జుట్టు సిల్కీగా సాఫ్ట్‌గా మారాలంటే ఈ 3 హోం మేడ్ హెయిర్ మాస్క్‌లను ప్రయత్నించండి

Best Web Hosting Provider In India 2024

జుట్టు సిల్కీగా సాఫ్ట్‌గా మారాలంటే ఈ 3 హోం మేడ్ హెయిర్ మాస్క్‌లను ప్రయత్నించండి

Haritha Chappa HT Telugu

ఎండాకాలంలో చర్మంతో పాటు జుట్టుకు కూడా అదనపు సంరక్షణ అవసరం. ఎండ వేడికి మీ జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. జుట్టు సిల్కీగా, సాఫ్ట్ గా మారడానికి ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ లను అప్లై చేయండి. వీటిని చేయడం చాలా సులభం.

హోం మేడ్ హెయిర్ మాస్క్

ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం, జుట్టు రెండూ తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ సీజన్ లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల జుట్టు చాలా డ్యామేజ్ అవుతుంది. వేసవిలో చాలా మంది జుట్టు చాలా నీరసంగా, పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీనివల్ల జుట్టు రాలడం, దురద సమస్య కూడా పెరుగుతుంది. ఈ సందర్భంలో, కొన్ని హెయిర్ మాస్కులు మీ జుట్టుకు ప్రయోజనం చేకూరుస్తాయి. పొడి జుట్టును ఎదుర్కోవడానికి, ఇక్కడ పేర్కొన్న హెయిర్ మాస్క్ ను అప్లై చేయండి, దీనిని అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, సాఫ్ట్ గా మారుతుంది. వెంట్రుకలు చిక్కుపడకుండా పట్టుకుచ్చుల్లా మారుతుంది.

మెంతి గింజలు,పెరుగు హెయిర్ మాస్క్

ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, మీకు అర కప్పు మెంతులు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు అవసరం. ఈ మాస్క్ తయారీకి మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని ఉదయాన్నే గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు హెయిర్ మాస్క్ వేసుకోవడానికి రెడీ అయింది. ఈ మాస్క్ ను మీ జుట్టుకు, మాడుకు బాగా అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తలస్నానం చేసి హెర్బల్ షాంపూను ఉపయోగించాలి. దీన్ని వారానికి రెండు సార్లు చేస్తే చాలు జుట్టు పట్టులా మారిపోతుంది.

వేపనూనె, నిమ్మరసంతో హెయిర్ మాస్క్

తలపై చుండ్రు పట్టినా కూడా వెంట్రుకలు పాడవుతాయి. వేప నూనె, నిమ్మరసం కలిపి వాడడం వల్ల చుండ్రును వదిలించుకోవచ్చు. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రెండింటి నుండి మాస్క్ తయారు చేయడానికి, 4-5 టీస్పూన్ల వేప నూనె, 1 టీస్పూన్ తాజా నిమ్మరసం తీసుకోండి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, వేప నూనెను కొద్దిగా వేడి చేయండి. తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. బాగా మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండుసార్లు వాడండి.

గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్

గుడ్డు జుట్టుకు చాలా మంచిది. ఈ హెయిర్ మాస్క్ తయారీకి రెండు గుడ్లలోని పచ్చసొన, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. తరువాత అన్ని పదార్థాలను ఒక గిన్నెలో కలపండి. ఈ మాస్క్ ను జుట్టుకు, నెత్తికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఇక్కడ చెప్పిన హెయిర్ మాస్క్‌లు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024