



Best Web Hosting Provider In India 2024
Hyderabad : విప్లవాత్మక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణపై దేశంలో చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ : పొన్నం
Hyderabad : ఎస్సీ వర్గీకరణపై దేశంలోనే చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇది విప్లవాత్మక నిర్ణయం అని చెప్పారు. శంషాబాద్ నోవాటెల్ వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపిందని.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఇందుకోసం సబ్ కమిటీ, డెడికేటెడ్ కమిటీ వేసుకొని కేబినెట్ తీర్మానం చేసినట్టు చెప్పారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ.. రెండు వేరువేరు బిల్లులు చట్టం చేసినట్టు వివరించారు.
త్వరలో మేధావులతో సమావేశం..
‘తెలంగాణ బీసీల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు. వారం రోజుల్లో బీసీ మేధావులు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకొని.. భవిషత్ కార్యాచరణ రూపొందిస్తాం. శాసన సభలో బీజేపీ, బీఆర్ఎస్ ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్లు పెంచే తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా కుల సర్వే రోల్ మోడల్‌గా నిలిచింది. దీన్ని అమలు చేయడానికి ప్రక్రియ వేగవంతం చేస్తాం’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఎలాంటి చిక్కులు లేవు..
‘శాసన సభలో మద్దతు ఇచ్చినట్టు.. ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు మాకు సానుకూలంగా ఉంది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది. పారదర్శకంగా చేసిన సర్వేపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు. ఎస్సీ వర్గీకరణ దేశంలోనే చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇది విప్లవాత్మక నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల ముందుకు తీసుకుపోతాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఏ ప్రభుత్వం ఇన్ని చేయలేదు..
‘సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న వడ్లకి బోనస్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి రవాణా రంగంలో బిజినెస్ మెన్ అనుకున్న. ప్రభాకర్ రెడ్డి జ్యోతిష్యం చదివినట్టు తెలియదు. మాపై ప్రజలు విశ్వాసం ఉంచారు. మా ప్రభుత్వం కూలిపోవాలని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలి’ అని పొన్నం డిమాండ్ చేశారు.
చూస్తూ ఊరుకోబోం..
’16 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంటే.. కాళ్లల్ల కట్టెలు పెట్టి అడ్డుపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామిక వేత్తల దగ్గర పైసలు తెచ్చుకోవడం కొత్త కాదు. అక్కడ పైసలు తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు’ అని ప్రభాకర్ హెచ్చరించారు.
సంబంధిత కథనం
టాపిక్