Khushbu Sundar: నీ పేరెంట్స్‌ను చూస్తే జాలేస్తోంది.. నీలాంటి వాళ్లు ముఖాలు ఎప్పుడూ చూపించరు: అభిమానిపై విరుచుకుపడిన నటి

Best Web Hosting Provider In India 2024

Khushbu Sundar: నీ పేరెంట్స్‌ను చూస్తే జాలేస్తోంది.. నీలాంటి వాళ్లు ముఖాలు ఎప్పుడూ చూపించరు: అభిమానిపై విరుచుకుపడిన నటి

Hari Prasad S HT Telugu

Khushbu Sundar: నటి ఖుష్బూ సుందర్ స్లిమ్‌గా కనిపిస్తున్న ఫొటోలపై ట్రోలింగ్ మొదలైంది. అయితే వీటిపై ఆమె కూడా చాలా ఘాటుగా స్పందించింది. నీ పేరెంట్స్ ను చూస్తే జాలేస్తోందంటూ ఓ అభిమానికి ఎడాపెడా ఇచ్చేసింది.

నీ పేరెంట్స్‌ను చూస్తే జాలేస్తోంది.. నీలాంటి వాళ్లు ముఖాలు ఎప్పుడూ చూపించరు: అభిమానిపై విరుచుకుపడిన నటి

Khushbu Sundar: పైన ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా? ఆమె ఓ రాజకీయ నేత కూడా. ఈమె పేరు ఖుష్బూ సుందర్. ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలను ఊపేసిన నటి. ఆమె బరువు తగ్గి ఇలా స్లిమ్ గా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలపై ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఆమె సహనం కోల్పోయింది.

ఖుష్బూ సుందర్ స్లిమ్ లుక్

ఖుష్బూ సుందర్ అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు ఇలాగే బరువు తగ్గి స్లిమ్ గా మారుతున్న విషయం తెలుసు కదా. అలాగే ఖుష్బూ కూడా తన ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది.

“బ్యాక్ టు ద ఫ్యూచర్” అనే క్యాప్షన్ తో తాను గ్రీన్ డ్రెస్ లో ఉన్న రెండు ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఖుష్బూ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో ఈ ఫొటోలను చూస్తే స్పష్టమవుతోంది.

ట్రోలింగ్‌పై స్ట్రాంగ్ రిప్లై

ఈ ఫొటోలను చూసి చాలా మంది పాజిటివ్ కామెంట్సే చేశారు. బొద్దుగా ఉండే ఆమె సడెన్ గా ఇలా స్లిమ్ గా మారడాన్ని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం ఇలా బరువు తగ్గడానికి ఇంజెక్షన్లే కారణమంటూ కామెంట్స్ చేశారు. అలాంటి ఓ వ్యక్తికి ఖుష్బూ కూడా ఎడాపెడా ఇచ్చేసింది.

“మౌంజారో ఇంజెక్షన్ మ్యాజిక్ ఇది. ఈ విషయం మీ ఫాలోవర్లకు కూడా తెలిసి వాళ్లు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకోవాలనే కదా” అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇది చూసి ఖుష్బూ సహనం కోల్పోయింది.

“అసలు మీరు ఎలాంటి వ్యక్తులు? మీరెప్పుడూ మీ ముఖాలను చూపించరు. ఎందుకంటే మీ లోపల అంత మురికే. నీ పేరెంట్స్ ను చూస్తే జాలేస్తోంది” అని ఖుష్బూ రీట్వీట్ చేసింది.

వెయిట్ లాస్ సెలబ్రిటీలు

సెలబ్రిటీలు బరువు తగ్గి ఇలా స్లిమ్ కనిపించడం ఈ మధ్య కామనైపోయింది. వాళ్లను చూసిన అభిమానులు షాక్ తింటున్నారు. అసలు వీళ్లు ఎలా ఇంతలా బరువు తగ్గుతున్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఖుష్బూ కంటే ముందు బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహార్, రామ్ కపూర్, కపిల్ శర్మలాంటి వాళ్లు కూడా చాలా బరువు తగ్గి స్లిమ్ గా కనిపించారు. వాళ్లపైనా ఇలా ఇంజెక్షన్ ఆరోపణలే రాగా.. వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇక ఖుష్బూ విషయానికి వస్తే ఆమె ఈ మధ్యే వచ్చిన తమిళ సినిమా నేసిప్పాయలో నటించింది. అంతేకాదు టీవీ సీరియల్ సరోజినిలోనూ కనిపించింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024