ, కౌన్సిలింగ్, లేదా సమయానికి మందులు తీసుకోవడం మీకు మానసిక ప్రశాంతత కలిగేందుకు దోహదపడుతుంది.
డయాబెటిస్ వ్యాధి ఉందని తెలుసుకుని ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.
సంబంధిత కథనం
టాపిక్