





Best Web Hosting Provider In India 2024

ఎన్ఓసీ తీసుకున్నాం.. పర్మిషన్స్ ఉన్నాయి.. ఇళయరాజా లీగల్ నోటీసులపై నిర్మాతల కౌంటర్
పర్మిషన్ లేకుండా మూవీలో తన పాటలు వాడటంతో ఇళయరాజా మరో మూవీ ప్రోడ్యూసర్స్ కు లీగల్ నోటీసులు పంపించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్ఓసీ తీసుకున్నామని, పర్మిషన్స్ ఉన్నాయిన ఆ తమిళ మూవీ ప్రోడ్యూసర్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ సినిమా అజిత్ యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.
అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన తమిళ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర నిర్మాతలకు సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నందుకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా క్షమాపణ కూడా చెప్పాలన్నారు. అయితే దీనిపై గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రోడ్యూసర్స్ స్పందించారు. పాటలు వాడుకునేందుకు ఎన్ఓసీ తీసుకున్నామని స్పష్టం చేశారు.
ప్రోటోకాల్ పాటించాం
మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని నిర్మించింది. తాజాగా ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసులపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించడంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని హిందూస్థాన్ టైమ్స్ తో తెలిపారు. రూల్స్ ప్రకారమే నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకున్నామన్నారు.
”సినిమాలో వాడిన పాటలకు అవసరమైన అన్ని పర్మిషన్స్ ను మ్యూజిక్ లేబుల్స్ నుంచి తీసుకున్నాం. ఆ హక్కులన్నీ లేబుల్స్ కే ఉంటాయి. కాబట్టి మేము ప్రోటోకాల్ పాటించాం. వాటి నుంచి ఎన్ఓసీలు తీసుకున్నాం. రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం’’ అని రవిశంకర్ చెప్పారు.
ఆ మూడు పాటలు
అజిత్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇటీవల రిలీజైంది. ఈ మూవీలో ఇళయరాజా కంపోజ్ చేసిన మూడు పాటలున్నాయి. ఈ మూడు సాంగ్స్ మూవీలో కాసేపు ప్లే అవుతాయి.
నట్టుపురా పట్టు మూవీలోని ‘ఓతా రూబైయుమ్ తారే’, విక్రమ్ సినిమాలోని ‘ఇన్ జోడీ మంజల్ కురివి’, సకల కళా వల్లవన్ చిత్రం నుంచి ‘ఇలమై ఇదో ఇదో’ పాటలను ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ ఫిల్మ్ లో వాడారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సాంగ్స్ ఎలా వాడుతారంటూ ప్రశ్నించిన ఇళయరాజా.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపించారు.
ఆ మూవీకి కూడా
మేకర్స్ నుంచి రాతపూర్వక క్షమాపణ కూడా కావాలన్నారు ఇళయరాజా. అలాగే ఆ మూవీ నుంచి వెంటనే ఈ పాటలను తొలగించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను కంపోజ్ చేసిన సాంగ్స్ ను విచ్చలవిడిగా వాడటాన్ని ఒప్పుకోని ఇళయరాజా ఇలాగే లీగల్ నోటీసులు పంపిస్తుంటారు. గతేడాది మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా మేకర్లకూ నోటీసులు పంపించారు. కూలీ మేకర్స్ కూ నోటీసులు సెండ్ చేశారు.
కలెక్షన్స్ ఇలా
అజిత్ కుమార్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.171.50 కోట్లు రాబట్టింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది.
సంబంధిత కథనం