





Best Web Hosting Provider In India 2024

ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల, ఛాన్స్ దక్కేదెవరికో… సాయిరెడ్డి భవిష్యత్‌పై ఉత్కంఠ..
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 9న పోలింగ్ జరుగనుంది. రాజ్యసభ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరపున సాయిరెడ్డి కూడా రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఈడీ కేసులు నమోదు చేసిన తర్వాత అనూహ్యంగా ఎంపీ పదవికి సాయిరెడ్డి రాజీనామా చేశారు.
విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 9న పోలింగ్ జరుగుతుంది.
ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీ లన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
సాయిరెడ్డి భవిష్యత్‌పై క్లారిటీ వస్తుందా..
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీని వీడిన తర్వాత బీజేపీలో చేరే ప్రయత్నాలు చేసినా కూటమి పార్టీల అమోదంతోనే సాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని బీజేపీ పెద్దలు స్పష్టం చేసినట్టు ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో దూరం పెరగడం, పార్టీలో ఎదుర్కొన్న అవమానాల నేపథ్యంలో సాయిరెడ్డి తన దారి తాను చూసుకున్నారు. పొలిటికల్ రీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలో రాజకీయ ప్రత్యర్థులతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నాలు చేసినట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది.
క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించినా ఆ తర్వాత బీజేపీ నాయకులతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలు మాత్రం కొనసాగించారు. ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ హైదరాబాద్ వచ్చినపుడు స్వాగతం పలికేందుకు కూడా వెళ్లారు. గురువారం మద్యం కేసులో విచారణకు సాయిరెడ్డి హాజరు కానున్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సాయిరెడ్డి రాజీనామా ఖాళీ అయిన స్థానాన్ని ఆయనకే దక్కొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. బీద మస్తానరావు, ఆర్ కృష్ణయ్య వంటి వారు ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో సాయిరెడ్డి కూడా అదే బాటలో పయనిస్తారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి చెప్పినా తెర వెనుక ప్రయత్నాలు మాత్రం కొనసాగించారు. సాయిరెడ్డిని నేరుగా బీజేపీలో చేర్చుకుంటే గతంలో ఆయన చేసిన విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తాయి. టీడీపీ, జనసేనలపై సాయిరెడ్డి గతంలో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కూటమి పార్టీల సమ్మతితోనే సాయిరెడ్డిని చేర్చుకునేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
వైసీపీ హయంలో జరిగిన అక్రమాలపై సాయిరెడ్డితోనే బయట పెట్టించడం ద్వారా కూటమి పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్