





Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy: ఓటీటీలో అదరగొడుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. ట్రెండింగ్‍లో టాప్.. బ్రేకప్ తర్వాత బిగ్ ట్విస్ట్!
OTT Romantic Comedy: స్వీట్‍హార్ట్ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. తెలుగులోనూ మంచి వ్యూస్ సాధిస్తోంది.
స్వీట్‍హార్ట్ సినిమాలో రియో రాజ్, గోపికా రమేశ్ హీరోహీయిన్లుగా నటించారు. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీని పాపులర్ మ్యూజిక్ డైెరెక్టర్ యువన్ శంకర్ రాజా ప్రొడ్యూజ్ చేశారు. ఇలాంగో రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 14వ తేదీన రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం స్వీట్‍హార్ట్ అదరగొడుతోంది. మంచి వ్యూస్ సాధిస్తోంది.
ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు..
స్వీట్‍హార్ట్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు చేరింది. తమిళంతో పాటు తెలుగు కేటగిరీల్లో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ గత శుక్రవారం (ఏప్రిల్ 11) జియోహాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమ్ అవుతోంది.
స్వీట్‍హార్ట్ చిత్రానికి జియోహాట్‍స్టార్ ఓటీటీలో వ్యూస్ బాగా దక్కుతున్నాయి. దీంతో ప్రస్తుతం (ఏప్రిల్ 16) ఈ చిత్రం ఆ ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు చేరింది. ఎంతకాలం ట్రెండింగ్‍లో జోరు కొనసాగిస్తుందో చూడాలి. స్ట్రీమింగ్ తర్వాత కూడా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్ వస్తోంది.
కథలో బిగ్ ట్విస్ట్
లవ్‍స్టోరీ, కామెడీతో స్వీట్‍హార్ట్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ ఎలాంగో. ఇద్దరు లవర్స్ శారీరంగా కలిశాక విభేదాలు వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే, తాను ప్రెగ్నెంట్ అయ్యానని ఆ అమ్మాయికి బ్రేకప్ తర్వాత తెలియడంతో బిగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీలో రియో రాజ్, గోపికతో పాటు రెడిన్ కింగ్‍స్లే, రెంజీ పనికర్, తులసి, అరుణాచల్వేశరన్, కవిత కీలకపాత్రలు పోషించారు.
స్వీట్‍హార్ట్ సినిమా కమర్షియల్‍గా ప్లాఫ్ అయింది. ఈ చిత్రానికి సుమారు రూ.5కోట్ల బడ్జెట్ అయింది. కానీ సుమారు రూ.1.2కోట్ల కలెక్షన్లనే దక్కించుకుంది. వైఎస్ఆర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ మూవీని నిర్మించిన యువన్ శంకర్ రాజా.. సంగీతం కూడా అందించారు.
స్వీట్‍హార్ట్ స్టోరీ ఇలా..
వాసు (రియో రాజ్), మనూ (గోపికా రమేశ్) ప్రేమలో పడతారు. హ్యాపీగా రిలేషన్ కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ రోజు ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. వీరు బెడ్‍పై ఉండగా మనూ కుటుంబ సభ్యులు చూస్తారు. దీంతో మనూపై కోప్పడతారు. విభేదాల వల్ల వాసు, మనూ కూడా బ్రేకప్ చెప్పేసుకుంటారు. అయితే, తాను ప్రెగ్నెంట్ అయ్యానని మనూకు కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. ఈ విషయాన్ని వాసుకు కాల్ చేసి చెబుతుంది. తాను ఇంటి నుంచి బయటికి రాలేనని, ఏం చేద్దామని అడుగుతుంది. ఆ తర్వాత వాసు ఏం చేశాడు? వీళ్ల రిలేషన్ ఏమైంది? మళ్లీ కలిసిపోయారా? ఎదురైన సవాళ్లేంటి? అనే విషయాల చుట్టూ స్వీట్‍హార్ట్ మూవీ సాగుతుంది.
సంబంధిత కథనం