






Best Web Hosting Provider In India 2024

Bold Telugu OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ -పెళ్లికాకుండానే తల్లయితే -ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్
Bold Telugu OTT: తెలుగు మూవీ బిఫోర్ మ్యారేజ్ థియేటర్లలో రిలీజైన 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. నవీనరెడ్డి, భరత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీత మనోహర్, సుప్రియ కీలక పాత్రలు పోషించారు.

Bold Telugu OTT: తెలుగు రొమాంటిక్ మూవీ బిఫోర్ మ్యారేజ్ థియేటర్లలో రిలీజైన పధ్నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. బిఫోర్ మ్యారేజ్ మూవీలో నవీనరెడ్డి, భరత్ హీరోహీరోయిన్లుగా నటించారు. నాగమహేష్, సునీత మనోహర్, సుప్రియ కీలక పాత్రల్లో నటించారు.
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్…
బిఫోర్ మ్యారేజ్ మూవీకి శ్రీధర్ రెడ్డి అటుకుల దర్శకత్వం వహించాడు. గత ఏడాది జనవరిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. తొందరపాటు యువత వేసే తప్పటడుగులు వారి జీవితాన్ని ఎలా తలక్రిందులు చేస్తాయనే మెసేజ్‌ను ఈ మూవీలో చూపించారు.
ఐఎమ్‌డీబీలో…
ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు పెద్దపల్లి రోహిత్ మ్యూజిక్ అందించాడు. కమర్షియల్‌గా మాత్రం ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్…
ధరణి ఇంజినీరింగ్ చదవడానికి పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. శాంతి, ప్రశాంతిలతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటుంది. సిటీ కల్చర్‌కు ఆకర్షితురాలైన ముగ్గురు స్నేహితురాళ్లు పెడదారులు పడతారు. పెళ్లి కాకుండానే ధరణి ప్రెగ్నెంట్ అవుతుంది.అదే టైమ్‌లో ప్రియుడు మొహం చాటేస్తాడు.
తండ్రి శ్రీనన్న నమ్మకాన్ని వమ్ము చేసిన ధరణి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ధరణి బాధను ఆమె తండ్రి శ్రీనన్న అర్థం చేసుకున్నాడా? ధరణి జీవితంలోకి వచ్చిన సరోజమ్మ, డాక్టర్ బాబు ఎవరు? ధరణిని ప్రేమించిన ఆకాష్ ఆమెకు ఎందుకు దూరమయ్యాడు అన్నదే ఈ మూవీ కథ. యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు బిఫోర్ మ్యారేజ్ మూవీని తెరకెక్కించాడు.
ఉప్పెన, హిట్…
నవీన రెడ్డి హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో పలు సినిమాలు చేసింది. హిట్, ఉప్పెన, అతిథి దేవోభవ, కస్టడీ, రుద్రాంగితో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. బీఫోర్ మ్యారేజ్ మూవీతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నవీన రెడ్డి అచ్చ తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.
సంబంధిత కథనం