





Best Web Hosting Provider In India 2024

Thalapathy Vijay: 13ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన దళపతి విజయ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Thalapathy Vijay – Nanban OTT: నన్‍బన్ సినిమా మరో ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలివే..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘నన్‍బన్’ సినిమా 2012 జనవరిలో విడుదలైంది. జీవా, శ్రీకాంత్, ఇలియానా కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్స్ చేశారు. బాలీవుడ్ మూవీ ‘3 ఇడియట్స్’కు రీమేక్‍గా ఇది రూపొందింది. ఈ నన్‍బన్ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. అయితే, ఈ రీమేక్ మూవీ అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేదు. కాగా, ఈ చిత్రం ఇన్నేళ్లకు ఇప్పుడు రెండో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
నన్‍బన్ సినిమా ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ చాలా ఏళ్ల క్రితమే జియోహాట్‍స్టార్ (డిస్నీ+ హాట్‍స్టార్) ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత ఇలా మరో ప్లాట్‍ఫామ్‍లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.
ఇంజినీరింగ్ కాలేజీ.. ముగ్గురు స్నేహితులు
నన్‍బన్ సినిమా ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ముగ్గురు స్నేహితుల మధ్య సాగుతుంది. ఆ ముగ్గురు చేసే పనులు, స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. చాలా మంది స్నేహితులకు, కాలేజీ విద్యార్థులకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ మూవీ ఉంటుంది. ఎమోషనల్ సీన్లు కూడా ఉంటాయి. హిందీ వెర్షన్ ‘3 ఇడియట్స్’ కథకు పెద్దగా మార్పులు చేయకుండానే తమిళంలో నన్బన్ తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో పర్ఫార్మ్ చేయలేకపోయింది. తెలుగులోనూ స్నేహితుడు పేరుతో ఈ మూవీ విడుదలైంది.
నన్‍బన్ చిత్రంలో దళపతి విజయ్‍కు జోడీగా ఇలియానా నటించారు. శ్రీకాంత్, జీవా ఫ్రెండ్స్ పాత్రల్లో చేశారు. సత్యరాజ్, సత్యన్, అనుయా, టీఎం కార్తీక్, మనోబాలా, ఆడుకాలం నరేన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై మనోహర్ ప్రసాద్, రవిశంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
హీరో ఎంపికలో ట్విస్టులు!
నన్‍బన్ సినిమాను 2010లో ముందుగా దళపతి విజయ్ ఓకే చేశారు. కానీ డేట్లు కుదరదనే ఉద్దేశంతో ఆ తర్వాత ఈ మూవీ వద్దనుకున్నారు. దీంతో సూర్యను హీరోగా తీసుకోవాలని మేకర్స్ చర్చలు జరిపారు. కానీ అది జరగలేదు. దీంతో మళ్లీ విజయ్‍నే నిర్మాతలు సంప్రదించగా.. అప్పుడు ఆయన ఓకే చేశారు. ఇలా ముందు వద్దనుకున్న ప్రాజెక్ట్.. మళ్లీ విజయ్ దగ్గరికే వచ్చింది. ఈ మూవీలో తన నటనతో విజయ్ మెప్పించారు.
ప్రస్తుతం ఇలా..
దళపతి విజయ్ ప్రస్తుతం జయనాయగన్ సినిమా చేస్తున్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఇదే తన చివరి మూవీ అని ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2026 జనవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. పొలిటికల్ యాక్షన్ జానర్లో ఈ మూవీ ఉండనుంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా చేస్తున్నారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, మమితా బైజూ కీరోల్స్ చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్