Sumaya Reddy: కరోనా టైమ్‌లో రోజు ఓ కల వెంటాడుతుండేది.. దానిమీదే సినిమా కథ రాసుకున్నా.. హీరోయిన్ సుమయ రెడ్డి కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Sumaya Reddy: కరోనా టైమ్‌లో రోజు ఓ కల వెంటాడుతుండేది.. దానిమీదే సినిమా కథ రాసుకున్నా.. హీరోయిన్ సుమయ రెడ్డి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Sumaya Reddy About Dear Uma Story Inspiration: హీరోయిన్‌గా, రైటర్‌గా, నిర్మాతగా సుమయ రెడ్డి చేసిన తెలుగు సినిమా డియర్ ఉమ. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల డియర్ ఉమ మూవీ విశేషాలను పంచుకుంది హీరోయిన్ సుమయ రెడ్డి.

కరోనా టైమ్‌లో రోజు ఓ కల వెంటాడుతుండేది.. దానిమీదే సినిమా కథ రాసుకున్నా.. హీరోయిన్ సుమయ రెడ్డి కామెంట్స్

Sumaya Reddy About Dear Uma Story Inspiration: తెలుగు హీరోయిన్ సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా చేసిన సినిమా డియర్ ఉమ. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం నిర్వహించారు.

అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సంగీతం అందించిన డియర్ ఉమ ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ సుమయ రెడ్డి డియర్ ఉమ సినీ విశేషాలను విలేకరుల సమావేశంలో ఇటీవల పంచుకున్నారు.

సుమయ రెడ్డి గారు మీ నేపథ్యం ఏంటి?

-మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాను. కానీ, అది అంత సులభం కాదు అని అర్థమైంది.

డియర్ ఉమ కథను రాయడానికి, సినిమా చేయడానికి స్పూర్తి ఏంటి?

కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూనే ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించింది. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే కథను రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా మా చిత్రం ఉంటుంది.

డియర్ ఉమ చిత్రంలోకి పృథ్వీ అంబర్ ఎలా వచ్చారు?

తెలుగు హీరోని ట్రై చేశాం. కానీ, చాలా కారణాల వల్ల మిస్ అవుతూ వచ్చాం. కానీ, పృథ్వీ అంబర్‌కి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. కొత్త ప్రొడక్షన్ అని కూడా చూడకుండా కథ నచ్చిన వెంటనే ఓకే చెప్పారు.

డియర్ ఉమ చిత్రంలో వైద్య రంగం మీద విమర్శలు గుప్పిస్తున్నారా?

-కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే వాటిని చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్‌ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తాం.

డియర్ ఉమ చిత్రం ఎలా ఉండబోతోంది?

-డియర్ ఉమ చిత్రం కాస్త ఫిక్షనల్. కాస్త రియల్. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ని కూడా చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా చిత్రం ఉంటుంది. హీరోయిన్‌గా ఉండి నిర్మాతగానూ సినిమాను చేయాలని అనుకోలేదు. కానీ, అలా చేయాల్సి వచ్చింది.

డియర్ ఉమ చిత్రానికి బడ్జెట్ పెరిగిందా?

-డియర్ ఉమ సినిమాకి ముందు అనుకున్న దానికంటే ఎక్కువే పెరిగింది. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరినీ పెద్ద వాళ్లని తీసుకున్నాం. ఆర్టిస్టుల్ని కూడా చాలా పెద్ద వాళ్లని తీసుకున్నాం. అలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ బడ్జెట్ పెరుగుతూనే వచ్చింది.

నటించడం కష్టమా? సినిమాలు నిర్మించడం కష్టమా?

-నటించడం చాలా సులభం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. అసలు ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా తెలీదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అలా వెళ్తుంటే బాధగానే ఉంటుంది. ఈ చిత్రం కోసం మేం అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా పెట్టేశాను.

డియర్ ఉమ టీం గురించి చెప్పండి?

-సాయి రాజేష్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నా దగ్గరున్న డియర్ ఉమ కథను ఆయనకు చెబితే చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రధన్ గారి మ్యూజిక్ ప్రాణం. కెమెరామెన్ రాజ్ తోట గారి విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఏప్రిల్ 18న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024