Indiramma Indlu Cheques: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తొలి విడతగా లక్ష రూపాయలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

Indiramma Indlu Cheques: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తొలి విడతగా లక్ష రూపాయలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu Published Apr 15, 2025 03:22 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Apr 15, 2025 03:22 PM IST

Indiramma Indlu Cheques : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం తొలి విడతలో భాగంగా లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఎంపిక చేసిన 12 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తొలి విడతగా లక్ష రూపాయలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తొలి విడతగా లక్ష రూపాయలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Indiramma Indlu Cheques : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తొలి అడుగు వేసింది. ఈ పథకం తొలిదశలో భాగంగా అత్యంత నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ షురూ చేశారు. మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల విలువైన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. మంగళవాం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

12 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేత

తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారికి తొలిదశ చెక్కులు అందించారు. ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి, మరికొందరికి లక్ష రూపాయల చెక్కులను అందించారు. నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు -సీఎం వార్నింగ్

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఎవరైనా పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలను సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని గుర్తుచేశారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsIndiramma Housing SchemeCm Revanth ReddyHyderabadTg Welfare SchemesTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024