గుప్పెడంత మనసు రిషి, వసు కలిసి మరో సీరియల్ చేస్తున్నారా? ఆ సీరియల్ ఇదే అంటూ వార్తలు.. అందులో నిజమెంత?

Best Web Hosting Provider In India 2024

గుప్పెడంత మనసు రిషి, వసు కలిసి మరో సీరియల్ చేస్తున్నారా? ఆ సీరియల్ ఇదే అంటూ వార్తలు.. అందులో నిజమెంత?

Hari Prasad S HT Telugu

గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు వారికి దగ్గరైన పాత్రలు రిషి, వసుధార. ఇద్దరు కన్నడ నటీనటులు పోషించిన ఈ పాత్రలకు చాలా పాపులారిటీ ఉంది. దీంతో ఈ ఇద్దరూ కలిసి మరో సీరియల్లో నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత?

గుప్పెడంత మనసు రిషి, వసు కలిసి మరో సీరియల్ చేస్తున్నారా? ఆ సీరియల్ ఇదే అంటూ వార్తలు.. అందులో నిజమెంత?

గుప్పెడంత మనసు.. స్టార్ మాలో వచ్చిన టాప్ సీరియల్స్ లో ఇదీ ఒకటి. సుమారు నాలుగేళ్ల పాటు ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. గతేడాది ఆగస్ట్ లో ముగిసింది. అయితే ఇందులో ప్రధాన పాత్రలైన రిషి, వసుధార పాత్రల్లో నటించిన ముకేశ్ గౌడ, రక్ష గౌడ కలిసి మరో సీరియల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రిషి, వసుధార కలిసి నటిస్తున్నారా?

రిషి, వసుధార కలిసి మరో సీరియల్లో నటిస్తున్నారని, ఆ సీరియల్ కూడా స్టార్ మాలోనే రానుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది గుప్పెడంత మనసు సీరియల్ కు సీక్వెల్ అని, దీని పేరు నిండు మనసులు అని కూడా అన్నారు. అయితే ఈ సీరియల్ ప్రోమో రిలీజైన తర్వాత అదంతా ఉత్తదే అని తేలిపోయింది.

అసలు అది గుప్పెడంత మనసు సీరియల్ కు కొనసాగింపు కాదని, అందులో ముకేశ్, రక్ష నటించడం లేదని తేలిపోయింది. దీంతో ఈ జంట అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. అయినా వాళ్లు కలిసి మరో సీరియల్లో నటించబోతున్నారన్న వార్తలు మాత్రం ఆగలేదు.

కొత్తగా తెరపైకి మరో సీరియల్

రిషి, వసుధార అంటే ముకేశ్, రక్ష గౌడ జంట స్టార్ మానే రూపొందిస్తున్న మరో సీరియల్లో నటించబోతున్నారని మళ్లీ తెరపైకి వార్తలు వస్తున్నాయి. ఈ సీరియల్ పేరు రాధేశ్యామ అని కూడా కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఊదరగొట్టారు.

అయితే తాజా అప్డేట్ ప్రకారం అది కూడా నిజం కాదని తేలిపోయింది. స్టార్ మాలో అసలు అలాంటి సీరియలే లేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీంతో రిషి, వసుధార ఫ్యాన్స్ ఈ జంటను మళ్లీ తెరపై చూడటానికి ఎన్నాళ్లో ఆగాలో అంటూ నిరాశ చెందుతున్నారు.

గుప్పెడంత సీరియల్ గురించి..

గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 7, 2020న ప్రారంభమైంది. సుమారు నాలుగేళ్ల పాటు ఏకంగా 1168 ఎపిసోడ్ల పాటు ఈ సీరియల్ అలరించింది. మొత్తానికి గతేడాది ఆగస్ట్ 31న చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది.

ఒక దశలో టీఆర్పీల్లో టాప్ రేటింగ్స్ సాధించిన ఈ సీరియల్ మధ్యలో కొన్ని ఒడుదుడుకులు కూడా ఎదుర్కొంది. సీరియల్ టైమింగ్స్ ను కూడా అప్పుడప్పుడూ మార్చారు. మొత్తానికి సీరియల్ చివరికి వచ్చే సరికి మరోసారి మంచి రేటింగ్స్ తోనే ముగించింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024