Jr Ntr: చూడ‌టానికి సింపుల్ …కానీ చాలా కాస్ట్‌లీ – జూనియ‌ర్ ఎన్టీఆర్ ధ‌రించిన ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Jr Ntr: చూడ‌టానికి సింపుల్ …కానీ చాలా కాస్ట్‌లీ – జూనియ‌ర్ ఎన్టీఆర్ ధ‌రించిన ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా?

Nelki Naresh HT Telugu

Jr Ntr: ప్ర‌స్తుతం ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు ఎన్టీఆర్‌. దుబాయ్ వెకేష‌న్ ఫొటోల్లో ఎన్టీఆర్ ధ‌రించిన నీలిరంగు ష‌ర్ట్ ధ‌ర 85 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని అభిమానులు చెబుతోన్నారు. చూడ‌టానికి సింపుల్‌గా ఉన్న ష‌ర్ట్ మాత్రం చాలా కాస్ట్‌లీ అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తోన్నారు.

జూనియర్ ఎన్టీఆర్

ప్ర‌స్తుతం ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌కి వెకేష‌న్‌లో ఉన్నారు ఎన్టీఆర్‌. సినిమా షూటింగ్‌లు, ప్ర‌మోష‌న్స్‌కు స్వ‌ల్ప విరామం ప్ర‌క‌టించిన యంగ్ టైగ‌ర్ ఈ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఎన్టీఆర్ దుబాయ్ వెకేష‌న్ ట్రిప్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ఈ ఫొటోల్లో పువ్వుల డిజైన్‌తో కూడిన నీలిరంగు ష‌ర్ట్ ధ‌రించి ఎన్టీఆర్ క‌నిపిస్తున్నారు. చూడ‌టానికి సింపుల్‌గా క‌నిపిస్తోన్న…ఈ ష‌ర్ట్ మాత్రం చాలా కాస్ట్‌లీ అని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ఎట్రో అనే ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్‌కు చెందిన ఈ ష‌ర్ట్ ధ‌ర 65 వేల నుంచి 85 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ ష‌ర్ట్ ధ‌ర తెలుపుతూ ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

వార్ 2తో బాలీవుడ్‌లోకి…

వార్ 2 మూవీతో ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో హృతిక్ రోష‌న్ మ‌రో హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర సాగుతుంద‌ని, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్ ఇద‌ని అంటున్నారు.

ఆగ‌స్ట్ 14న వార్ 2 పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ యాక్ష‌న్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాన్ అబ్ర‌హంతో పాటు ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు.

ప్ర‌శాంత్ నీల్ మూవీ…

మ‌రోవైపు తెలుగులో ప్ర‌శాంత్ నీల్ మూవీతో పాటు దేవ‌ర‌2లో ఎన్టీఆర్ న‌టించ‌బోతున్నాడు. ఏప్రిల్ 22 నుంచి ప్ర‌శాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ భాగం కాబోతున్న‌ట్లు ఇటీవ‌లే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది.

పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌…

ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు తెలిసింది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా స‌ప్త సాగ‌రాలు దాటి ఫేమ్‌, క‌న్న‌డ న‌టి రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.సంక్రాంతి కానుక‌గా 2026 జ‌న‌వ‌రి 9న ఈ మూవీ విడుద‌ల‌కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

దేవ‌ర 2 క‌న్ఫామ్‌

దేవ‌ర 2 ఆగిపోయిన‌ట్లు గ‌త కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఇటీవ‌లే మ్యాడ్ 2 ప్ర‌మోష‌న్స్‌లో దేవ‌ర సీక్వెల్‌పై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. దేవ‌ర 2 సినిమా ఉంద‌ని అన్నాడు. ప్ర‌శాంత్ నీల్ మూవీ త‌ర్వాతే దేవ‌ర 2 షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024