






Best Web Hosting Provider In India 2024

Malayalam Movie: ఈ మలయాళ మూవీ రీమేక్‍కు సరైన యాక్టర్లు దొరకలేదట.. డ్రాప్ అయిన ఆమిర్ ఖాన్! ఈ చిత్రం ఏ ఓటీటీలో ఉందంటే..
Malayalam Movie: ఓ మలయాళ సినిమా తెగ నచ్చేసి హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. అయితే, ఈ రీమేక్ చేసేందుకు సూటయ్యే నటీనటులు బాలీవుడ్‍లో దొరకలేదట. ఆ డీటైల్స్ ఇవే..

మలయాళ బ్లాక్ కామెడీ మూవీ ‘జయ జయ జయ జయ హే’ చిత్రం భారీ హిట్ సాధించింది. లోబడ్జెట్‍తో వచ్చిన ఈ మూవీ ప్రశంసలను దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ కొట్టింది. బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2022 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా తనకు బాగా నచ్చడంతో హిందీలో రీమేక్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అనుకున్నారు. రీమేక్‍ను ప్రొడ్యూజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారట.
కారణం ఇదే..
జయ జయ జయ జయ హే హిందీ రీమేక్ ఎందుకు పట్టాలెక్కలేదో నటుడు అజీజ్ నెడుమంగద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రంలోని సపోర్టింగ్ పాత్రలకు సూటయ్యే నటీనటులు హిందీలో దొరకలేదని, అందుకే ఈ రీమేక్ నుంచి ఆమిర్ ఖాన్ డ్రాప్ అయ్యారని వెల్లడించారు.
హిందీ వెర్షన్‍కు కూడా మలయాళంలో నటించిన కొందరిని తీసుకుందామనుకున్నా అది కూడా జరగలేదని అజీజ్ అన్నారు. “ఏ పాత్రలను ఎవరు పోషిస్తే బాగుంటుందనే చర్చలు జరిగాయి. ఆ సపోర్టింగ్ పాత్రలకు సరైన న్యాయం చేయగల బాలీవుడ్ నటీనటులను గుర్తించలేకపోయారు. మలయాళం వెర్షన్‍లో నటించిన కొందరిని హిందీ కోసం కూడా తీసుకోవాలని ఓ దశలో అనుకున్నారు. మొత్తంగా నటీనటులు ఎంపిక జరగపోవటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యారు” అని అజీజ్ వివరించారు.
సుమారు రూ.6కోట్ల బడ్జెట్‍తో జయ జయ జయ జయ హే మూవీ రూపొందగా.. రూ.40కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. భారీ హిట్ సాధించింది. ఈ మూవీని ఐకాన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకం నిర్మించింది.
ఓటీటీలో ఎక్కడంటే..
‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. తన హక్కులు, స్వేచ్ఛ కోసం భర్తకు భార్య ఎదురుతిరగడమే ఈ మూవీ కథాంశం. ఈ సినిమా జియో హాట్‍స్టార్ (డిస్నీ+ హాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళంలోనూ స్ట్రీమ్ అవుతోంది.
తెలుగులో రీమేక్
జయ జయ జయ జయ హే చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. బాసిల్ జోసెఫ్ చేసిన పాత్రను తెలుగులో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్‍ను మేకర్స్ వెల్లడించలేదు.
సంబంధిత కథనం