




Best Web Hosting Provider In India 2024

సమ్మర్లో దొరికే ఈ 6 పండ్లతో మీ యూరిక్ యాసిడ్ లెవల్స్ ఇట్టే తగ్గించొచ్చట! ఏయే ఫ్రూట్స్ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే..
సమ్మర్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందట. మనం తీసుకునే ఆహరంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సమస్యను నివారించడం కష్టం. కేవలం పండ్లు తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించవచ్చట. అవేంటంటే..
సమ్మర్ సమయంలో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూనే యూరిక్ యాసిడ్ స్థాయిలను మేనేజ్ చేయడం ముఖ్యమైన పని. డీహైడ్రేషన్‌తో పాటు హీట్ కలిగితే శరీరంలో నొప్పులు మొదలవుతాయి. ప్రత్యేకించి జాయింట్ నొప్పుల విషయంలో ఈ విషయాన్ని గమనించాలి. ఇటువంటి కీలక సమయంలో ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తినడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
మీకు తాజాదనాన్ని నింపడంతో పాటు యూరిక్ యాసిడ్ ను తగ్గించే ఆ 6రకాల పండ్లేంటో చూసేద్దామా?
పైనాపిల్: అనాసపండు లేదా పైనాపిల్‌గా పిలుచుకునే ఈ ఫ్రూట్‌లో బ్రొమెలైన అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమేటరీ గుణాలను తగ్గించి వాపును నియంత్రిస్తుంది. వేసవి కాలం పైనాపిల్ తరచుగా తీసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది.
పుచ్చకాయ: నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో ముందుగా చెప్పుకోదగ్గది పుచ్చకాయ. ఇందులో యూరిక్ యాసిడ్‌కు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు సహజంగానే ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చల్లదనం అందించడంతో పాటు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపేస్తుంది.
కర్బూజ: నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో మరొకటి కర్బూజ. శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించడంలో ముందుంటుంద. మూత్ర విసర్జనను పెంచి యూరిక్ యాసిడ్ బయటకు పోయేందుకు సహాయపడుతుంది.
చెర్రీస్: చూడటానికే కాదు తినడానికి కూడా ప్రత్యేకంగా అనిపించే చెర్రీలు యాంటీఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటాయి. వీటిల్లో ఉండే ఆంథోసియానిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గించి శరీరంలో యూరిక్ యాసిడ్ తయారు కావడాన్ని తగ్గిస్తుంది.
సైట్రస్ ఫ్రూట్స్: విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు సైట్రస్ పండ్లు. అంటే నిమ్మకాయ, నారింజ, బత్తాయి లాంటివి. ఇవి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్‌ను కరిగిపోయేలా చేసి కిడ్నీ ఫంక్షన్‌ను మెరుగుచేస్తాయి.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ ఉంటుంది. ఇి జీర్ణక్రియకు సహకరించడంతో పాటు ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పడిపోతాయి.
జామకాయ: జామకాయలో విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీకి సపోర్ట్ చేయడమే కాదు. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలోనూ బాగా సహాయపడతాయి.
దోసకాయ: టెక్నికల్ గా చెప్పుకోవాలంటే దోసకాయ లేదా కీరదోస కూడా ఒక ఫ్రూట్ యే. సమ్మర్లో తినడానికి చాలా అనువైనది. ఇందులో కూలింగ్ కలిగించే గుణంతో పాటు సహజంగానే హైడ్రేటింగ్‌కు తోడ్పడుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగించి, యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది.
ఆరోగ్యకరమైన పండ్లు తినడంతో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవడంతో పాటు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా యారిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటంటే,
- కచ్చితంగా రోజులో 2.5 నుంచి 3 లీటర్ల వరకూ నీరు తాగాలి.
- వాటితో పాటుగా వేసవిలో ఆల్కహాల్ తీసుకోవడం, లేదా సాఫ్ట్ డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి.
- రెడిమేడ్ గా దొరికే జ్యూస్ ల కంటే ఫ్రెష్ పండ్లు తినడం ఎంతో బెటర్.
- ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, తక్కువ కొవ్వు శాతం ఉన్న పాల పదార్థాలను తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్