




Best Web Hosting Provider In India 2024
సీయూఈటీ పీజీ 2025 ‘ఆన్సర్ కీ’ని ఎలా చెక్ చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
సీయూఈటీ పీజీ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీ సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత ఈ కింద స్టెప్స్ ఫాలో అయ్యి డౌన్లోడ్ చేసుకోండి..
సీయూఈటీ పీజీ 2025 కి సంబంధించిన ప్రొవిజనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలోనే విడుదల చేయనుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exams.nta.ac.in/CUET-PG వద్ద చెక్ చేసుకోవచ్చు.
సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఫీజు చెల్లించి రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఆన్సర్ కీ విడుదల చేసిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లో చెబుతారు.
సవాళ్లకు సరైన ఆధారాలు లేకపోయినా, నిర్దేశిత లింక్ కాకుండా మరే ఇతర మాధ్యమం ద్వారా దాఖలు చేసినా సంబంధిత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోబోమని ఎన్టీఏ తెలిపింది. లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్టీఏ నిర్ణయమే అంతిమమని, తదుపరి కమ్యూనికేషన్‌ని అనుమతించబోమని స్పష్టం చేసింది.
సవాళ్లను సమర్పించిన తర్వాత, అందుకున్న అన్ని అభ్యర్థనలను పరిశీలిస్తుంది ఎన్టీఏ. దాని ఆధారంగా సీయూఈటీ పీజీ 2025 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా సీయూఈటీ-పీజీ 2025 ఫలితాలను ప్రకటిస్తారు.
సీయూఈటీ-పీజీ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఇలా చెక్ చేసుకోండి..
1. exams.nta.ac.in/CUET-PG/ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ 2025 చెక్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.
3. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
4. స్క్రీన్‌పై కనిపించే మీ సీయూఈటీ-పీజీ 2025 ఆన్సర్ కీని చెక్ చేసుకోండి.
5. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
సీయూఈటీ-పీజీ 2025 పరీక్షను 2025 మార్చ్ 13 నుంచి 2025 ఏప్రిల్ 1 వరకు జరిగింది. 90 నిమిషాల చొప్పున 43 షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇది.. 157 సబ్జెక్టులకు నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ).
అభ్యర్థులు సీయూఈటీ పీజీ సంబంధిత అప్డేట్స్, వివరాల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link