





Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 16th Episode: అపర్ణను అమ్మా అని పిలిచిన రాజ్- కలుసుకున్న తల్లీకొడుకులు- రుద్రాణికి చివాట్లు!
Brahmamudi Serial April 16th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 16 ఎపిసోడ్‌లో రాజ్‌కు కావ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తుంది. దాంతో యామిని డౌట్ పడుతుంది. అపర్ణ మాములు మనిషి కావడంతో అంతా సంతోషిస్తే రుద్రాణి సెటైర్లు వేస్తుంది. ఇంటిల్లిపాది రుద్రాణికి చివాట్లు పెడతారు. గుడిలో అపర్ణను రాజ్ అమ్మా అని పిలుస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో షర్ట్‌పై ఆర్ అనే లెటర్ ఎందుకు రాసిందో కావ్య ఎమోషనల్‌గా చెబుతుంది. అది మీకు జ్ఞాపకంగా మీ గుండెలకు దగ్గరిగా ఉండి గుర్తు చేస్తే మీరు నా దగ్గరికి వచ్చే అవకాశం ఉందిగా అని కావ్య అంటుంది. ఎంతలా ప్రేమించావో ఇప్పుడే అర్థమవుతోంది కళావతి. నేను నీకు ఎంత దూరం వెళ్లిన సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి అని రాజ్ అంటాడు.
వెతుక్కుంటూ వస్తాను
నీకు మాటిస్తున్నాను. నీకు దూరమయ్యాయనే బాధ నీకు ఎప్పుడు కలగనివ్వను. ఒకవేళ నీకు దూరమయినా నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఏదో ఒక రోజు నీకంటే ఎక్కువగా నేనే ప్రేమించాను అనేలా చేస్తాను అని రాజ్ అంటాడు. దాంతో రాజ్‌ను కావ్య ప్రేమగా హగ్ చేసుకుంటుంది. అక్కడితో కావ్య కల అయిపోతుంది. రాజ్ షర్ట్‌ను హగ్ చేసుకుని చూస్తుంది. మీరు చెప్పిన పరిస్థితులు వచ్చాయండి. మీకు తెలియకుండానే నాకు దూరంగా ఉంటున్నారు. మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది అని కావ్య అంటుంది.
ఈ జ్ఞాపకాన్ని తిరిగి మీ దగ్గరికే పంపిస్తున్నాను. ఇది ఆధారం చేసుకుని మీ గుండె లోతుల్లో ఉన్న నా జ్ఞాపకాలను బయటకు తీసి నా దగ్గరకు వచ్చేయండి. రేపు గుడికి మీరు ఇదే షర్ట్ వేసుకుని రావాలి అని కావ్య అంటుంది. అన్నదానం పనులు ఉన్నాయి. ఇది కొరియర్ చేసి వచ్చేవరకు చాలా లేట్ అవుతుంది. అప్పుకు ఇచ్చి పంపిద్దాం అని కావ్య అనుకుంటుంది. మరోవైపు అన్నదానం కార్యక్రమంతో కళావతితో మాట్లాడే అవకాశం బాగా దొరికింది. దీన్ని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎలా అని రాజ్ అనుకుంటాడు.
ఇంతలో కావ్య రాజ్‌కు కాల్ చేయగానే నేనే చేద్దామనుకున్నాను. అన్నదానం పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవాలి కదా అని రాజ్ అంటే.. నేను చూసుకుంటాను కదా. ఆ మాత్రం నమ్మకం లేదా అని కావ్య అంటుంది. డిక్షనరీలో నమ్మకం తీసేసి కళావతి పేరు పెట్టాలి. అంతలా నమ్ముతున్నాను అని రాజ్ అంటాడు. ఇప్పుడు మీకు సర్‌ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పడానికి కాల్ చేశాను. మీకు ఓ కొరియర్ వస్తుంది. అది చూడండి అని కావ్య చెబుతుంది.
భయపడిన రామ్
మళ్లీ కొరియర్ ఆ.. ఈసారి టిఫిన్ తెచ్చినప్పుడే యామిని పెద్ద గొడవ చేసింది. ఈసారి ఏమవుతుందో ఏమో అని మనసులో భయపడతాడు రాజ్. ఇంతలో కొరియర్ అని డెలీవరీ బాయ్ వస్తాడు. అమ్మో యామిని కిందే ఉంది. తను వెళ్లి కొరియర్ తీసుకుంటే, కళావతి పేరు చెబితే మళ్లీ గొడవలు అవుతాయ్ అని పరుగెత్తుకుంటూ కిందకు వస్తాడు రామ్. ఎవరికీ వచ్చిందని యామిని అడిగితే.. నాకోసమే వచ్చింది. నేనే బుక్ చేశాను అని రామ్ అంటాడు.
ఏంటది అని యామిని అడిగితే.. సర్‌ప్రైజ్. నాకోసమే బుక్ చేసుకున్నాను అని రామ్ అంటే.. నీకు నువ్వే సర్‌ప్రైజ్ ఇచ్చుకోడానికి బుక్ చేశావా అని యామిని అంటుంది. సర్‌ప్రైజ్ అయ్యావుగా. అందుకే చేశాను అని కొరియర్ పట్టుకుని వెళ్లిపోతాడు రామ్. రోజు రోజుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ కొరియర్ రామ్ బుక్ చేశాడా. లేకుంటే ఇంకెవరైన బుక్ చేస్తే నా దగ్గర దాస్తున్నాడా అని యామిని డౌట్ పడుతుంది. మరోవైపు రాజ్ వెళ్లి కొరియర్ ఓపెన్ చేసి చూస్తాడు.
అందులో వైట్ షర్ట్‌పై ఆర్ లెటర్ ఉండడం చూసి సంతోషిస్తాడు. వావ్ అని మురిసిపోతాడు రాజ్. కావ్యకు కాల్ చేస్తాడు. గిఫ్ట్ అందిందా.. ఎలా ఉందని అడుగుతుంది కావ్య. అద్భుతంగా ఉందని రాజ్ అంటాడు. అది చూస్తే ఏమైనా గుర్తు వచ్చిందా అని కావ్య అడిగితే.. వచ్చింది.. నాపై మీకున్న చూపించే అభిమానం తెలిసింది. నాకోసం మీరు ఎంత కష్టపడ్డారో కనిపించింది అని రాజ్ అంటాడు. ఇంకేం గుర్తు రాలేదా అని కావ్య అడిగితే.. ఇంకేం గుర్తు రావాలండి అని రాజ్ అంటాడు.
నిరాశపడిన కావ్య
ఏం లేదు. మీకు నచ్చిందా లేదా అని. ఆర్ అంటే అర్థమైందా అని కావ్య అడుగుతుంది. ఆర్ అంటే రామ్ అనే కదా. చాలా థ్యాంక్స్. నాకోసం ఇంత కష్టపడి ఎందుకు పంపించారు అని రాజ్ అంటాడు. రేపు గుడికి ట్రెడిషనల్‌గా వస్తే బాగుంటుందని కావ్య అంటే.. రేపు గుడికి ఇదే షర్ట్ వేసుకుని వస్తాను అని రాజ్ అంటాడు. కాల్ కట్ చేసిన తర్వాత నా జ్ఞాపకం మీ గతాన్ని గుర్తు చేస్తుందనుకున్నాను. పోనిలెండి కనీసం నా చేత్తో కుట్టిన జ్ఞాపకాన్ని మీరు గుడికి వేసుకొచ్చేలా చేయగలిగాను అని కావ్య నిరాశపడి సంతృప్తి చెందుతుంది.
మరుసటి రోజు ఉదయం అన్నదానం కోసం క్యారేజ్‌లను డ్రైవర్‌తో పంపిస్తుంటుంది కావ్య. ఏంటీది పొద్దుపొద్దునే ఇన్ని క్యారేజీలు పంపిస్తుంది. దీని బాబుగాడి సొమ్ము అయినట్లు చేస్తుంది అని రుద్రాణి రాహుల్‌తో అంటుంది. శ్రీవారు ఇంకా బతికే ఉన్నారని భ్రమపడుతున్న శ్రీమతి గారు ఏదో కార్యం తలపెట్టారేంటీ అని రుద్రాణి అడిగితే.. శుభకార్యమే లెండి అని కావ్య అంటుంది. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యమా అని రుద్రాణి అంటుంది.
తర్వాత కావ్య పంచ్‌లు వేస్తుంది. ఇంతలో అపర్ణ వచ్చి అన్ని సర్దేశావా అని హడావిడి చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అని కావ్య చెబుతుంది. అపర్ణ మాటలు చూసి ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు. ఈవిడ నిన్నటివరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పేషంట్‌లా కనిపించింది. ఇవాళ ఏంటీ మనిషిలో ఉత్సాహం, మాటల్లో ఉల్లాసం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని రుద్రాణి అంటుంది.
మళ్లీ పుట్టినట్లు
కావ్య ఏం చెప్పి ఒప్పించిందో కానీ ఆంటీ ఒక్కపూటలో మొత్తం మారిపోయారు కదా అని స్వప్న అంటుంది. కావ్య పూనుకున్నాక కానిపని ఉంటుందా అని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ తన పుట్టినరోజు నాడే మళ్లీ పుట్టినట్లు అనిపిస్తుంది. తన మొహం వెలిగిపోతుంటే ఇంటికే వెలుగొచ్చినట్లుంది అని సుభాష్ అంటాడు. హ్యాపీ బర్త్ డే అని సుభాష్ చెబుతాడు. తర్వాత అంతా చెబుతారు. రాలిపోతుందేమో అనుకున్న పువ్వు రాగాలు పలుకుతున్నట్లు వదిన గారేంటీ చాలా హుషారుగా ఉన్నారు అని రుద్రాణి అంటుంది.
పువ్వులు రాలిపోవాలి, కొమ్మలు కూలిపోవాలి అనుకునేవారికి ఎలా నచ్చుతాయి అని స్వప్న అంటుంది. బాధలో కూడా బర్త్‌డేలు చేసుకుంటారని మా మమ్మీకి తెలియదులే అని రాహుల్ అంటాడు. ఈ ఇంట్లో జరగరానిది జరిగితే చాలా బాధపడేది మీ మమ్మీనేగా అని స్వప్న కౌంటర్ వేస్తుంది. నువ్వేంటీ వదినా ఇలా మారిపోయావ్. కొడుకే లేడు. వాడు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నావ్. ఇప్పుడేంటీ ఇంత అందంగా రెడీ అయి ఏదో నీ కొడుకే అన్నదానం జరిపిస్తున్నాడన్నట్లుగా ఆ రేంజ్‌లో వెళ్తున్నావేంటీ అని రుద్రాణి అడుగుతుంది.
అక్కడ నా అన్నదానం చేయించేది నా కొడుకే కదా అని అపర్ణ అనడంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. ఇలా చెప్పారేంటీ అని కావ్య అనుకుంటుంది. అక్క ఏంటీ ఇలా అనేసింది. రాజ్ ఎక్కడి నుంచి వస్తాడు అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. రాజ్ జరిపించడం ఏంటని సుభాష్ అడుగుతాడు. నా కొడుకు స్థానంలో కోడలు ఉండి జరిపిస్తుంది. అంటే రాజ్ అన్నదానం జరిపిస్తున్నట్లేగా. నా కోడలులో నా కొడుకుని చూసుకోవడంలో తప్పేముంది అని అపర్ణ అంటుంది.
ఎన్నో ఘోరాలు చూడాలో
ఒక్కసారి రాజ్ బతికే ఉన్నాడన్న ఆశ కలిగిందని ఇందిరాదేవి అంటుంది. నేను కూడా రాజ్ బతికే ఉన్నాడా. ఆస్తి మనకు ఇంకా రాదా అని ఒక్కసారి షాక్ అయ్యాను. కానీ, అందరిలా ఈ ముసలాయన లాగా చచ్చి బతికే అవకాశం ఎందుకు ఉంటుంది అని రుద్రాణి అంటుంది. నీలో బాధను పోగొట్టి కావ్య నిన్ను మాములు మనిషిని చేసింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. వదినకు ఏదో అయింది. కావ్య ఒక్కతే పిచ్చిది అనుకున్నాను. నిన్ను కూడా పిచ్చిదాన్ని చేసిందా. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అని రుద్రాణి అంటుంది.
సుభాష్ ఫైర్ అవుతాడు. నిజాల్లో బతకమంటున్నాను అని రుద్రాణి అంటుంది. ఏది నిజమో కాదో తెలుసుకోలేనంత చిన్నపిల్లను కాదు. ఇంకోసారి కావ్యకు పిచ్చిపట్టిందంటే అస్సలు ఊరుకోను అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. మద్యానం, ధూమపానమే కాదు దూరాలోచన కూడా ప్రమాదమే అని సలహా ఇస్తుంది కావ్య. రుద్రాణి, కావ్య గుడికి వెళ్తారు. ధాన్యలక్ష్మీపై రాజ్ గురించి సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఇన్నాళ్లు బాధపడినట్లు బాగా నటించావ్. ఇప్పుడు అపర్ణ సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నావా అని ఇందిరాదేవి చివాట్లు పెడుతుంది.
అపర్ణ కనీసం ఇలాగైనా సంతోషంగా ఉంది కదా. ఇప్పుడు దాన్ని కూడా చెడగొట్టాలనుకుంటున్నావా అని తిడుతుంది ఇందిరాదేవి. దాంతో ప్రకాషం, సుభాష్ తిడతారు. మంచి జరిగితే చూసి తట్టుకోలేనంతగా దిగజారావ్. పద్ధతి మార్చుకో అని సుభాష్ వెళ్లిపోతాడు. నిజాలు మాట్లాడుతుంటే మాత్రం తప్పు చేస్తున్నట్లు నీతులు చెబుతున్నారు అని రుద్రాణి అంటే.. మీరు నీతుల గురించి మాట్లాడితే వినడానికి బూతుల్లా ఉంటాయి అత్తయ్య అని కౌంటర్ వేస్తుంది స్వప్న.
నోరు అదుపులో పెట్టుకోవాలి
ఇంతలో పై నుంచి అప్పు వస్తుంది. ఏంటీ పొట్టి పోలీస్ టింగురంగా అంటూ అని ఎక్కడికి వెళ్తున్నావ్ అని రుద్రాణి అంటుంది. ముందు వెళ్లారుగా తిక్కల బ్యాచ్ వాళ్లకు సెక్యూరిటీ అనుకుంటా అని రాహుల్ అంటాడు. దాంతో అప్పు కోపంగా చూడటంతో భయపడతాడు రాహుల్. కంటి చూపుకే భయపడే వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి అని స్వప్న అంటుంది. ఫ్యామిలీని మోసం చేస్తున్నావాళ్లను పట్టుకునేందుకు వెళ్తున్నాను అని అప్పు అంటే.. అందులో మన జాతి రత్నాలు లేరా అని స్వప్న అంటుంది.
ఏంటే అంటున్నావ్ అని రుద్రాణి అంటే.. గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు తడుముకుంటున్నారు చూడు అని వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు గుడిలో కారులో నుంచి దిగి రాజ్ వస్తాడు. రాజ్‌ను చూసి అపర్ణ సంబరపడిపోతుంది. నా కొడుక్కి ఏం కాలేదు అని రాజ్‌కు ఎదురుగా వెళ్తుంది అపర్ణ. రాజ్‌కు ఎదురుపడి అపర్ణ చాలా సంతోషిస్తుంది. ఇంతలోనే అమ్మా అని రాజ్ పిలుస్తాడు.
కలుసుకున్న అపర్ణ, రాజ్
దాంతో అపర్ణ ఆశ్చర్యంతో ఆగిపోతుంది. అదంతా చూస్తున్న కావ్య షాక్ అవుతుంది. అత్తయ్య గారిని గుర్తుపట్టేశారా అని కావ్య అనుకుంటుంది. అపర్ణ దగ్గరికి వెళ్తాడు రాజ్. అపర్ణ, రాజ్ ఇద్దరు కలుసుకుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం